సతీష్ ధావన్
సతీష్ ధావన్ (1920 సెప్టెంబరు 25 – 2002 జనవరి 3) భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. శ్రీనగర్లో జన్మించిన ధావన్, భారత్ లోను, అమెరికా లోనూ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసాడు. టర్బులెన్స్, బౌండరీ లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. ఈ రంగాల్లో ఆయన శక్తి సామర్థ్యాలు భారత స్వదేశీ అంతరిక్ష కార్యక్రమ అభివృద్ధికి దోహదపడింది. 1972 లో ఎమ్.జి.కె. మీనన్ తరువాత, ఇస్రో ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
సతీష్ ధావన్ | |
---|---|
![]() | |
జననం | శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు, భారత దేశం | 1920 సెప్టెంబరు 25
మరణం | 2002 జనవరి 3 భారత దేశం | (వయసు 81)
రంగములు | మెకానికల్ ఇంజనీరింగు, ఏరోస్పేస్ ఇంజనీరింగు |
వృత్తిసంస్థలు | ఇస్రో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్[1] కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్ |
చదువుకున్న సంస్థలు | యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ (భారత్) యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ |
పరిశోధనా సలహాదారుడు(లు) | Hans W. Liepmann |
ప్రసిద్ధి | భారతీయ అంతరిక్ష కార్యక్రమం |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మవిభూషణ్ |
సంతకం![]() |
సతీష్ ధావన్ | |
---|---|
ఇస్రో, అధ్యక్షుడు | |
In office 1972–1984 | |
అంతకు ముందు వారు | M. G. K. Menon |
తరువాత వారు | ఉడుపి రామచంద్రరావు |
విద్యసవరించు
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోరు లోని యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ నుండి బాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇంగ్లీషు సాహిత్యంలో ఎమ్.ఏ డిగ్రీ పొందాడు. 1947 లో మిన్నియాపోలిస్ లోని యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగులో ఎమ్.ఎస్., కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగులో డిగ్రీ, ఆ తరువాత 1951 లో డా. హాన్స్ డబ్ల్యు లేప్‌మ్యాన్ మార్గదర్శకుడిగా గణితం, ఏరోస్పేస్ ఇంజనీరింగుల్లో డబల్ పి.హెచ్.డి పొందాడు.
వృత్తిసవరించు
ఇస్రో ఛైర్మనుగా (1972–1984)సవరించు
డా. ధావన్ స్పేస్ కమిషను ఛైర్మనుగా, ఇస్రో ఛైర్మనుగా భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖలో సెక్రెటరీగా బాధ్యతలు స్వీకరించాడు. బాధ్యతలు తీసుకోగానే అణుశక్తి కమిషనులో ఉన్న బ్రహ్మ ప్రకాష్‌ను తిరువనంతపురంలో ఉన్న విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి ఛైర్మనుగా నియమించాడు. ఇస్రో శీఘ్రగతిన ఎదగడానికి ఈ చర్య ఎంతో తోడ్పడింది. ఆ తరువాత భారత తొలి ఉపగ్రహ వాహక నౌక ఎస్‌ఎల్‌వి అభివృద్ధి కార్యక్రమానికి అబ్దుల్ కలాంను నాయకుడిగా నియమించాడు.[2]
1975 లో ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ నాయకత్వంలో ఎస్‌ఎల్‌వి అభివృద్ధి జరుగుతోంది. దాని మొదటి ప్రయోగం విఫలమైంది. వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆనాటి పత్రికా సమావేశంలో పాల్గొని వైఫల్యాన్ని స్వీకరించాడు. రెండవ ప్రయోగం విజయవంతమైనపుడు ఆనాటి పత్రికా సమావేశాన్ని అబ్దుల్ కలాం చేత చేయించాడు.
ధావన్ గ్రామీణ విద్యలోను, రిమోట్ సెన్సింగు, ఉపగ్రహ సమాచారాల లోను పరిశోధనలు చేసాడు. వాటి ఫలితంగానే ఇన్‌శాట్, ఐఆర్‌ఎస్, పిఎస్‌ఎల్‌విలు రూపొందాయి.
ఐఐఎస్‌సి ఛైర్మను (1962–1981)సవరించు
1951 లో ధావన్ భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టరుగా నియమితుడయ్యాడు. తాను ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు. ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు.
పురస్కారాలుసవరించు
- పద్మ విభూషణ్, 1981[3]
- పద్మ భూషణ్, 1971[3]
- ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం, 1999
స్మరణలుసవరించు
2002 లో ధావన్ మరణించాక, నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి ఆయన పేరుతో సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు. లూథియానా లోని ప్రభుత్వ కళాశాలను ఆయన పేరిట మార్చారు.
మూలాలుసవరించు
- ↑ "About IISc Heritage". Indian Institute of Science. Archived from the original on 15 ఆగస్టు 2013. Retrieved 13 September 2013.
- ↑ "Satish Dhawan - The Gentle Colossus".
- ↑ 3.0 3.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2014-11-15. Retrieved July 21, 2015.