ఇండుపు (లాటిన్ Strychnos potatorum-[1]) ఒక ఔషధ మొక్క. ఇండుపు చెట్టును క్లియరింగ్ ట్రీ, చిల్ల గింజల చెట్టు,ఇందుగు చెట్టు అని కూడా పిలుస్తారు.[2] దీని కాయలను ఇండపుకాయఅని,ఇందుగు గింజని,చిల్ల గింజలని అంటారు.ఈ చెట్టను సంసృతంలో నిర్మలి అని వ్యవహరిస్తారు.[3] దీని పిక్కల్ని త్రాగే నీరు శుద్ధిచేసుకోవడానికి ఉపయోగిస్తారు.ఇది లొగానియేసి జాతికి చెందిన యుడికాట్స్‌. ఇవి ఎక్కువగా పొలాల గట్లపై పెరుగుతాయి.ఈ మొక్కలు పుట్టుక భారతదేశం అని తెలుస్తుంది.ఈ మొక్కలు ఇంకా శ్రీలంక, జింబాంబ్వే, బోట్స్‌వానా,మయన్మార్ దేశాలలో కూడా పెరుగుతున్నట్లు తెలుస్తుంది.[3]

ఇండుపు
ఇండుపు చెట్టు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Strychnos

లక్షణాలు

మార్చు
  • మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • అండాకారం నుంచి సన్నగా కొనదేలిన సరళ పత్రాలు.
  • గ్రీవస్థ నిశ్చిత సమూహాలలో అమరిన తెల్లని పుష్పాలు.
  • దీని పండ్లు గుండ్రంగా ఎరుపురంగుతో ఉండి, బాగా పండినతరువాత నలుపురంగులోకి మారతాయి.
  • గింజలు గుండ్రంగా,ముదురు గోదుమరంగులో చిన్నపట్టులాంటి నూగుతో ఉంటాయి.[3]

ఉపయోగాలు

మార్చు
 
ఇండుపుగింజలు (చిల్ల గింజలు)
  • పూర్వం గ్రామాలలో బావులు, చిన్నచిన్న కుంటలు, చెరువులలో ఉన్న నీరే త్రాగునీటికి ఆధారం.కొన్ని బావులలో ఉన్న నీరు ఉప్పగా ఉండి త్రాగటానికి అవకాశం ఉండేదికాదు.అలాంటి పరిస్థితులలో కావిళ్లు ద్వారా పొలాలలోని కుంటలు,చెరువులు నుండి నీటిని తెచ్చుకుని వాడేవారు.అవి వర్షాలవలన పారుదుల నీరు చెరువులో చేరి మురికిగా ఉండి త్రాగటానికి ఇబ్బందిగా ఉండేది.వాటిని ఒక పాత్రలో వడపోసి,ఇందుపు గింజలను (చిల్ల గింజలు) పగలకొట్టి చిన్న ముక్కలుగా చేసి,లేదా అరగదీసి ఆ వచ్చిన చిక్కని ద్రవం ఆ పాత్రలో వేసేవారు.కొంతసేపటికి నీటిలోని మురికి,ఇతర మలిన పదార్థాలు అడుగుకు చేరి స్వచ్చమైన నీరు పైకి తేరుకుంటాయి.ఆ నీటిని వాడుకునేవారు.ఆ రకంగా స్వచ్చమైన నీటిని తేరుకోవటానికి.అవి నీటిలో నాని నందున అందులోని ఔషధగుణాలు మంచినీటి ద్వారా మేలు కలుగజేసేవి.వీటిని ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో ఉపయోగిస్తున్నారు.[2]
  • చిన్నపాటి జ్వరాలకు,మదుమేహానికి,డయేరియా,అన్ని రకాల కంటి జబ్బులకు,మూత్రపిండాల జబ్బులకు,ఉదర సంబంధిత జబ్బులకు వీటిని వాడతారని తెలుస్తుంది.[3]
  • దీని వేళ్లనుండి తీసిన రసం బొల్లి,శోభి,ఇతర మచ్చల నివారణకుకూడా ఉపయోగిస్తారని తెలుస్తుంది.[3]
  • వీటి ఫలాలు మూర్చ,ఇతర విషాలను హరించటానికి,అధికదాహం నివారణకు ఉపయోగపడతాయమని తెలుస్తుంది.[3]

మూలాలు

మార్చు
  1. https://www.flowersofindia.net/catalog/slides/Clearing%20Nut%20Tree.html
  2. 2.0 2.1 "నీటిని శుద్ధి చేసే చిల్ల గింజలు | పుప్పొడి | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-05-26.[permanent dead link]
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 రసజ్ఞ (2012-05-17). "నవ రస(జ్ఞ) భరితం: ఈ గింజలు తెలుసా?". నవ రస(జ్ఞ) భరితం. Retrieved 2020-05-26.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఇండుపు&oldid=3912012" నుండి వెలికితీశారు