భారతీయ ఖగోళ వేధశాల

లడఖ్ లోని హాన్లే వద్ద ఉన్న వేధశాల
(ఇండియన్ ఏస్ట్రొనామికల్ అబ్సర్వేటరీ నుండి దారిమార్పు చెందింది)

లడఖ్‌లోని లేహ్ సమీపంలోని హన్లేలో ఉన్న వేధశాల, భారతీయ ఖగోళ వేధశాల (IAO). ఆప్టికల్, ఇన్‌ఫ్రారెడ్, గామా-రే టెలిస్కోప్‌ల లకు సంబంధించి ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వేధశాలల్లో ఒకటి. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ ఈ వేధశాలను నిర్వహిస్తోంది. 4,500 మీటర్ల ఎత్తున ఉన్న ఇక్కడి టెలిస్కోపు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తున ఉన్న ఆప్టికల్ టెలిస్కోపుల్లో ఇది పదో స్థానంలో ఉంది.

భారతీయ ఖగోళ వేధశాల
ఇతర పేర్లుHanle Observatory Edit this at Wikidata
సంస్థభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ Edit this on Wikidata
స్థానంహాన్లే, లేహ్ జిల్లా, లడఖ్, భారతదేశం
నిర్దేశాంకాలు32°46′46″N 78°57′51″E / 32.7794°N 78.9642°E / 32.7794; 78.9642
సముద్రమట్టం నుండి ఎత్తు4,500 మీ. (14,800 అ.) Edit this at Wikidata
స్థాపన2001 Edit this on Wikidata
టెలిస్కోపులుగ్రోత్ - ఇండియా టెలిస్కోపు
మేజర్ ఎట్మాస్ఫెరిక్ చెరెంకోవ్ ఎక్స్‌పెరిమెంట్ టెలిస్కోపు
హిమాలయన్ చంద్ర టెలిస్కోపు
హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోపు Edit this on Wikidata
మూస:Cclink

స్థానం

మార్చు

భారత ఖగోళ అబ్జర్వేటరీ ఆగ్నేయ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో, హాన్లే లోని దిగ్ప-రత్స రి పర్వతంపై ఉంది. [1] చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ అబ్జర్వేటరీని చేరుకోవడానికి లేహ్ నుండి పది గంటల ప్రయాణం అవసరం. [2]

చరిత్ర

మార్చు

1980ల చివరలో ప్రొఫెసర్ బివి శ్రీకాంతన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఒక కమిటీ జాతీయ స్థాయిలో పెద్ద ఆప్టికల్ టెలిస్కోపును ప్రాధాన్యతా ప్రాజెక్టుగా తీసుకోవాలని సిఫార్సు చేసింది. 1992 లో ప్రొఫెసర్ అరవింద్ భట్నాగర్ నేతృత్వంలో అబ్జర్వేటరీ స్థలం కోసం అన్వేషణ జరిగింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ శాస్త్రవేత్తలు హాన్లేలో ఈ స్థలాన్ని కనుగొన్నారు. [3]

2000 సెప్టెంబరు 26 -27 మధ్య అర్ధరాత్రి సమయంలో అబ్జర్వేటరీ లోని 2-మీటర్ల టెలిస్కోపులో తొలి కాంతి పడడంతో ఇది పనిచేయడం మొదలైంది. [1]

బెంగుళూరు లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CREST), హాన్లేల మధ్య ఉపగ్రహ లింకును అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి డాక్టర్. ఫరూక్ అబ్దుల్లా 2001 జూన్ 2 న ప్రారంభించాడు. 2001 ఆగస్టు 29 న ఈ అబ్జర్వేటరీని జాతికి అంకితం చేసారు. [4]

పరిశీలన

మార్చు

ఏడాది పొడవునా కనిపించే, ఇన్‌ఫ్రారెడ్, సబ్‌మిల్లిమీటర్ పరిశీలనలకు అద్భుతమైన స్థలంగా హాన్లేను పరిగణిస్తారు. [2] ప్రత్యేకించి ఇక్కడి స్థానిక పరిస్థితుల కారణంగా స్పెక్ట్రోస్కోపిక్ పరిశీలనల కోసం సంవత్సరానికి 255 రాత్రులు, ఫోటోమెట్రిక్ పరిశీలనల కోసం సుమారు 190 రాత్రులూ లభిస్తాయి. ఇక్కడి వార్షిక అవపాతం 10 సెం.మీ. కంటే తక్కువ. పైగా, తక్కువ పరిసర ఉష్ణోగ్రతలు, తక్కువ తేమ, వాతావరణ ఏరోసోల్‌ల తక్కువ సాంద్రత, తక్కువ వాతావరణ నీటి ఆవిరి, చీకటి రాత్రులు, తక్కువ కాలుష్యం వంటి అనుకూలతలు కూడా ఇక్కడ ఉన్నాయి [1]

సౌకర్యాలు

మార్చు

అబ్జర్వేటరీలో రెండు క్రియాశీల టెలిస్కోప్‌లు ఉన్నాయి. 2.01 మీటర్ల ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ (HCT) ఒకటి కాగా, రెండవది హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోప్ (HAGAR).

హిమాలయ చంద్ర టెలిస్కోప్

మార్చు

హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ అనేది 2.01 మీటర్లు (6.5 అడుగులు) వ్యాసం కలిగిన ఆప్టికల్-ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోపు. భారతదేశంలో జన్మించిన నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ పేరు దీనికి పెట్టారు. [2] ఇది ULE సిరామిక్‌తో తయారు చేయబడిన ప్రాథమిక అద్దంతో, రిచ్చీ-క్రేటియెన్ వ్యవస్థ కలిగి ఉంది. ఇక్కడి తక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. [5] ఈ టెలిస్కోపును అమెరికా, అరిజోనాలోని టక్సన్‌లో ఎలక్టో-ఆప్టికల్ సిస్టమ్ టెక్నాలజీస్ సంస్థ తయారు చేసింది. ఈ టెలిస్కోపులో హిమాలయా ఫెయింట్ ఆబ్జెక్ట్ స్పెక్ట్రోగ్రాఫ్ (HFOSC), నియర్-IR ఇమేజర్, ఆప్టికల్ CCD ఇమేజర్ అనే 3 సైన్స్ సాధనాలను అమర్చారు. [2] [6] HCT ని రిమోట్‌గా బెంగుళూరు లోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CREST) నుండి ప్రత్యేకించిన INSAT-3B ఉపగ్రహ లింకు ద్వారా నిర్వహిస్తారు. శీతాకాలంలో సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద కూడా ఇది పనిచేస్తుంది.

 
హై ఎనర్జీ గామా రే టెలిస్కోప్ (HAGAR), హాన్లే

గ్రోత్-ఇండియా టెలిస్కోప్

మార్చు

గ్రోత్-ఇండియా టెలిస్కోప్ అనేది 0.7 మీటర్ల వైడ్-ఫీల్డ్ ఆప్టికల్ టెలిస్కోపు. ఇది 2018 లో పని మొదలుపెట్టింది. [7] ఇది దేశంలోనే మొట్టమొదటి పూర్తిగా రోబోటిక్‌గా పనిచేసే రీసెర్చ్ టెలిస్కోపు. [8] దీన్ని అంతర్జాతీయ గ్రోత్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఏర్పాటు చేసారు. [9] టైమ్ డొమైన్ ఖగోళ శాస్త్రం కోసం దీన్ని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ టెలిస్కోపును IIT బాంబే, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోప్

మార్చు

హై ఆల్టిట్యూడ్ గామా రే టెలిస్కోపును (HAGAR) దీన్ని 2008లో ఏర్పాటు చేసారు. ఇది వాతావరణ సెరెన్‌కోవ్ ప్రయోగం. ఇందులో 7 టెలిస్కోపులుంటాయి. ఒక్కో టెలిస్కోపులో 7 అద్దాలుంటాయి. ఈ 7 అద్దాల మొత్తం విస్తీర్ణం 4.4 చదరపు మీటర్లు. అంటే మొత్తం టెలిస్కోపు కాంతిని సేకరించే విస్తీర్ణం 31 చ.మీ. [10]ఈ టెలిస్కోపులన్నీ మధ్యలో ఒక టెలిస్కోప్‌తో 50 మీటర్ల వ్యాసార్థం యొక్క వృత్తపు అంచున అమర్చబడి ఉంటాయి. వీటిని ఆల్ట్-అజిమత్ పద్ధతిలో నిలబెట్టారు.

శాస్త్ర సాంకేతిక పరిశోధనల కేంద్రం

మార్చు

సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CREST) హోస్కోట్ పట్టణానికి సమీపంలో బెంగుళూరుకు ఈశాన్యంగా 35 కి.మీ. దూరంలో ఉంది. ఈ కేంద్రంలో 2 మీటర్ల హిమాలయన్ చంద్ర టెలిస్కోప్ (HCT) రిమోట్ ఆపరేషన్‌ల కోసం నియంత్రణ కేంద్రం, ఒక HCT డేటా ఆర్కైవు ఉన్నాయి. ఒక ఉపగ్రహ లింకు ద్వారా ఈ కార్యకలాపాలను నియంత్రిస్తారు. [11]

రాబోయే సౌకర్యాలు

మార్చు

చురుకైన గెలాక్సీ కేంద్రకాలను పర్యవేక్షించడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, అమెరికా లోని సెయింట్ లూయిస్‌లో వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన మెక్‌డొన్నెల్ సెంటర్ ఫర్ స్పేస్ సైన్సెస్‌తో కలిసి పనిచేస్తోంది. అబ్జర్వేటరీలలో ఒకదాన్ని హాన్లేలో స్థాపిస్తారు. [2] 180 డిగ్రీల రేఖాంశాల దూరంలో ఉన్న ఈ రెండు సౌకర్యాలను యాంటిపోడల్ ట్రాన్సియెంట్ అబ్జర్వేటరీ (ATO) అని పిలుస్తారు. [12]

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ల సహకారంతో హాన్లేలో హిమాలయన్ గామా రే అబ్జర్వేటరీ (HiGRO) ని ఏర్పాటు చేస్తున్నారు.

మేజర్ అట్మాస్ఫియరిక్ సెరెన్‌కోవ్ ఎక్స్‌పెరిమెంట్ టెలిస్కోప్ (MACE) డిసెంబర్ 2012 [13] ఇక్కడ ఏర్పాటు చేయబడుతుందని అంచనా. అంతరిక్షం నుండి గామా కిరణాలను సేకరించగల 21-మీటర్ల కలెక్టరు ఇందులో ఉంటుంది. [13] టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగుళూరు లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, కోల్‌కతా లోని సాహా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ల సహకారంతో భాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఈ సదుపాయాన్ని రూ 40 కోట్ల ఖర్చుతో స్థాపిస్తోంది. [13] ఇది పూర్తయిన తర్వాత తూర్పు అర్ధగోళంలో అటువంటి సౌకర్యం ఇదొక్కటే అవుతుంది. [13] 2014 జూన్ నాటికి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టెలిస్కోపును రూపొందించింది. IAOలో దీన్ని స్థాపిస్తున్నారు. [14] ఈ టెలిస్కోపు ప్రపంచంలో రెండవ అతిపెద్ద గామా రే టెలిస్కోపు, అత్యంత ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోపు అవుతుంది. 2020 సెప్టెంబరు నాటికి ఈ టెలిస్కోపు స్థాపన పూర్తై నవంబరులో పరీక్షలు మొదలయ్యాయి.[15]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 News, Dec 25, 2000, Vol. 79 No. 12 Current Science, Indian Academy of Sciences
  2. 2.0 2.1 2.2 2.3 2.4 Pallava Bagla (7 January 2002) "India Unveils World's Highest Observatory", National Geographic News, Retrieved 21 January 2011
  3. Rajan, Mohan Sundara. "Telescopes in India". National Book Trust, India, 2009, p. 132
  4. About IAO, IAO website. http://www.iiap.res.in/iao_about accessed on 20 January 2011.
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; frontline అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. IAO Telescope http://www.iiap.res.in/iao_telescope Accessed on 21 January 2011
  7. "GROWTH-India - First Light!". sites.google.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-10-07.[permanent dead link]
  8. Sharma, Dinesh C. "India's first robotic telescope opens its eyes to the universe". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2020-10-07.
  9. "GROWTH Observatories". growth.caltech.edu. Retrieved 2020-10-07.
  10. "Hagar Telescope | Indian Institute of Astrophysics". www.iiap.res.in. Archived from the original on 2022-06-02. Retrieved 2022-06-02.
  11. CREST http://www.iiap.res.in/centers/crest Accessed on 21 January 2011
  12. Antipodal Transient Observatory. http://www.iiap.res.in/iao_ato Archived 8 నవంబరు 2016 at the Wayback Machine Accessed on 20 January 2011
  13. 13.0 13.1 13.2 13.3 Sunderarajan, P (17 June 2011). "Gamma ray telescope getting ready at Hanle". The Hindu. Retrieved 17 June 2011.
  14. MACE telescope ready to be shifted to Hanle, Ladakh from Hyderabad | Hyderabad News - Times of India
  15. యాదవ్, కె.కె. "Status update of the MACE Gamma-ray telescope" (PDF). arxiv.org. Archived from the original (PDF) on 2022-06-02. Retrieved 2022-06-02.