ఫర్రుక్‌సియార్
అబు ముజాఫర్ ముయిన్ - ఉద్ - దిన్ ముహమ్మద్ షా ఫర్రూక్ - షియార్ అలిం అక్బర్ శని వాలా షా పాద్షా - ఐ- బార్ - ఉ- (షాహిద్ - ఐ- మజ్లం) (లేక ఫర్రుక్‌సియార్ 1685 ఆగస్టు 20 - 1719 ఏప్రిల్ 19) ముఘల్ చక్రవర్తులలో ఒకరు. ఆయన 1713-1719 మద్యకాలంలో పాలన సాగించాడు. ఆయన గంభీరమైన పాలకుడు. ఆయన సలహాదారులు ఆయనను అధికంగా నడిపిస్తుంటారు. ఆయనకు స్వయంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిఙానం కొరతగా ఉండేది. ఫర్రుక్‌సియార్ తండ్రి అజం- ఉష్ - షా చక్రవర్తి మొదటి బహదూర్ షా, సాహిబా నివాజ్‌ల రెండవ కుమారుడు. ఆయన పాలనలో సయ్యద్ సోదరుల ఆధిక్యత అధికంగా ఉండేది. సయ్యద్ సోదరులు చక్రవర్తి వెనుక ఉండి వారికి అనుకూలంగా మొఘల్ రాజ్యాంగాన్ని నడిపించేవారు. సయ్యద్ సోదరుల సలహాలు చివరికి ఫర్రుక్‌సియార్ను పదవీచ్యుతుని చేసింది. .
ఫర్రుక్‌సియార్ | |||||
---|---|---|---|---|---|
10th Mughal Emperor | |||||
పరిపాలన | 11 January 1713 – 28 February 1719 | ||||
పూర్వాధికారి | Jahandar Shah | ||||
ఉత్తరాధికారి | Rafi Ul-Darjat | ||||
జననం | 20 August 1685 Aurangabad, Mughal Empire | ||||
మరణం | 29 April 1719 (aged 33) Delhi, Mughal Empire | ||||
Burial | Humayun's Tomb, Delhi | ||||
Spouse | Fakhr-un-Nissa Begum Rajkumari Indira Kanwar | ||||
వంశము | Badshah Begum, Mughal Empress | ||||
| |||||
రాజవంశం | Timurid | ||||
తండ్రి | Azim-ush-Shan | ||||
తల్లి | Sahiba Nizwan | ||||
మతం | Islam |
ఆరంభకాల జీవితం
మార్చుఫర్రుక్సియార్ ముందు మీర్ ముహమ్మద్ తాక్వి హుసైన్ కుమార్తె నవాబ్ ఫరూక్ - ఉన్- బేగం సాహిబాను వివాహం చేసుకున్నాడు. ముహమ్మద్ తాక్వి హుసైన్ మరాషి వంశానికి చెందిన కాష్మీరి ప్రముఖుడు.ఫర్రుక్‌సియార్ 1715 సెప్టెంబరులో జోధ్‌పూర్ మహారాజా అజిత్ సింఘ్ కుమార్తెను ఇందిరా కన్వర్ ను వివాహం చేసుకున్నాడు.
పాలన
మార్చు1713 జనవరి 10న జహందర్ ఆగ్రాలో జరిగిన రెండవ సముగర్ యుద్ధంలో ఓడించబడ్డాడు. తరువాత ఫరూక్‌సియార్ అధికారం చేజిక్కించుకోవడానికి సయ్యద్ సోదరులు సహకరించారు. 1713 జనవరి 10న ఫరుక్‌సియార్ సింహాసనం అధిష్టించాడు. అధికారం కోల్పోయిన ముఘల్ సామ్రాజ్య ప్రధాన సైనికాధిపతి జులిఫిక్వార్ ఖాన్ నుర్సత్ జంగ్, జహందర్ షా, ఆయన భార్య లాల్ కున్వర్ మరణశిక్షకు గురైయ్యారు. ఫరుక్‌సియార్ పాలనను పరోక్షంగా విమర్శించాడాని భావించి పొరపాటుగా కవి జతల్లీకి కూడా ఫరుక్‌సియార్ మరణశిక్ష విధించాడు.
ఫరూక్‌సియార్ సయ్యద్ సోదరులలో ఒకరైన సయ్యద్ హాసన్ అలి ఖాన్ బర్హా మొఘల్ సంరాజ్యానికి ప్రధాన వజీరుగా నియమించబడ్డాడు. ఆయన చక్రవర్తిని తన ఆధీనంలో ఉంచి పరోక్ష పాలన సాగించాడు. ఫరూక్‌సియార్ కూడా సయ్యద్ సోదరుల సేవకులకు లంచం ఇచ్చి సోదరులను పడగొట్టానికి ప్రయత్నించాడు. వారిలో దావూద్ ఖాన్ పనిని, మొదటి అసాఫ్ జా అంతఃకలహాలలో పాత్రవహించడానికి నిరాకరించి చక్రవర్తి ఆగ్రహానికి గురైయ్యారు. 1713 లో ముబరిజ్ ఖాన్ దక్కన్ సుబేదారుగా నియమించబడ్డాడు. ముబరిజ్ ఖాన్ విజయవంతంగా దక్కన్ ప్రాంతంలో న్యాయవ్యవస్థను స్థిరపరిచాడు.
1714 లో మొఘల్ సామ్రాజ్యానికి చెందిన ఘోరాఘాట్ ఫౌజుదార్ ఇబ్రహీం ఖాన్, ధకా కూటమి మరొకసారి భూటాన్ రాజు యజ్ఞ నారాయణను ఓడించి భుభాగాలను (కర్జీహట్, కకినా, ఫతేపూర్ చక్లా ప్రాంతాలను) మొఘల్ రాజ్యంలో విలీనం చేసారు.
సిక్కుల నాయకుడు బందా సింగ్ బహదూర్‌ను అవిభవశాలి అయిన ముఘల్ సామ్రాజ్య సైనికాధికారి అబ్దస్ సమద్ ఖాన్ బహదూర్, ఆయన కుమారుడు జకరియా ఖాన్ బహదూర్‌లు సిర్హింద్ కొత్త ఫౌజుదార్ జైన్ ఉద్- దిన్- అహ్మద్ ఖాన్ (7,000), కుమర్-ఉద్- దీన్ ఖాన్ (20,000) కలిసి చుట్టుముట్టి (గుర్దాస్పూర్ పోరాటణ్) పోరాటం సాగించారు. బందా సింగ్ బహదూర్ వీరోచితంగా, రౌద్రంగా పోరాటం సాగించినప్పటికీ ముఘల్ సైన్యాలు 8 మాసాలకాలం సాగిన భీకర పోరాటం సాగించిన తరువాత 1715 డిసెంబరు 15న లొంగిపోయాడు.తరువాత బందా సింగ్ బహదూర్ ఆయన అనుయాయులు ఢిల్లీకి తీసుకుని పోబడి తరువాత 1716లో ముఘల్ చక్రవర్తి ఫరూక్‌సియార్ ఆదేశంతో మరణశిక్షకు గురయ్యారు. .[1]
1716లో ఔరంగజేబు కాలం నుండి ప్రభావవంతుడైన ముఘల్ సేవకుడు ముర్షిద్ కులి ఖాన్ మొదటి బెంగాల్ నవాబుగా నియమితుడయ్యాడు. ఆయన బెంగాలులో అధునాతనమైన పన్ను విధానం, పాలనా విధానం ఆరంభించి ముఘల్ సామ్రాజ్యంలో అత్యుత్తమ పాలనచేసిన వాడిగా గుర్తింపు పొందాడు. ఆయన మొఘల్ సామ్రాజ్యానికి 10 మిలియన్ల డామన్లు కప్పంగా చెల్లించాడు. 1718లో శక్తివంతమైన నూర్ మొహమ్మద్ ఖల్హొరొ సింధు ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డాడు. ఫరూక్‌సియార్ ఆయనకు " ఖుదా - యార్ - ఖాన్ " బిరుదును ఇచ్చాడు.
విదేశీ సంబంధాలు
మార్చుఫర్రుక్సియార్ ఓట్టమన్ సామ్రాజ్యానికి ఒక లేఖను పంపాడు. ఓట్టమన్ సుల్తాన్ ప్రధాన వజీరు మూడవ అహమ్మద్ దానిని అందుకున్నాడు. అందులో ముఘల్ సైనికాధికారి సయ్యద్ హాసన్ అలి ఖాన్ బర్హా తిరుగుబాటు చేస్తున్న రాజపుత్ర, మరాఠీల మీద సాగించనున్న దండయాత్ర సంబంధిత గ్రాఫిక్ చిత్ర వివరణ ఉంది. [2]
వ్యాపారం
మార్చుఫర్రుక్సియార్ పాలనా కాలంలో 1717 లో బ్రిటిష్ ఇండియా కంపెనీ బెంగాల్ పన్ను రహిత వాణిజ్య హక్కులను 3,000 రూపాయల వార్షిక చెప్పింపుతో కొనుగోలు చేసింది. బ్రిటిష్ సర్జన్ విలియం హామిల్టన్ ముఘల్ చక్రవర్తికి వ్యాధిని నయంచేసినందుకు ఫలితంగా కంపెనీ వాణిజ్య హక్కును పొందాడాని విశ్వసిస్తున్నారు.[3] నపుంసకుడు సెరాల్గియోకు లంచం ఇవ్వడం ద్వారా పొందారని మరొక కథనం వివరిస్తుంది. సూరత్ వద్ద ముఘల్ నావిక దళం మీద బ్రిటిష్ నావిక దళం దాడి చేసిందని మరొక కథనం వివరిస్తుంది.[4] తరువాత ముఘల్ చక్రవర్తి విధించిన గోల్డెన్ ఫర్మనా తగిన ఫలితాలను ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ ఫర్మన్ ఆధారంగా బెంగాల్ పాలకుల నుండి కంపెనీ పన్ను మినహాయింపును పొందింది. తరువాత ఈ ఆదేశాలను తిరస్కరిస్తూ ముర్షిద్ కులీ ఖాన్ కంపెనీ నుండి పన్ను వసూలు చేసాడు.
ఫరూక్‌సియార్ వ్యతిరేకంగా పోరాటం
మార్చు1718లో ఫరూక్‌సియార్ 70,000 మొఘల్ సైన్యాలను కూడగట్టుకుని ఢిల్లీ నుండి బయలుదేరి మొదటి అసఫ్ షా (మురాదాబాద్), సర్బులాండ్ ఖాన్ (బీహార్) మీద దండయాత్ర సాగించాడు. అయినప్పటికీ వారు సయ్యద్ సోదరిలను ఓడించడంలో విఫలం అయ్యారు.
తిరుగుబాటు భీతితో సయ్యద్ హాసన్ ఖాన్ భర్తా నిరాశతో డెక్కన్ ప్రాంతంలో మరాఠీలతో యుద్ధం చేస్తున్న తనసోదరుడు సయ్యద్ హాసన్ అలి ఖాన్ బర్హాను వెనుకకు పిలిపించాడు. సయ్యద్ హాసన్ అలి ఖాన్ బర్హా 10,000 మరాఠీ సైనికులను తన సైన్యాలతో కలుపుకుని యుద్ధానికి సన్నద్ధంగా 25,000 సైన్యంతో సోదరునికి మద్దతుగా నిలిచాడు. ఈ చర్య మొఘల్ సంరాజ్యమంతటా అసహనం నెలకొనడానికి దరితీసింది.
1719 ఫిబ్రవరి మాసంలో మొఘల్ సామ్రాజ్య రక్షణార్ధం మధ్య సయ్యద్ సోదరులు, ఫర్రుక్‌సియార్ తమ వద్ద ఉన్న రాజకీయ ఖైదీలను విడిపించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయినప్పటికీ ఫర్రుక్‌సియార్ నిబంధనలు త్రోసివేస్తూ సయ్యద్ హాసన్ ఖాన్ బర్హా రాత్రి సమయంలో జరిగిన యుద్ధంలో ఫర్రుక్‌సియార్‌ను అధికారపీఠం నుండి తొలగించాడు.
మరణం
మార్చుఫర్రుక్సియార్ అతిమంగ ప్రతీకారం, దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. సయ్యద్ సోదరుల సలహాలు ఫర్రుక్‌సియార్ పదవీచ్యుతుని చేయడానికి దారితీసాయి. ఫర్రుక్‌సియార్ ఖైదుచేయబడి హీనస్థితికి చేరుకున్నాడు. తరువాత 1719 ఫిబ్రవరి 27న ఆయన సయ్యద్ సోదరుల ఆఙలతో సూదులతో పొడిచి అంధునిగా చేయబడ్డాడు. 1719 ఏప్రిల్ 27/28 నాటికి ఫర్రుక్‌సియార్ చివరికి గొంతునులిమి చంపబడ్డాడు. తరువాత సయ్యద్ సోదరులు మొదటి కజిన్ సోదరుడు " రఫి- ఉల్- దర్జాత్ " సింహాసాధిష్ఠుని చేసారు. రఫి- ఉద్- దుర్జాత్ తండ్రి ఫర్రుక్‌సియార్ తండ్రి సోదరులుగా ఉండవచ్చని భావిస్తున్నారు.
వారసత్వం
మార్చుగుర్గావ్ జిల్లాలో ఉన్న ఫరూఖ్‌నగర్ (ఢిల్లీకి 32 కి.మీ దూరంలో ఉంది) ఫరూఖ్‌సియార్ పాలనా సమయంలో నిర్మించబడింది. ఫరూఖ్‌నగర్‌లో ఆయన షీష్‌మహల్, జుమ్మామసీద్ నిర్మించాడు.
మూలాలు
మార్చు- ↑ Frances Pritchett. "XIX. A Century of Political Decline: 1707–1803". Columbia.edu. Retrieved 29 ఏప్రిల్ 2012.
- ↑ Mughal-Ottoman relations: a study of political & diplomatic relations ... – Naimur Rahman Farooqi. Books.google.com. Retrieved 29 ఏప్రిల్ 2012.
- ↑ A Guide Book.Calcutta, Agra, Delhi, Karachi and Bomabay Archived 2007-07-15 at the Wayback Machine. The American Redcross of the China-Burma-India Command.
- ↑ The History of British India By James Mill and Horace Hayman Wilson
వెలిలింకులు
మార్చుఅంతకు ముందువారు Jahandar Shah |
Mughal Emperor 1713–1719 |
తరువాత వారు Rafi Ul-Darjat |