ఆస్ట్రలోపిథెకస్

ఆస్ట్రలోపిథెకస్ అనేది మానవ పూర్వీకుల్లో ఒకటి. ఆస్ట్రలో అనే లాటిన్ మాటకు "దక్షిణాదికి చెందిన" అని, పిథెకోస్ అనే గ్రీకు మాటకు "కోతి" అనీ అర్థం. వెరసి ఆస్ట్రలోపిథెకస్ అంటే దక్షిణాది కోతి అని చెప్పుకోవచ్చు. అధికారిక ఆస్ట్రలోపిథెసీన్ లేదా ఆస్ట్రలోపిత్ (ఆస్ట్రలోపిథెసిన్ అనే పదానికి ఆస్ట్రోలోపిథెసినా అనే సబ్‌ట్రైబ్‌లో భాగంగా విస్తృత అర్ధం ఉన్నప్పటికీ,   [1] [2] ఇందులో ఈ జాతితో పాటు పారాంత్రోపస్, కెన్యాంత్రోపస్, [3] ఆర్డిపిథెకస్, [3] ప్రేయాంత్రోపస్ అనే జాతులు ఉన్నాయి) . ఇది  [4] హోమినిన్లలో ఒక జీనస్. పాలియోంటాలజీ, పురావస్తు శాస్త్రాల ఆధారాలను బట్టి, ఆస్ట్రలోపిథెకస్ జీనస్ 40 లక్షల సంవత్సరాల కిందట తూర్పు ఆఫ్రికాలో ఉద్భవించి, ఆఫ్రికా ఖండమంతటా వ్యాపించి, చివరికి 20 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. ఈ జీనస్‌కు నేరుగా ఆపాదించిన సమూహాల్లో ఇప్పటికి ఏదీ జీవించి లేనప్పటికీ, ఆస్ట్రలోపిథెకస్ అక్షరాలా అంతరించిపోయినట్లు అనిపించదు. కెన్యాంత్రోపస్, పారాంత్రోపస్, హోమో జెనరాలు ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా ల నుండి ఉద్భవించి ఉండవచ్చు. ఆ సమయంలో, ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, ఎ . ఆఫ్రికానస్, ఎ. అనామెన్సిస్, ఎ. బహ్రెల్‌గజాలి, ఎ. డెయిరెమెడా (ప్రతిపాదిత), ఎ. గార్హి, . సెడీబా వంటి అనేక ఆస్ట్రాలోపిథెసీన్ జాతులు ఉద్భవించాయి.

ఆస్ట్రలోపిథెకస్
Scientific classification Edit this classification
Domain: Eukaryota
Kingdom: జంతువు
Phylum: కార్డేటా
Class: క్షీరదాలు
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Subtribe: Australopithecina
Genus: Australopithecus
రేమండ్ డార్ట్, 1925
Type species
ఆస్ట్రలోపిథెకస్ ఆఫ్రికానస్
డార్ట్, 1925
సబ్‌గ్రూపులు

ప్రేంత్రోపస్ అని కూడా పిలుస్తారు

Cladistically included genera (traditionally sometimes excluded):

ఇదే కాలానికి చెందిన ఎ. రోబస్టస్, ఎ. బోయిసీ, ఎ. ఎథియోపికస్ వంటి ఇతర హోమినిడ్ జాతుల విషయంలో, అవి ఆస్ట్రలోపిథెకస్ జీనస్‌కు చెందినవా కాదా అనే దానిపై కొంత చర్చ ఉంది. చెందినవే అయితే, వాటిని 'బలిష్ఠ ఆస్ట్రలోపిత్‌లు' గాను, మిగతావాటిని 'సుకుమార ఆస్ట్రలోపిత్స్' గానూ పరిగణించవచ్చు. అయితే, ఈ బలిష్ఠ జాతులు వేరే ప్రత్యేక జీనస్‌కు చెంది ఉంటే, ఆ జీనస్ పేరు పారాంత్రోపస్ అవుతుంది. 1938 లో మొట్టమొదటిసారిగా కనుగొన్నప్పుడు రాబర్ట్ బ్రూమ్ వివరించిన జీనస్ ఇది. ఈ కారణాన, ఈ జాతులను పి. రోబస్టస్, పి. బోయిసీ, పి ఎథియోపికస్ అని పిలవవచ్చు.

మానవ పరిణామంలో ఆస్ట్రలోపిథెకస్ జాతులు గణనీయమైన పాత్ర పోషించాయి. ముప్పై లక్షల సంవత్సరాల క్రితానికి కొంతకాలం తర్వాత, ఆస్ట్రలోపిథెకస్ నుండే హోమో జీనస్ ఉద్భవించింది. పైగా, అవి డూప్లికేటెడ్ SRGAP2 అనే కొన్ని జన్యువులను కలిగి ఉన్న మొదటి హోమినిడ్లు. ఈ జన్యువులు మెదడులోని న్యూరాన్ల పొడవును, సామర్థ్యాన్నీ పెంచాయి.[5] ఇరవై లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రాలోపిత్ జాతులలో ఒకటి ఆఫ్రికాలోని హోమో జీనస్‌గా పరిణామం చెందింది (ఉదా. హోమో హ్యాబిలిస్ ). ఇదే చివరికి ఆధునిక మానవుడిగా - హోమో సేపియన్స్ సేపియన్స్ గా - పరిణామం చెందింది.

2019 జనవరిలో, ఆస్ట్రలోపిథెకస్ సెడీబా పాత ఎ. ఆఫ్రికానస్, చిన్న హెచ్ . హ్యాబిలిస్‌లకు కంటే వైవిధ్యంగా ఉందనీ, అయితే శరీర నిర్మాణంలో వీటితో కొన్ని సారూప్యతలనూ కలిగి ఉందనీ శాస్త్రవేత్తలు చెప్పారు.[6]

పరిణామం

మార్చు

సుకుమార ఆస్ట్రలోపిత్‌లలో అనేక లక్షణాలు ఆధునిక కోతుల, మానవుల లక్షణాల లానే ఉండేవి. ఇవి 35 లక్షల సంవత్సరాల క్రితం తూర్పు, ఉత్తర ఆఫ్రికా అంతటా విస్తృతంగా వ్యాపించి ఉండేవి. టాంజానియాలోని లైటోలి అనే ప్రదేశంలో తొలి ద్విపాద హోమినిడ్ల ఆధారాలను గమనించారు. ఆధునిక మానవుల పాదముద్రలతో చక్కగా సరిపోలే హోమినిడ్ పాదముద్రలు, 36 లక్షల సంవత్సరాల నాటివి, ఈ ప్రదేశంలో ఉన్నాయి.[7] ఈ పాదముద్రలు ఆస్ట్రలోపిత్‌వే అని వర్గీకరించారు. ఎందుకంటే, ఆ సమయంలో ఆ ప్రాంతంలో నివసించిన తొలి మానవ హోమినిన్లు ఇవి మాత్రమే.

 
ఆఫ్రికాలోని ప్రారంభ ఆస్ట్రలోపిథెసిన్‌ల శిలాజ ప్రదేశాల మ్యాప్

అంతరించిపోయిన హోమినిన్లలో ఆస్ట్రలోపిథెకస్ అనామెన్సిస్, ఎ. అఫారెన్సిస్, ఎ. ఆఫ్రికానస్ అత్యంత ప్రసిద్ధమైనవి. ఎ. ఆఫ్రికానస్ ఒకప్పుడు హోమో జాతికి (ముఖ్యంగా హోమో ఎరెక్టస్ ) పూర్వీకులుగా పరిగణించబడింది. అయితే, హోమో జాతికి చెందిన శిలాజాలు A. ఆఫ్రికానస్ శిలాజాల కంటే పాతవి అని కనుగొన్నారు. ఆ విధంగా, హోమో జీనస్, ఆస్ట్రలోపిథెకస్ నుండి విడివడి ఉండవచ్చు లేదా (తాజా ఉమ్మడి పూర్విక A. అఫారెన్సిస్ గాని, కెన్యాంత్రోపస్ గానీ అయి ఉండవచ్చు), లేదా రెండూ ఒక ఉమ్మడి పూర్విక (అది ఏదో ఇంకా తెలియని) నుండి విడివిడిగా అభివృద్ధి చెందడం గానీ జరిగి ఉండవచ్చు.

చింపాంజీ జీనోమ్ ప్రాజెక్టు ప్రకారం, 50-60 లక్షల సంవత్సరాల కిందట మానవులు (ఆర్డిపిథెకస్, ఆస్ట్రలోపిథెకస్, హోమో), చింపాంజీలు (పాన్ ట్రోగ్లోడైట్స్, పాన్ పానిస్కస్) ఒకే పూర్వీకుడి నుండి విడివడి పరిణామం చెందారు. అయితే, ఇటీవల కనుగొన్న హోమినిన్లు పరిణామ రేటు సూచించిన దానికంటే కొంత పాతవి అని తేలింది.[8]

సహెలాంత్రోపస్ చాడెన్సిస్ 70 లక్షల సంవత్సరాలకిందట జీవించింది. దీన్ని టౌమాయ్ అని పిలుస్తారు. ఒర్రోరిన్ ట్యుగెన్సిస్ కనీసం 60 లక్షల సంవత్సరాల కిందట జీవించింది. వీటి గురించి పెద్దగా ఏమీ తెలియక పోవడం చేత, వాటి గురించి శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. మానవుల్లోని మాలిక్యులర్ గడియారం ప్రకారం, ఆ తరువాత కనీసం పది లక్షల సంవత్సరాలకు గానీ మానవులు చింపాజీలు జన్యుపరంగా విడివడలేదు. ఒక సిద్ధాంతం ప్రకారం మానవులు, చింపాజీలు ముందు విడివడ్డాయి. విడివడిన పది లక్షల సంవత్సరాల వరకూ ఈ రెండు జాతులూ పరస్పరం లైంగిక సంబంధాలు నెరపుకున్నాయి.[8]

శరీర నిర్మాణం

మార్చు

ఆస్ట్రలోపిథెకస్ మెదడు ఆధునిక మానవుని మెదడు పరిమాణంలో సుమారు 35% వరకూ ఉండేది. ఆస్ట్రలోపిథెకస్ జాతుల్లో చాలా జాతులు చిన్నవి, సున్నితమైనవీను. సాధారణంగా 1.2 నుండి 1.4 మీ. ఎత్తుతో ఉండేవి. మగజీవులు ఆడవాటి కంటే పెద్దవిగా ఉండేవి.[9]

ఎ. జిహిల్‌మన్ ప్రకారం, ఆస్ట్రలోపిథెకస్ శరీర నిష్పత్తి బోనోబోస్‌కు దగ్గరగా ఉంటుంది.[10] దీన్ని బట్టి జెరెమీ గ్రిఫ్ఫిత్ వంటి ప్రముఖ జీవపరిణామ శాస్త్రజ్ఞులు బోనోబోస్‌, ఆస్ట్రలోపిథెకస్‌తో సరిపోలుతుందని సూచించారు.[11] పైగా, ఆస్ట్రలోపిథెకస్ జాతులకు మానవుల లాగా కాకుండా, చింపాంజీలు బోనోబోస్‌ల లాగా శరీరమంతా బొచ్చుతో కప్పబడి ఉండేదని ఉండేది.[12]

ఆస్ట్రలోపిథెకస్ లో ఉన్నంత లైంగిక డైమోర్ఫిజం స్థాయి ఆధునిక మానవుల్లో కనిపించదు. ఆధునిక జనాభాలో, మగవారు ఆడవారి కంటే సగటున 15% పెద్దగా ఉంటారు. ఆస్ట్రలోపిథెకస్లో, మగవి ఆడవాటి కంటే 50% వరకు పెద్దగా ఉండేవి. అయితే, ఆస్ట్రాలోపిథెసిన్లలోని లైంగిక డైమోర్ఫిజమ్‌ ఈ గణాంకాలు సూచించిన దానికంటే తక్కువ స్థాయిలోనే ఉండేదని కొత్త పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే అది ఇంకా చర్చనీయాంశమే.[9]

దంత నిర్మాణం

మార్చు

ఆస్ట్రలోపిథెసీన్లకు ఆధునిక మానవుల్లాగానే 32 పళ్ళుండేవి. వీటి ఆకృతి పెద్ద కోతులకు, ఆధునిక మానవులకూ మధ్యంస్థంగా ఉండేది. దంతాలు పెద్ద కోతుల్లాగే సమాంతరంగా ఉండేవి. కానీ, వాటి కోరపళ్ళు ఆధునిక మానవుడి లాగానే చిన్నవిగా ఉండేవి. పూర్వ హోమినిన్ల లో కంటే తక్కువ ఇంటరులకై ఉండేవి. నిజానికి, కొన్ని ఆస్ట్రలోపిథెసీన్లలో కోరపళ్ళు కత్తెరపళ్ళ లాగా ఉండేవి.

ఆస్ట్రలోపిథెసీన్ల దంతాలు మానవుల్లో లాగానే అమర్చి ఉండేవి. అర్థచంద్రాకారంలో ఉండి అంచులు మొనదేలి ఉండేవి.

బలిష్ఠ ఆస్ట్రలోపిథెసీన్లకు (like A. boisei and A. robustus) సుకుమార ఆస్ట్రలోపిథెసీన్ల (like A. afarensis and A. africanus) కంటే వెడల్పాటి దంవడలు, దంతాలూ ఉండేవి. వాటి ఆహారంలో పీచు పదార్థంతో కూడిన మొక్కలు ఉండి ఉండవచ్చు. వీటిలోని చిన్న జీవులు మాంసాహారులై ఉండవచ్చు. పెద్ద శరీరం కారణంగా కూడా వాటి మరింత ఆహారం అవసరమై ఉండవచ్చు. కొంత గట్టి ఆహారాన్ని భుజించేందుకు వీలుగా వాటికి వెడల్పాటి దంతాలు ఉండి ఉండవచ్చు.

ఆస్ట్రలోపిథెసీన్లకు పళ్ళపై, హోమో జీనస్‌లో లాగానే మందమైన పింగాణీ ఉండేది. ఇతర కోతి జాతులకు ఈ పింగాణీ పలుచగా ఉండేది. మందమైన పింగాణీ ఉండటానికి కారణం - ఈ హోమినిన్లు చెట్లపై కంటే నేలపైనే ఎక్కువగా జీవిస్తూ, దుంపలు, గింజలు, ధాన్యాలు తింటూండేవి. ఆహారంతో పాటు అవి ధూళిని కూడా తింటూండేవి. ఈ ధూళి కణాలు పింగాణీని అరగదీస్తాయి కాబట్టి వీటికి మందపాటి పింగాణీ ఉండేది. లేదా, ఆహారంలో వచ్చిన మార్పును ఇది సూచిస్తూ ఉండవచ్చు. బలిష్ఠ ఆస్ట్రలోపిథెసీన్ల దంతాలు బల్లపరుపుగా అరిగిపోయి ఉండేవి. సుకుమార ఆస్ట్రలోపిథెసీన్లలో ఈ అరుగుదల తక్కువగా ఉండేది. వీటి ఆహారం ఒకేలా ఉండేది కాదనేందుకు ఇది ఒక ఆధారం. సుకుమారులకు కత్తెరపళ్ళు పెద్దవిగా ఉండేవి. వాటి ఆహారంలో మాంసం ఎక్కువగా ఉండేదనడాన్ని ఇది సూచిస్తోంది. పళ్ళపై అరుగుదల ఇవి శాకాహారులనడాన్ని బలపరుస్తోంది.

ఎ. అఫారెన్సిస్, ఎ అనామెన్సిస్ లలో పళ్ళ అరుగుదలను పరిశీలిస్తే ఎ. అఫారెన్సిస్ గడ్డీ, గింజలూ పెద్దగా తినేది కాదనీ, పండ్లు ఆకులే ఎక్కువగా తినేదనీ తెలుస్తోంది. కానీ, ఎ అనామెన్సిస్ మాత్రం పండ్లు, ఆకులతో పాటు గడ్డి, గింజలూ కూడా తినేదని తెలుస్తోంది.

ఆహారం

మార్చు

1979 లో ఆస్ట్రలోపిథెకస్ శిలాజాల దంతాల అరుగుదలపై చేసిన అధ్యయనంలో, మానవ శాస్త్రవేత్త అలాన్ వాకర్, బలమైన ఆస్ట్రలోపిత్‌లు ఎక్కువగా ఫలాహారులని సిద్ధాంతీకరించాడు. ఆస్ట్రలోపిథెకస్ జాతులు ప్రధానంగా పండ్లు, కూరగాయలు, చిన్న బల్లులు, దుంపలను తినేవి. దక్షిణాఫ్రికా జాతులైన ఎ. ఆఫ్రికానస్, పారాంత్రోపస్ రోబస్టస్ మధ్య పోలికపై చాలా పరిశోధనలు జరిగాయి. పి. రోబస్టస్‌తో పోల్చితే, ఆఫ్రికానస్‌ పళ్ళలో సూక్ష్మ అరుగుదల తక్కువగా కనిపించింది.[13]

పి. రోబస్టస్ గింజలు, విత్తులు వంటి గట్టి, పెళుసైన ఆహారాన్ని తిన్నట్లు ఈ పరిశీలనల ద్వారా తెలుస్తోంది.[13]

1992, 1994 ల్లో బలిష్ఠ ఆస్ట్రలోపిత్ శిలాజాలపై చేసిన స్ట్రోన్షియమ్ / కాల్షియం నిష్పత్తుల ట్రేస్-ఎలిమెంట్ అధ్యయనాల్లో మాంసాహారం భుజించేవని తెలిసింది.[14]

2005 లో, ఇథియోపియాలోని గోనా స్థలంలో 26 లక్షల సంవత్సరాల క్రితం, ఆహార నిమిత్తం చంపిన జంతువుల ఎముకల శిలాజాలను కనుగొన్నారు. ఆ సమయంలో జీవించిన మూడు జాతుల హోమినిన్లలో కనీసం ఒకజాతి వారు మాంసాన్ని భుజించినట్లు దీనిద్వారా తెలుస్తోంది. ఈ జాతులు: ఎ. ఆఫ్రికానస్, ఎ. గార్హి, పి. ఏథియోపికస్ .[15]

2010 లో, ఇథియోపియాలో 34 లక్షల సంవత్సరాల నాడు జంతువులను వధించగా మిగిలిన ఎముకల శిలాజాలను కనుగొన్నారు. ఇవి ఆస్ట్రలోపిత్ శిలాజాలను కనుగొన్న ప్రాంతాలకు దగ్గర లోనే ఉన్నాయి.[16]

2018 లో జరిపిన ఒక అధ్యయనంలో ఎ. ఆఫ్రికానస్ దంతాలపై యాసిడ్ కోత వల్ల కలిగే గర్భాశయ గాయాలను బట్టి, అది ఆమ్లయుత ఫలాలను బాగా తిన్నట్లు సూచించింది.[17]

చెప్పుకోదగ్గ స్పెసిమెన్లు

మార్చు
  • కెటి -12 / హెచ్ 1, ఎ. బహ్రెల్‌గజాలి మాండిబ్యులర్ శకలం, చాద్‌లో 1995 లో కనుగొన్నారు
  • AL 129-1, A. అఫారెన్సిస్ మోకాలి కీలు, ఇథియోపియాలోని హదర్‌లో 1973 ను కనుగొన్నారు
  • కరాబో, బాల్య పురుషుడు ఎ. సెడీబా, దక్షిణాఫ్రికాలో కనుగొన్నారు
  • లాటోలి పాదముద్రలు, టాంజానియాలో సంరక్షించబడిన హోమినిన్ పాదముద్రలు
  • లూసీ, ఆడ ఎ. అఫారెన్సిస్ యొక్క 40% అస్థిపంజరం, ఇథియోపియాలోని హదర్లో 1974 లో కనుగొన్నారు
  • సేలం, ఇథియోపియాలోని డికాలో కనుగొనబడిన మూడేళ్ల ఎ. అఫారెన్సిస్ ఆడవారి అవశేషాలు
  • STS 5 (శ్రీమతి. బంతి) , దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకు కనుగొనబడిన A. ఆఫ్రికానస్ యొక్క పూర్తి పుర్రె
  • STS 14, A. ఆఫ్రికానస్ యొక్క అవశేషాలు, దక్షిణాఫ్రికాలోని స్టెర్క్‌ఫోంటెయిన్‌లో 1947 లో కనుగొన్నారు
  • STS 71, A. ఆఫ్రికానస్ యొక్క పుర్రె, దక్షిణాఫ్రికాలోని స్టెర్క్‌ఫోంటైన్‌లో 1947 ను కనుగొన్నారు
  • టంగ్ చైల్డ్, యువ A. ఆఫ్రికానస్ యొక్క పుర్రె, దక్షిణాఫ్రికాలోని టాంగ్లో 1924 ను కనుగొన్నారు

చిత్రమాలిక

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. Wood & Richmond 2000.
  2. Briggs & Crowther 2008, p. 124.
  3. 3.0 3.1 Wood 2010.
  4. Cela-Conde & Ayala 2003.
  5. Reardon, Sara (2012), "The Humanity Switch", New Scientist (AU/NZ), 12 May 2012 No. 2864, pp. 10–11. ISSN 1032-1233
  6. Dartmouth College (17 January 2019). "Understanding our early human ancestors: Australopithecus sediba". EurekAlert!. Retrieved 21 January 2019.
  7. David A. Raichlen; Adam D. Gordon; William E. H. Harcourt-Smith; Adam D. Foster; Wm. Randall Haas Jr (2010). Rosenberg, Karen (ed.). "Laetoli Footprints Preserve Earliest Direct Evidence of Human-Like Bipedal Biomechanics". PLOS ONE. 5 (3): e9769. Bibcode:2010PLoSO...5.9769R. doi:10.1371/journal.pone.0009769. PMC 2842428. PMID 20339543.
  8. 8.0 8.1 Bower, Bruce (May 20, 2006). "Hybrid-Driven Evolution: Genomes show complexity of human-chimp split". Science News. 169 (20): 308–309. doi:10.2307/4019102. JSTOR 4019102.
  9. 9.0 9.1 Beck, Roger B.; Linda Black; Larry S. Krieger; Phillip C. Naylor; Dahia Ibo Shabaka (1999). World History: Patterns of Interaction. McDougal Littell. ISBN 978-0-395-87274-1.
  10. Zihlman AL, Cronin JE, Cramer DL, Sarich VM (1978). "Pygmy chimpanzee as a possible prototype for the common ancestor of humans, chimpanzees and gorillas". Nature. 275 (5682): 744–6. Bibcode:1978Natur.275..744Z. doi:10.1038/275744a0. PMID 703839. S2CID 4252525.
  11. Griffith, Jeremy (2013). Freedom Book 1. Vol. Part 8:4G. WTM Publishing & Communications. ISBN 978-1-74129-011-0. Retrieved 28 March 2013.
  12. David-Barrett, T.; Dunbar, R.I.M. (2016). "Bipedality and Hair-loss Revisited: The Impact of Altitude and Activity Scheduling". Journal of Human Evolution. 94: 72–82. doi:10.1016/j.jhevol.2016.02.006. PMC 4874949. PMID 27178459.
  13. 13.0 13.1 Grine FE (1986). "Dental evidence for dietary differences in Australopithecus and Paranthropus – a quantitative-analysis of permanent molar microwear". Journal of Human Evolution. 15 (8): 783–822. doi:10.1016/S0047-2484(86)80010-0.
  14. Billings, Tom. "Comparative Anatomy and Physiology Brought Up to Date--continued, Part 3B)".
  15. Nature. "Evidence for Meat-Eating by Early Humans".
  16. Nature (2010). "Butchering dinner 3.4 million years ago". Nature. doi:10.1038/news.2010.399.
  17. Towle, Ian; Irish, Joel D.; Elliott, Marina; De Groote, Isabelle (2018-09-01). "Root grooves on two adjacent anterior teeth of Australopithecus africanus" (PDF). International Journal of Paleopathology (in ఇంగ్లీష్). 22: 163–167. doi:10.1016/j.ijpp.2018.02.004. ISSN 1879-9817. PMID 30126662. S2CID 52056962.

మరింత చదవడానికి

మార్చు

బయటి లింకులు

మార్చు