ఆశారాజు
ఆశారాజు ప్రముఖ ఉర్దూ కవి. ఆయన అనేక పత్రికలలో రచనలు చేసారు.[1]
ఆశారాజు | |
---|---|
జననం | ఆశారాజు |
ఇతర పేర్లు | ఆశారాజు |
ప్రసిద్ధి | ఉర్దూ కవి |
జీవిత విశేషాలు
మార్చుఆయన హైదరాబాదులో జన్మించారు. ఆయన హైదరాబాదును ప్రేమించిన కవి. ఉర్దూ కవులు ఏ నగరంలో వుంటే ఆ నగరాన్ని తమ పేరుకు చివర చేర్చుకునే వారు.[2] ఈ సంప్రదాయాన్ని స్వీకరించి ఆశారాజు ‘రాజా హైదరాబాద్’గా తన పేరుకు హైదరాబాదును చేర్చాడు. ఆశారాజు గారి చిత్తశుద్ధి, నిజాయితీ ప్రతి కవితలో తొణికిసలాడుతాయి. ఆశారాజు సరళమయిన కవి, స్వచ్ఛమైన కవి. ఒక వుర్దూ పదం లేకుండా ‘నాశ్నమైతరు’ అన్న కవిత రాశాడు.[3]
కవుల గురించి కవులే చెప్పాలి. వాళ్ళ ప్రతిభ గురించిగానీ, రూపురేఖల గురించి గానీ ఏదో సందర్భంలో కవులే చెబుతారు. గురువులాంటి మిత్రుడు, మిత్రుడిలాంటి గురువు అయిన కె.శివారెడ్డి ఆశారాజు కవిత్వం గురించి, ఆయన రచనా విధానం గురించి మంచి చిత్రణ ఇచ్చారు. “విసురుగా అగ్నిగోళాన్ని విసిరినట్టు పద్యాన్ని విసరడం అతని పద్ధతి కాదు. సౌమ్యంగా, మృదువుగా అనుభవజ్ఞుడు కథ చెబుతున్నట్టు పద్యాన్ని ఎత్తుకుంటాడు. మెల్లమెల్లగా విడమర్చుకుంటూ, దృశ్యం మీద దృశ్యం పేర్చుకుంటూ పోతాడు" అంటారు.[4]
రచనలు
మార్చు- పిల్లలు గీసిన వన్నెల చిత్రం![5]
చిత్రమాలిక
మార్చు-
2017 ఉగాది కవి సమ్మేళనంలో సత్కారం అందుకుంటున్న ఆశారాజు
-
2017 ఉగాది కవి సమ్మేళనంలో కవిత్వ పఠనం చేస్తున్న ఆశారాజు
సూచికలు
మార్చు- ↑ రచయిత: ఆశారాజు, కథానిలయం లో
- ↑ ఆంధ్రభూమి పత్రికలో[permanent dead link]
- ↑ ఆంధ్రభూమి పత్రికలో వ్యాసం[permanent dead link]
- ↑ "ఆశారాజు కవితా వైభవం". Archived from the original on 2013-08-19. Retrieved 2013-09-07.
- ↑ సమీక్షణం: వ్యక్తిత్వ వికాసం కోసం Sakshi | Updated: December 08, 2013