ఆర్. నరేంద్ర కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

ఆర్. నరేంద్ర

పదవీ కాలం
2008 – 2023
ముందు పరిమళ నాగప్ప
తరువాత ఎం. ఆర్. మంజునాథ్
నియోజకవర్గం హనూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-02-09) 1958 ఫిబ్రవరి 9 (వయసు 66)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి ఆశా
నివాసం నెం. 7/479-డి, శ్రీ వెంకటేశ్వర నిల్య, 4వ క్రాస్, సదరన్ ఎక్స్‌టెన్, కొల్లేగల్ మండలం, చామరాజనగర్ జిల్లా, కర్ణాటక

రాజకీయ జీవితం

మార్చు

ఆర్. నరేంద్ర కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004 శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి పరిమళ నాగప్ప చేతిలో 13013 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2008 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఎస్‌పీ అభ్యర్థి పరిమళ నాగప్పపై 11549 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

ఆర్. నరేంద్ర 2013 శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి పరిమళ నాగప్పపై 11549 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2018 శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజెపీ అభ్యర్థి డాక్టర్ ప్రీతన్ నాగప్పపై 3513 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆర్. నరేంద్ర 2023 శాసనసభ ఎన్నికలలో హనూర్ శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జేడీఎస్ అభ్యర్థి ఎం. ఆర్. మంజునాథ్ చేతిలో 17,654 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. Star of Mysore (16 May 2018). "Puttaranga Shetty and Narendra score hat-trick win". Archived from the original on 18 March 2022. Retrieved 17 November 2024.
  2. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  3. Election Commision of India (13 May 2023). "Karnataka Assembly Election result 2023: Hanur". Archived from the original on 5 January 2024. Retrieved 17 November 2024.
  4. CNBCTV18 (13 May 2023). "Hanur election results live: JD(S) candidate MR Manjunath leads three-time Congress incumbent R Narendra by 15,954 votes" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2024. Retrieved 17 November 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)