ఇంటి గౌరవం 1970లో విడుదలైన తెలుగు సినిమా. మధు పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, అరుణ, జానకి, నాగభూషణం, చంద్రమోహన్ తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కొసరాజు గీతాలు రచించగా, ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]

ఇంటి గౌరవం
(1970 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం బాపు
తారాగణం శోభన్ బాబు,
అరుణ,
జానకి,
నాగభూషణం,
చంద్రమోహన్
నేపథ్య గానం ఘంటసాల,
పి.సుశీల
గీతరచన కొసరాజు
నిర్మాణ సంస్థ మధు పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శోభన్ బాబు - ఇన్‌స్పెక్టర్ రవి
  • అరుణ (నూతన తార) - రాధ
  • జానకి - సీతమ్మ
  • నాగభూషణం - బాబూరావు
  • చంద్రమోహన్ - చినబాబు
  • పి.వెంకటేశ్వరరావు - వెంకట్రావు రాధ పెంపుడు తండ్రి
  • అశోక్ కుమార్
  • సాక్షి రంగారావు
  • రామచంద్రరావు
  • జగ్గారావు
  • కాకరాల
  • జయకుమారి
  • విజయభాను
  • లక్ష్మీకాంతమ్మ
  • ప్రభావతి
  • బృందావన్ చౌదరి
  • సత్యవతి
  • ఆశా
  • మాస్టర్ విశ్వేశ్వరరావు - చినబాబు (చిన్నప్పుడు)
  • బేబి లలితశ్రీ

పెద్దవారి అడుగుజాడలే చిన్నవారి బ్రతుకు బాటలు

పిల్లల ప్రవర్తన బట్టే ఇంటి గౌరవం నిలబడుతుంది.

ఈ సత్యాన్ని నమ్మిన ఇల్లాలు సీతమ్మ. కొడుకును అదుపు ఆజ్ఞల్లో పెంచాలనుకుంటుంది. కిరాయి రౌడీ అయిన ఆమె భర్త బాబూరావు కొడుకును ముద్దు చేసాడు. క్లబ్బులకి, కార్నివాల్ కి తన వెంట త్రిప్పుకున్నాడు. తండ్రి ప్రభావం కొడుకు మీద పడింది. తండ్రిలాగే పేకాట నేర్చుకున్నాడు. బీడీలు కాల్చాడు.

బాబూరావుకి ఆడపిల్ల పుడుతుందని, తన అష్ట కష్తాలుపడతాడని ఒక నాటు జ్యోతిష్యుడు అతనికి భవిషత్తు చెప్పాడు

అలాగే ఆడపిల్ల పుట్టింది. ఓ రాత్రి కిరాయికి ఎవరినో తన్నడానికి వెళ్ళిన బాబూరావు తన్నులు తిని తిరిగి వచ్చాడు. అదంతా ఆడపిల్ల ప్రభావమే అనుకున్నాడు. ఆడపిల్ల తన పాలిట శని అని నమ్మాడు. తిన్నగా ఇంటికి వెళ్ళి ఆ పసికందును ఎత్తుకుపోయి అనాథ శరణాలయం వద్ద వదిలేసాడు.

సంపన్నుడైన వెంకట్రావు ఆ బిడ్డని పెంపకానికి తీసుకువెళ్ళాడు. సీతమ్మ అనాథ ఆశ్రమంలో వివరాలు తెలుసుకొని వెంకట్రావుగారి ఇంటికి వెళ్ళింది.

వెంకట్రావు భార్యకు స్పృహ వచ్చింది. పక్కలో ఉన్నది తన బిడ్డేనని నమ్మింది. ఇంతలో గుండెల్లో నొప్పి ఎక్కువైంది. తను పోయిన తరువాత "మారు మనువాడననీ, బిడ్డను శ్రద్ధగా పెంచి పెళ్ళి చేస్తాననీ" భర్త దగ్గర వాగ్దానం తీసుకొని ప్రాణాలు విడిచింది.

సీతమ్మ ఈ మాటలు వింది.

తన భార్యకు ఇచ్చిన మాటను నిలబెట్తుకుందుకు సాయపడమని సీతమ్మను ప్రాథేయపడ్డాడు వెంకట్రావు. తన కూతురు గానే పెంచాలని కోరాడు. సీతమ్మ కాస్సేపు ఆలోచించింది. తన కూతురు ప్రాణాలు కాపాడడానికి ఆమెకు వేరే మార్గం కనుపించలేదు.

బాబూరావునూ, కొడుకునూ కూడా తీసుకు వచ్చి తన ఇంట్లో ఉండమని కోరాడు వెంకట్రావు. "సరే" అని సీతమ్మ వెళ్ళిపోయింది. ఇల్లు తాళం వేసి ఉంది. అంతకు ముందు జరిగిన ఒక కొట్లాటలో బాబూరావు చేత దెబ్బలు తిన్న రౌడీ చావుబ్రతుకుల్లో ఉన్నాడని తెలిసి పోలీసులకు దొరక్కుండా కొడుకుతో పారిపోయాడు బాబూరావు.

సీతమ్మ కూతురును ఆయా పెంచినట్లు పెంచింది. లక్షణంగా కాలేజీలో చదువుతుంది. ఆమె పేరు రాధ

బాబూరావు కొడుకు గోపో జేబుదొంగ అయ్యాడు. క్లబ్ డాన్సర్ విజ్జీని ప్రేమించాడు.

ఆ క్బబ్బు యజమాని రాజా, రాధమీద కన్ను వేసాడు. కాని రాధ మాత్రం పోలీసు ఇనస్పెక్టరును ప్రేమించింది.

ఒకసారి రాధను లలాత్కరించ బోతుంటే ఆ దారిన పోతున్న బాబూరావు ఆమెను కాపాడాడు. కన్న కూతురని తెలియక ఆమె దగ్గర కూడా అతని అలవాటు ప్రకారం కిరాయి వసూలు చేసాడు.

ఆ అవమానంతో కృంగిపోయిన రాజా అదను కోసం చూస్తున్నాడు. ఆ అదను వచ్చింది.

తన కాంట్రాక్టులో ఉన్న విజ్జీని విడుదల చేసి గోపీకి పెళ్ళి చేసుకుందుకు అంగీకరించడానికి 20 వేలు డబ్బు ఇమ్మన్నాడు. బాబూరావు దగ్గర అంత డబ్బు లేదు. అంచేత రాజా, రాధను తన దగ్గరకు తీసుకువచ్చి క్షమాపణ చెప్పమన్నాడు. బాబూరావు 'సరే' అని వెళ్ళీపోయాడు.

రాధను ఎత్తుకు వస్తున్నప్పుడు మేల్కొన్న సీతమ్మ పూలకుండీ విసరగా బాబూరావుకు దెబ్బతగిలి పడిపోయాడు. తండ్రిని పిలవడానికి రాధ వెళ్ళింది. వెంకట్రావు వచ్చెలోగా బాబూరావును పంపి వేసింది సీతమ్మ. దొంగకు సాయపడిందని సీతమ్మను ఆరా తీసింది రాధ.

గోడ దాటుతున్న బాబూరావును అనుమానించిన పోలీసులు లోపలకు తీసుకొచ్చారు. తన భార్య ఆ ఇంట్లో పనిచేస్తున్నట్లు అతను చెప్పాడని, అది నిజమో కాదో తెలుసు కుందామని వచ్చామన్నారు.

కాని బాబూరావు తన భర్త కాదని చెప్పింది సీతమ్మ. ఎందుచేత? ఏ ఆడదీ చేయని ఈ మహా పాఅం ఆమె ఎందుకు చేసిందో మిగిలిన కథలో తెలుస్తుంది.[2]

  1. నారుపోసి ఊరుకొంటే తీరుతుందా - ఘంటసాల, పి.సుశీల - రచన: కొసరాజు
  2. చింత పువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: ఆరుద్ర
  3. ఓ నో డార్లింగ్ నో ప్లీజ్ డార్లింగ్ వద్దురా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరథి
  4. హవ్వా హవ్వా సిరి సిరి మువ్వా నువ్వా నువ్వా - పి.సుశీల - రచన: ఆరుద్ర

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: అబ్దుల్ ముత్తలీబ్
  • మాటలు: ముళ్లపూడి వెంకటరమణ
  • పాటలు: ఆరుద్ర, కొసరాజు, దాశరథి
  • ఛాయాగ్రహణం: సి.ఎస్.ఆర్.కృష్ణారావు
  • ఆపరేటివ్ ఛాయాగ్రహణం; బి.రామచంద్రయ్య
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • కళ: ఎస్.కృష్ణారావు
  • నృత్యం: శేషు. రాజు
  • కూర్పు: పి.శ్రీహరిరావు
  • పోరాటాలు: సత్తిబాబు
  • స్టిల్స్: ఎం.సత్యం
  • సెట్టింగ్స్: బి.నీలకంఠన్, ఎం.గణపతి ఆచారి

మూలాలు

మార్చు
  1. "Inti Gowravam (1970)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2020-08-16.
  3. రావు, కొల్లూరి భాస్కర (2009-04-24). "ఇంటిగౌరవం - 1970". ఇంటిగౌరవం - 1970. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బాహ్య లంకెలు

మార్చు