ఆహా నా పెళ్ళంట (2022 వెబ్ సిరీస్)

ఆహా నా పెళ్ళంట 2022లో విడుదలైన వెబ్‌ సిరీస్‌. జీ-5, తమాడా మీడియా బ్యానర్‌లపై సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా నిర్మించిన ఈ వెబ్‌ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ నవంబరు 17న జీ-5 ఓటీటీలో విడుదలైంది.

ఆహా నా పెళ్ళంట
AhaNaaPellanta.jpg
తరంరొమాన్స్

కామెడీ

డ్రామా
సృష్టి కర్తషేక్ దావూద్ జి, తమాడా మీడియా
రచయితకళ్యాణ్ రాఘవ్ పసుపుల
ఛాయాగ్రహణంషేక్ దావూద్ జి
దర్శకత్వంసంజీవ్ రెడ్డి
తారాగణం
సంగీతంజుడా శాండీ
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ప్రొడక్షన్
Producersరాహుల్ తమాడా
సాయిదీప్ రెడ్డి బొర్రా
ఛాయాగ్రహణంనగేష్ బానెల్
లష్కర్ అలీ
ఎడిటర్మధు రెడ్డి
ప్రొడక్షన్ కంపెనీతమాడా మీడియా
విడుదల
వాస్తవ నెట్‌వర్క్జీ5

కథసవరించు

శీను (రాజ్ తరుణ్) స్కూల్‌లో చదివే సమయంలో జరిగిన ఓ సంఘటన వల్ల పెళ్ళయ్యే వరకు హనుమంతుడిలా, పెళ్లి తర్వాత రాముడిలా ఉంటానని తన తల్లితండ్రులకు ఒట్టు వేస్తాడు. శ్రీను పెద్దయ్యాక, పెళ్ళి చేసుకుంటానని చెప్పడంతో వివాహం కుదరగా సరిగ్గా పెళ్ళి రోజున అమ్మాయి కనిపించదు, దీంతో శ్రీను కుటుంబసభ్యుల పరువు పోతుంది. దీనంతటికి కారణం మహా (శివానీ రాజశేఖర్) అని పెళ్లి కూతురు తండ్రి పోసాని కృష్ణమురళి శ్రీనుకు చెబుతాడు. ఆ అమ్మాయి, ఆమె కుటుంబానికి కూడా తాను అనుభవించిన బాధ తెలియాలని సరిగ్గా పెళ్ళికి ముందు రోజు మహా (శివానీ రాజశేఖర్)ని శ్రీను కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[1]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

  • బ్యానర్: జీ-5, తమాడా మీడియా
  • నిర్మాత: సూర్య రాహుల్ తమడా, సాయిదీప్ రెడ్డి బొర్రా
  • కథ, స్క్రీన్ ప్లే : షేక్ దావూద్ జి
  • మాటలు : కళ్యాణ్ రాఘవ్
  • దర్శకత్వం : సంజీవ్ రెడ్డి
  • సంగీతం: జుడా శాండీ
  • సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఆష్కర్ అలీ

మూలాలుసవరించు

  1. Sakshi (17 November 2022). "'అహ నా పెళ్లంట' వెబ్‌ సిరీస్‌ రివ్యూ". Archived from the original on 25 November 2022. Retrieved 25 November 2022.