ఆళ్లగడ్డ
ఆళ్లగడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ మండలం లోని గ్రామం, ఇది ఆళ్లగడ్డ మండలానికి కేంద్రం.ఇది జిల్లా కేంద్రమైన నంద్యాలకు ఉత్తరంగా 43 కి. మీ. దూరంలో ఉంది.
పట్టణం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°07′54″N 78°30′47″E / 15.1317°N 78.5131°ECoordinates: 15°07′54″N 78°30′47″E / 15.1317°N 78.5131°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండలం | ఆళ్లగడ్డ మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 10.26 km2 (3.96 sq mi) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 29,789 |
• సాంద్రత | 2,900/km2 (7,500/sq mi) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ) |
పిన్(PIN) | 518543 ![]() |
జాలస్థలి |
చరిత్రసవరించు
ఆళ్ళగడ్డ గ్రామానికి మొదట వాడుకలో వున్న పేరు "ఆవులగడ్డ". ఆళ్ళగడ్డ గ్రామం కళలకు,ప్రపంచ ప్రసిద్ధి చెందిన శిల్పాచార్యులకు పెట్టింది పేరు. ఆళ్ళగడ్డ గ్రామంలో విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పారంపర్య శిల్పాచార్యులు దురుగడ్డ వంశీకులు శిల్పకళలో రాష్ట్రవ్యాప్తంగా పేరుపొందారు. వీరి వంశంలోని దురుగడ్డ బాలవీరాచారి (1926–1986) మహాశిల్పి బిరుదాంకితులు దురుగడ్డ బాలవీరాచారిని 1975 లో జరిగిన ప్రపంచ మొట్ట మొదటి తెలుగు మహాసభల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్కరించింది. అలాగే దురుగడ్డ రామాచారి (1935–2008) తెలుగు యూనివర్సిటీలో శిల్ప విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించాడు.
గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 7256 ఇళ్లతో, 29789 జనాభాతో 1026 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 14830, ఆడవారి సంఖ్య 14959. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 4739 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 827. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 594542[2].పిన్ కోడ్: 518543.
పరిపాలనసవరించు
ఆళ్లగడ్డ పురపాలకసంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
విద్యా సౌకర్యాలుసవరించు
గ్రామంలో ఆరుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 21, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు 14, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఏడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు 9, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఏడు ఉన్నాయి. 4 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 3 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రభుత్వ వృత్తి విద్యా శిక్షణ పాఠశాలఉంది. సమీప ఇంజనీరింగ్ కళాశాల కె. కందుకూరులో ఉంది. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్, సమీప అనియత విద్యా కేంద్రం నంద్యాల లోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కర్నూలు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యంసవరించు
ఆళ్ళగడ్డలోని కరణమయ్య వీధిలో ఏర్పాటుచేసిన, తొలి పట్టణ ఆరోగ్యకేంద్రాన్ని,శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రరెడ్డి 2020,అక్టోబరు 3న ప్రారంభించాడు. ఈ కేంద్రంలో ఒక వైద్యుడు,ఆరోగ్య సిబ్బంది తమ సేవలు అందించెదరు.[3]
రవాణా సౌకర్యాలుసవరించు
సమీప రైల్వే స్టేషన్ 42 కిలోమీటర్లు దూరంలో ఉన్న నంద్యాల.
భూమి వినియోగంసవరించు
2011 జనగణన ప్రకారం, భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 216 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 42 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 65 హెక్టార్లు
- సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 11 హెక్టార్లు
- బంజరు భూమి: 5 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 687 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 635 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 68 హెక్టార్లు
- కాలువలు: 2 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 66 హెక్టార్లు
ఉత్పత్తిసవరించు
పరిశ్రమలుసవరించు
ప్రాచీన కాలం నుండి శిల్పకళకు ప్రసిద్ధి.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలుసవరించు
- శ్రీ కాళికాంబ దేవాలయం, విశ్వరూప పారిశ్రామిక నగర్: ఇది పురాతనమైనది. ఆళ్లగడ్డ ప్రాంతం ప్రపంచ ప్రసిద్ధి చెందిన విశ్వబ్రాహ్మణ రాతి శిల్పాచార్యులకు,దారు శిల్పాచార్యులకు కులదైవం.
- గాయత్రీ మాత దేవాలయం, గాయత్రీనగర్: ఇది RTC బస్టాండు నకు అతి సమీపంలో వుంది.
- శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం
ప్రధాన పంటలుసవరించు
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఈనాడు కర్నూలు జిల్లా;2020,అక్టోబరు-4,3వపేజీ.