ఆర్.ఎన్.దొరైస్వామి

ఆర్.ఎన్.దొరైస్వామి కర్ణాటక సంగీత వైణిక విద్వాంసుడు.[1]

ఆర్.ఎన్.దొరైస్వామి
వ్యక్తిగత సమాచారం
జననం(1916-12-12)1916 డిసెంబరు 12
రుద్రపట్టణ, హసన్ జిల్లా, కర్ణాటక
మరణం2002 ఆగస్టు 17(2002-08-17) (వయసు 85)
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తివైణికుడు
వాయిద్యాలువీణ

విశేషాలు

మార్చు

ఇతడు 1916, డిసెంబరు 12వ తేదీన కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా రుద్రపట్టణలో నాలా వెంకట్రామయ్య, సావిత్రమ్మ దంపతులకు జన్మించాడు. తండ్రి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. తల్లి సంగీతాభిలాషి. ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని సేలం దొరైస్వామి అయ్యంగార్‌ వద్ద అభ్యసించాడు. తరువాత వీణను వీణ వెంకటగిరియప్ప వద్ద నేర్చుకున్నాడు. తన గురువు వెంకటగిరియప్పతో కలిసి అనేక కచేరీలు చేయడానికి ఉత్తర భారతదేశం తిరిగాడు. మైసూరు మహారాణి కళాశాలలో కొంతకాలం సంగీత అధ్యాపకుడిగా పనిచేశాడు. మైసూరు విశ్వవిద్యాలయం లలితకళల విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. మైసూరు ప్రభుత్వం నడిపే సంగీత పరీక్షా మండలి ముఖ్య పరీక్షకుడిగా, సంగీత కళాభివర్ధిని సభ కార్యదర్శిగా సేవలను అందించాడు. వీణావాదనపై "భారతీయ సంగీత వాద్యాలు" అనే డాక్యుమెంటరీ నిర్మించాడు. తిరుమకూడలు చౌడయ్యతో కలిసి జంటగా అనేక కచేరీలు నిర్వహించాడు. రామనవమి, గణేశోత్సవాలు వంటి సందర్భాలలో అనేక కచేరీలు చేశాడు. ఆకాశవాణి మద్రాసు కేంద్రం నుండి ఇతని వీణాగాన కచేరీలు పలుమార్లు ప్రసారం అయ్యాయి. ఇతడు మైసూర్ ప్యాలెస్‌లో ఆస్థాన విద్వాంసునిగా నియమితుడైనాడు. అనేక సంగీత గ్రంథాలను రచించాడు. స్వయంగా కొన్ని కృతులకు స్వరకల్పన చేశాడు.

పురస్కారాలు

మార్చు

ఇతనికి పలు పురస్కారాలు వరించాయి.

  • 1989లో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారంతో సన్మానించింది.
  • 1983లో కర్ణాటక సంగీత నృత్య అకాడమీ "కర్ణాటక కళాతిలక" బిరుదును ప్రదానం చేసింది.
  • సరస్వతి గాన కళామందిర్, మైసూరు వారు "వైణిక విద్యావారధి" బిరుదును ప్రదానం చేశారు.
  • కళాభివర్ధిని సభ నుండి "గానరత్నాకర" బిరుదు.
  • కర్ణాటక సంగీత గాత్రవిద్వాంసుడు బి.దేవేంద్రప్ప చేత "వైణిక ప్రవీణ" బిరుదు.
  • గాయన సమాజ, బెంగళూరు వారిచే "సంగీత కళారత్న" బిరుదు.
  • చౌడయ్య స్మారక పురస్కారం
  • 2001లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారిచే అవార్డు

ఇతడు 2002, ఆగస్టు 17వ తేదీన మరణించాడు.

మూలాలు

మార్చు
  1. web master. "R. N. Doreswamy". SANGEET NATAK AKADEMI. SANGEET NATAK AKADEMI. Retrieved 27 March 2021.[permanent dead link]

బయటి లింకులు

మార్చు