ఆర్.డి. బెనర్జీ
RD బెనర్జీ (1885 ఏప్రిల్ 12 - 1930 మే 23) భారతీయ పురావస్తు శాస్త్రవేత్త, మ్యూజియం నిపుణుడు. అతడి అసలు పేరు రఖల్దాస్ బంద్యోపాధ్యాయ.1928–30 వరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో అతడు మణీంద్ర చంద్ర నందీ ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి ల ప్రొఫెసరుగా పనిచేసాడు. హరప్పా సంస్కృతికి చెందిన ప్రధాన ప్రదేశమైన మొహెంజో-దారో ఆవిష్కర్తగా అతడు ప్రసిద్ధి చెందాడు. [4]
ఆర్.డి.బెనర్జీ | |
---|---|
జననం | [1][2] | 1885 ఏప్రిల్ 12
మరణం | 1930 మే 23 కాళీఘాట్, కలకత్తా | (వయసు 45)
వృత్తి | పురావస్తు శాస్త్రవేత్త, చారిత్రికుడు, భాషా శాస్త్రవేత్త, నవలా రచయిత |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | మొహెంజో దారో తవ్వకాలు |
విద్యా నేపథ్యం | |
చదువుకున్న సంస్థలు | కలకత్తా విశ్వవిద్యాలయం |
పరిశోధక కృషి | |
పనిచేసిన సంస్థలు | బెనారస్ హిందూ విశ్వవిద్యలయం |
తొలి జీవితం, నేపథ్యం
మార్చుబంద్యోపాధ్యాయ 1885 ఏప్రిల్ 12 న [2] ప్రస్తుత పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లా బెర్హంపూర్‌లో మాటీలాల్, కాళీమతి దంపతులకు జన్మించాడు. [1] [3] 1900 లో బెర్హంపూర్‌లోని కృష్ణాథ్ కాలేజీ స్కూల్ నుంచి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. వెంటనే అతను నరేంద్రనాథ్ ముఖోపాధ్యాయ కుమార్తె కాంచనమాల (1891-1931) ను పెళ్ళి చేసుకున్నాడు. 1903 లో తన FA పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. 1907 లో కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాల నుండి చరిత్రలో ఆనర్స్‌తో పట్టభద్రుడయ్యాడు. అతను 1911 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో MA ను పొందాడు. [5]
వ్యాసంగం
మార్చుబంద్యోపాధ్యాయ 1910 లో కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంలో పురావస్తు విభాగానికి సహాయకుడిగా చేరాడు. 1911 లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా చేరాడు. 1917 లో పశ్చిమ వృత్తపు సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టుగా పదోన్నతి పొందాడు. 1924 లో, అతను తూర్పు సర్కిల్‌కు బదిలీ అయ్యాడు. అప్పుడు పహార్‌పూర్ వద్ద తవ్వకాలలో పాల్గొన్నాడు. 1926 లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసాడు. కలకత్తా విశ్వవిద్యాలయంలో కొన్నాళ్ళు బోధించిన తరువాత, [6] 1928 లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరాడు. 1930 మే 23 న అకాల మరణం పొందేవరకు ఈ పదవిలో ఉన్నాడు. [7]
బంద్యోపాధ్యాయ, తన మొట్టమొదటి ప్రధాన స్వతంత్ర వృత్తిపరమైన పని పాలియోగ్రఫీ, ఎపిగ్రాఫీ రంగాలలో చేసాడు. 1919 లో ప్రచురితమైన ది ఆరిజిన్ ఆఫ్ ది బెంగాలీ స్క్రిప్ట్ కు గాను కలకత్తా విశ్వవిద్యాలయం వారి జూబ్లీ పరిశోధన బహుమతిని గెలుచుకున్నాడు. ఆ పుస్తకాన్ని 1973 లో మళ్ళీ ముద్రించారు. బంగ్లా లిపి యొక్క అసలు రూపమైన ప్రోటో-బంగ్లా లిపిని అధ్యయనం చేసిన మొదటి వ్యక్తి బంద్యోపాధ్యాయ. అతను మధ్యయుగపు భారతీయ నాణేల పైన, భారతీయ ఐకనోగ్రఫీ పైనా ప్రామాణికమైన రచనలు చేసాడు. ముఖ్యంగా గుప్తుల కాలపు శిల్పం, వాస్తురీతిపై రాసాడు. అతని ప్రసిద్ధ రచన ఈస్టర్న్ ఇండియన్ మెడీవల్ స్కూల్ ఆఫ్ స్కల్ప్చర్‌ను 1933 లో అతడు మరణించాక ప్రచురించారు.
మోహెంజో-దారో ఆవిష్కరణ
మార్చుమొహెంజో-దారో వద్ద బౌద్ధ పూర్వ కాలానికి చెందిన హస్తకృతులను వెలికితీసినందుకు, మొహెంజో-దారో, హరప్పా స్థలాల మధ్య సారూప్యతలను గుర్తించినందుకూ బంద్యోపాధ్యాయ ప్రసిద్ధి చెందాడు. ఆ ఆవిష్కరణలే, ఆ రెండు సైట్లలో తవ్వకాలు జరిగి, అప్పటికి తెలియని కాంస్య యుగపు సింధు లోయ నాగరికత ఉనికిని కనుగొనడానికి దారితీసాయి. [8] ఈ నాగరికత గురించి ఆయన చేసిన వ్యాఖ్యానాలు, వివరణలు అనేక వ్యాసాల్లో, అనేక పుస్తకాలలో ప్రచురించబడ్డాయి. వాటిలో కొన్ని: "ఎన్ ఇండియన్ సిటీ ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఎగో" ; "మొహెంజో-దారో" (బంగ్లా, బసుమతి, 1331 బిఎస్); ప్రి హిస్టారిక్, ఏన్షెంట్, హిందూ ఇండియా (1934 లో మరణానంతరం ప్రచురించబడింది), మహెంజో-దారో - ఎ ఫర్గాటెన్ రిపోర్ట్.
కృషి
మార్చుకలకత్తా విశ్వవిద్యాలయానికి బంద్యోపాధ్యాయ రెండు పాఠ్యపుస్తకాలు రాశాడు. అవి హిస్టరీ ఆఫ్ ఇండియా (1924), ఎ జూనియర్ హిస్టరీ ఆఫ్ ఇండియా (1928). ది ఏజ్ ఆఫ్ ది ఇంపీరియల్ గుప్తాస్ (1933) అనేది 1924 లో ఆయన చేసిన ఉపన్యాసాల సమాహారం. బెంగాలీలో అతడు రాసిన రెండు సంపుటుల బంగలార్ ఇతిహాస్ (1914, 1917) బెంగాల్ చరిత్రను శాస్త్రీయంగా రచించిన మొదటి పుస్తకాలలో ఒకటి. ఒరిస్సా చరిత్రపై హిస్టరీ ఆఫ్ ఒరిస్సా ఫ్రమ్ ఎర్లీస్ట్ టైమ్స్ టు బ్రిటిష్ పీరియడ్ (1930, 1931) అనే రెండు సంపుటాలను కూడా రాశాడు.
అతని ఇతర ముఖ్యమైన కాల్పనికేతర రచనలు, ప్రాచీన్ ముద్రా (1915), ది పాలాస్ ఆఫ్ బెంగాల్ (1915), ది టెంపుల్ ఆఫ్ శివ ఎట్ భూమారా (1924), ది పాలియోగ్రఫీ ఆఫ్ హాతి గుంప అండ్ నానాఘాట్ ఇన్‌స్క్రిప్షన్స్ (1924), బాస్ రిలీఫ్స్ ఆఫ్ బాదామి ( 1928), హైహయాస్ ఆఫ్ త్రిపురి అండ్ దెయిర్ మాన్యుమెంట్స్ (1931).
పక్షాంతర్ (1924), బ్యతిక్రమ్ (1924), అనుక్రమ్ (1931) అనే మూడు పుస్తకాలు బెంగాలీ భాషలో అతడు రాసిన చారిత్రక కల్పనా రచనలు. అతని పాశనేర్ కథ (1914) నేపధ్యం కుషాణుల కాలం. అతని మరో మూడు నవలలు, ధ్రుబా, కరుణ (1917), శశాంకా (1914) గుప్తుల కాలంలోని వివిధ దశలకు చెందినవి. అతని ధర్మపాల (1915) పాల చక్రవర్తి ధర్మపాలుడి కథను వివరిస్తుంది. మయూఖ్ (1916) లో షాజహాన్ పాలనలో బెంగాల్‌లో జరిగిన పోర్చుగీసు దురాగతాలను వివరించాడు. అసిం (1924) లో ఫరుఖ్‌సియార్ పాలనలో బెంగాల్ పరిస్థితిని వివరించాడు. అతని చివరి నవల, లట్ఫ్-ఉల్లా నాదిర్ షా దాడి చేసిన సమయపు ఢిల్లీ నేపథ్యంలో ఉంటుంది. మరో కల్పిత రచన, హేమకనా (అసంపూర్ణం) 1911–12 నుండి ప్రబాసి పత్రికలో ప్రచురితమైంది. అతడు రాసిన నవలల్లో అనేక నవలలు ఇతర భారతీయ భాషల లోకి అనువదించబడ్డాయి.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "রাখালদাস নিজেই গড়ে ফেললেন ইতিহাস". Anandabazar Patrika. 7 Jan 2020. Retrieved 20 Oct 2020.
- ↑ 2.0 2.1 "Scientist of the Day - R. D. Banerji". 12 April 2017. Retrieved 20 Oct 2020.
- ↑ 3.0 3.1 Sengupta, Subodhchandra; Bose, Anjali (1976). Samsad Bangali Charitabhidhan(Biographical dictionary). Calcutta: Sahitya Samsad. p. 455.
- ↑ "Banerji robbed of credit for Indus findings".
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-01-02. Retrieved 2021-02-10.
- ↑ "Some of our Distinguished Teachers: Rakhaldas Banerji". University of Calcutta. Archived from the original on 21 November 2011. Retrieved 29 July 2013.
- ↑ Sengupta, Subodh Chandra (ed.) (1988) Sansad Bangali Charitabhidhan (in Bengali), Kolkata: Sahitya Sansad, p.465
- ↑ Humes, Cynthia Ann (2012). "Hindutva, Mythistory, ; Pseudoarchaeology". Numen: International Review for the History of Religions. 59 (2–3): 178–201. doi:10.1163/156852712x630770. JSTOR 23244958.