ప్రధాన మెనూను తెరువు

ఆవేటి పూర్ణిమ (మార్చి 1, 1918 - నవంబరు 26, 1995) ప్రముఖ తెలుగు రంగస్థల నటీమణి.[1]

ఆవేటి పూర్ణిమ
Aaveti purnima.JPG
ఆవేటి పూర్ణిమ
జననంమార్చి 1, 1918
అత్తిలి
మరణంనవంబరు 26, 1995
ఏలూరు
ప్రసిద్ధితెలుగు రంగస్థల నటీమణి
భాగస్వాములుఆవేటి రామయ్య
తండ్రివనారస గోవిందరావు
తల్లిసురభి లక్ష్మమ్మ

జననం - వివాహంసవరించు

ఈమె 1918, మార్చి 1న అత్తిలి లో నడియేటి పడవలో సురభి లక్ష్మమ్మ మరియు వనారస గోవిందరావు లకు జన్మించారు. ఈమె 15వ ఏటనే ఆవేటి రామయ్య గారిని వివాహమాడారు.

మరణంసవరించు

ఈమె 1995 నవంబరు 26 తేదీన ఏలూరు లో స్వర్గస్తులయ్యారు.

నాటకరంగ చరిత్రసవరించు

తెలుగు టాకీ యుగ ప్రారంభంతో ప్రముఖ నటీమణులు సినిమాకి వెళ్ళిన తరుణంలో నాటకరంగంలో స్త్రీ పాత్రధారిణులకు కొరత ఏర్పడింది. ఈ స్థితిలోనే పూర్ణిమ రంగస్థలంమీద అవతరించింది. పుట్టింటివారి శిక్షణలో బాలనటిగా ఈమె నటనా జీవితం మొదలైంది. వివాహానంతరం 1936 లో శ్రీ శారదా మనోవినోదిని పేరిట స్థాపించిన స్వంత నాటక కంపెనీలో నాయిక పాత్రధారిణిగా ఎంతో ప్రజాదరణను చేకూర్చుకొంది. "ఆనాటి ప్రసిద్ధ నటులందరి ప్రక్కన అన్ని నాటకాల్లోనూ ఆవేటి పూర్ణిమ స్త్రీ పాత్రలు ధరించారు. ఈవిడ పౌరాణిక పాత్రలే కాకుండా చారిత్రక పాత్రలు కూడా ధరించారు. 1944లో పూర్ణిమా ఆర్టు థియేటర్సును స్థాపించి స్వీయ సారథ్యంలో ఎన్నో నాటకాలను సమర్ధవంతంగా నిర్వహించి పేరు ప్రఖ్యాతులు పొందారు. సత్యభామ, సక్కుబాయి, సావిత్రి, చిత్రాంగి, ప్రమీల, చంద్రమతి, మల్లమాంబ, కమల వంటి నాయిక పాత్రలు ఆమె నటజీవితంలో మైలురాళ్లుగా నిలిచాయి.

నటించిన నాటకాలుసవరించు

అవార్డులుసవరించు

సినిమారంగ చరిత్రసవరించు

మూలాలుసవరించు

  1. "20వ శతాబ్ది తెలుగు వెలుగులు" (మొదటి భాగం), పేజీ. 351-2. తెలుగు విశ్వవిద్యాలయం, 2005.
  2. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 307. సీతారత్నం గ్రంధమాల, 2002
  3. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి: "నటరత్నాలు", పేజి 308. సీతారత్నం గ్రంధమాల, 2002