ఆర్యసమాజ్

హిందూ ధార్మిక సంస్థ
(ఆర్యసమాజం నుండి దారిమార్పు చెందింది)


ఆర్యసమాజము సవరించు

 
Maharishi Dayananda Saraswati
 • ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న, బొంబాయి (ముంబాయి) లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
 • ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడింది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా,, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీనిముఖ్యఉద్దేశము.

ముఖ్యోద్దేశ్యము సవరించు

 • ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం ", అనగా.. సమసమాజ స్థాపన.
 • ఆర్యసమాజనికి మూలమువేదాలు, వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోడీకరించారు.
 • ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట, ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
 • ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, బ్రిటన్, నెదర్ల్యాండ్స్, కెన్యా, టాంజేనియా, దక్షిణ ఆఫ్రికా, మారిషియస్, పాకిస్తాన్, బర్మా, సింగాపుర్, హంగ్‌కాంగ్ లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
 • ఆర్యసమాజము వేదాలు, ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త, అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించింది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత, రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.

సమాజములో ఆర్యసమాజము సవరించు

 • వేదాలు చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన భారతీయ సంస్కృతి ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భిన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
 • మూర్తిపూజ, హిందు సంస్కృతి పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం సమర్ధించదు.
 • స్త్రీ లకు, హరిజనులకు స్వాతంత్ర్యం, విద్యను సమర్థిస్తుంది.
 • దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించింది.
 • స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
 • మూర్తి పూజ, నరబలి, సతి సహగమనము - వీటిని నిరసించును.
 • సమస్త సత్య విద్యల గ్రంథమైన " సత్యార్థ ప్రకాశ్ "ను ప్రచారము చేసినది.
 • భారత వర్షాన్ని విస్తృత , సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము ప్రాశ్చాత్యులను అనుకరించడము లేదా నవీన ఆలోచనావిధానాలు కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
 • సమాజ్ లక్ష్యం భారత దేశానికి సాంఘిక , ధర్మ సంస్కరణ
 • సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
 • హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు , హిందు లౌకికవాదులకు దూరమైనది.
 • భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణకలిగించినది.
 • ఆర్యసమాజ్ శాఖల పరిధులలోని యువకులతో ఆర్యవీర్ దళ్ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, యోగాభ్యాసంలో శిక్షణ ఇచ్చేవారు.

బృహత్కార్యములు సవరించు

 • అజ్ఞానము, దారిద్ర్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యాచరణ కై పది సూత్రాలను క్రోడీకరించినది.
 • నాలుగు వేదాలైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
 • భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాళుడు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
 • ఓంకారమే నినాదముగా, " సత్యార్థ ప్రకాశ్ "ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
 • విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారతదేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
 • సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
 • వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రోత్సహిస్తున్నారు.

వైదిక దినచర్య సవరించు

ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు సవరించు

ఆర్యసమాజ ప్రముఖులు సవరించు

బయటి లింకులు సవరించు