ఒర్రోరిన్ టుగెనెన్సిస్ హోమినినే కు చెందిన తొలి జాతిగా భావిస్తున్నారు. 61 - 57 లక్షల సంవత్సరాల క్రితం నాటిదని అంచనా. దీన్ని 2000 లో కనుగొన్నారు. ఓరోరిన్‌కు ఆధునిక మానవులకూ ఉన్న సంబంధం ఏమిటో ఇంకా నిర్ధారణ కాలేదు. దీన్ని కనుగొనడంతో, ఆస్ట్రలోపిథెసీన్లు మానవ పూర్వీకులు అనే ఊహకు వ్యతిరేక వాదన ఏర్పడింది. కానీ, 2012 నాటికైతే మానవ పరిణామాన్ని వివరించే పరికల్పనల్లో, ఆస్ట్రలోపిథెసీన్లు మానవ పూర్వీకులు అనేదే ప్రబలంగా ఉంది. [1]

ఒర్రోరిన్
కాల విస్తరణ: Late Miocene, 6.1–5.7 Ma
The illustration of Orrorin tugenensis fossils
The distal phalanx of the thumb
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Mammalia
Order: Primates
Suborder: Haplorhini
Infraorder: Simiiformes
Family: Hominidae
Subfamily: Homininae
Tribe: Hominini
Genus: Orrorin
Senut et al. 2001
Species:
O. tugenensis
Binomial name
Orrorin tugenensis

ప్రజాతి పేరు ఒర్రోరిన్ (బహువచనం ఒర్రోరియెక్) అంటే టుగెన్ భాషలో "అసలు మనిషి" అని అర్థం.[2][3] ఈ ప్రజాతి లోని ఒకే ఒక్క జాతి పేరు కెన్యా లోని టుగెన్ కొండల పేరు మీదుగా పెట్టారు. ఈ కొండల్లోనే ఈ జాతి శీలాజాలను 2000 లో మొదటగా కనుగొన్నారు. 2007 నాటికి, మొత్తం 20 శిలాజాలను కనుగొన్నారు.

శిలాజాలు మార్చు

2007 నాటికి కనుగొన్న 20 స్పెసిమెన్లలో ఉన్నవి: రెండు ముక్కలుగా ఉన్న కింది దవడ కింది భాగం; ఒక సింఫిసిస్, అనేక విడివిడి దంతాలు; మూడు తొడ ఎముక శకలాలు; పాక్షిక భుజాస్థి; వేళ్ళ ఎముకల్లో ముందువి (దగ్గరివి); బొటనవేలి ఎముక.

ఓరోరిన్ శరీర పరిమాణంతో పోలికలో దాని దంతాల పరిమాణం చిన్నదిగా ఉంది. దాని పలువరుస ఆస్ట్రలోపిథెకస్ కంటే భిన్నంగా, చెంప వైపు పళ్ళు చిన్నవిగా, పొడవు తక్కువగా ఉన్నాయి. ఆర్డిపిథెకస్ తో పోలిస్తే పళ్ళపై ఉండే పింగాణీ మందంగా ఉంది. పై కోర పళ్ళ పైన ఉండే గాడి, పై రెండు జాతుల కంటే భిన్నంగా ఉంది. కోర పళ్ళు వాలిడి పళ్ళ లాగానే ఉన్నా, మయోసీన్ కాలపు వాలిడులు, ఆడ చింపాంజీల్లో లాగా చిన్నవిగా ఉన్నాయి. ఓరోరిన్ పోస్ట్-కానైన్లు చిన్నవిగా ఉన్నాయి. ఆధునిక మానవుల మాదిరిగా ఇవి మైక్రోడాంట్లు (చిన్నపాటి పళ్ళు కలిగినవి). బలిష్ఠ ఆస్ట్రలోపిథెసీన్లు మెగాడాంట్లు (పెద్ద పళ్ళు కలిగినవి).

తొడ ఎముక తల గోళాకారంగా ఉంది. ఇది ముందు వైపుగా తిరుగుతుంది; ఈ ఎముక మెడ భాగం పొడుగ్గా సాగి ఉంది. అడ్డుకోతలో చూస్తే, అండాకారంగా ఉంది. ఈ ఎముక యొక్క చిన్న ట్రోకాంటర్ మధ్యలో పొడుచుకు వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఓరోరిన్ ద్విపాది అని సూచిస్తోంటే, మిగిలిన పోస్ట్‌క్రానియం భాగాలు, ఇది చెట్లు ఎక్కేదని సూచిస్తున్నాయి. వేళ్ళ మధ్య ఎముకలు వక్రంగా ఉండగా, బోటనవేలి ఎముకల నిష్పత్తి మానవుడి లాగానే ఉన్నాయి. దీన్నిబట్టి అది పనిముట్లు తయారు చేసి ఉండవచ్చని ఒక భావన కాగా, చెట్లు ఎక్కడానికి పట్టు కోసం ఉపయోగపడే సామర్ధ్యాలతో సంబంధం కలిగి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు.[4]

2000 లో ఈ శిలాజాలను కనుగొన్న తరువాత, వాటిని కిప్సారామన్ గ్రామ కమ్యూనిటీ మ్యూజియంలో ఉంచారు. కాని తరువాత ఆ మ్యూజియాన్ని మూసివేయడంతో, ఈ శిలాజాలను నైరోబీలోని ఒక రహస్య బ్యాంకు లాకర్లో దాచి ఉంచామని, కెన్యా కమ్యూనిటీ మ్యూజియమ్స్ ఛైర్మన్ యూస్టేస్ కిటోంగా చెప్పాడు. [5]

వర్గీకరణ మార్చు

ఒర్రోరిన్ ప్రత్యక్ష మానవ పూర్వీకుడు అని రుజువైతే, అప్పుడు ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్ ( "లూసీ") వంటి ఆస్ట్రలోపిథెసీన్లను హోమినిడ్ వంశవృక్షంలో మానవ శాఖకు ఎడంగా ఉన్న ఒక శాఖగా భావించవలసి ఉంటుంది: ఒర్రోరిన్ A. అఫారెన్సిస్ కంటే ప్రాచీనమైనది - దాదాపు 30 లక్షల సంవత్సరాల ముందు నాటిది - దాని కంటే ఆధునిక మానవులతో ఎక్కువ సారూప్యతలు ఉన్నదీను. ప్రధాన సారూప్యత ఏమిటంటే, ఓరోరిన్ తొడ ఎముక విషయంలో లూసీ కంటే ఒర్రోరినే హెచ్. సేపియన్లకి నిర్మాణపరంగా దగ్గరగా పోలి ఉంటుంది; అయితే, ఈ అంశంపై కొంత చర్చ జరుగుతోంది.[6]

కెన్యా లోని లుకీనో ఫార్మేషన్‌లో కనిపించిన ఇతర శిలాజాలను (ఆకులు, అనేక క్షీరదాలు) పరిశీలిస్తే ఓరోరిన్ పొడిగా ఉండే సతత హరితారణ్య శీతోష్ణస్థితుల్లో నివసించాయని, అనేక మానవ పరిణామ సిద్ధాంతాలు అనుకున్నట్లు సవానాల్లో కాదనీ తెలుస్తుంది.[7]

కనుగోలు మార్చు

2000 లో ఈ శిలాజాలను కనుగొన్న బృందానికి మ్యూజియం నేషనల్ డి హిస్టోయిర్ నేచురెల్లె కు చెందిన బ్రిగిట్టే సెనుట్, మార్టిన్ పిక్ఫోర్డ్‌లు నాయకత్వం వహించారు. లుకీనో ఫార్మేషన్‌లోని నాలుగు స్థలాల్లో 20 శిలాజాలను వీరు కనుగొన్నారు: వీటిలో, చెబోయిట్, అరగాయ్ ల వద్ద ఉన్న శిలాజాలు అత్యంత పురాతనమైనవి (61 లక్షల సంవత్సరాల క్రితం నాటివి). కాప్సోమిన్, కాప్చెబెరెక్‌లోని శిలాజాలు వాటి కంటే పై పొరల్లో ఉన్నాయి (57 లక్షల సంవత్సరాల క్రితం నాటివి).

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. Reynolds, Sally C; Gallagher, Andrew (2012-03-29). African Genesis: Perspectives on Hominin Evolution. ISBN 9781107019959.
  2. Senut et al. 2001
  3. Haviland et al. 2007, p. 122
  4. Henke 2007, pp. 1527–9
  5. "Whereabouts of fossil treasure sparks row". Daily Nation. May 19, 2009. Archived from the original on 2019-04-30. Retrieved December 1, 2010.
  6. Pickford 2001, Interview
  7. Pickford 2001, Interview

వనరులు మార్చు

బయటి లింకులు మార్చు