ఇండో-యూరోపియన్ భాషలు
ఇండో యూరోపియను భాషలు లేక సింధ ఐరోపా భాషలు ఒకే భాషా కుటుంబానికి చెందిన భాషలు. ఇవి చాలా కాలం క్రితం ఉండిన ఒకే మూలభాషనుండి వచ్చాయని భాషావేత్తల అభిప్రాయం. ప్రస్తుత ప్రపంచ భాషలలో ఇండో యూరోపియను భాషలు ప్రముఖమైన స్థానం కలిగి ఉన్నాయి. ఐరోపా, ఆసియా, అమెరికా ఖండాలలోని ప్రస్తుత భాషలలోని అన్ని ముఖ్యమైన భాషలన్నీఈ ఇండో యూరోపియను భాషా కుటుంబమునకు చెందినవే. ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రముఖ ఐదు భాషలలో చైనీసు కాకుండా మిగిలిన నాలుగు భాషలూ ఈ కుటుంబానికి చెందినవి. ప్రస్తుతం ప్రపంచంలోని భాషలలో బెంగాలీ, ఇంగ్లీషు, ఫ్రెంచి, హిందీ, జర్మను, పోర్చుగీసు, రష్యను, స్పానిషు, వంటి అన్ని భాషలూ ఈ కుటుంబమునకు చెందినవి. ఇవే కాకుండా ఎన్నో చిన్న చిన్న భాషలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచములోని భాషాకుటుంబాలలో ఈ కుటుంబంలోని భాషలు అతి పెద్ద స్థానం కలిగి ఉన్నాయి. రెండవ అతి పెద్ద భాషా కుటుంబము చైనో-టిబెటిన్ భాషా కుటుంబము.
వర్గీకరణ
మార్చుఈ భాషా కుటుంబమును ఈ క్రింది ఉప కుటుంబాలుగా విభజించారు. (చారిత్రిక ప్రాధాన్యతానుసరణాక్రమం)
- అనటోలియను భాషలు — క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ శతాబ్దములోనుండి ఉన్నట్టు ధ్రువీకరించారు. ఇది లుప్తమై పోయిన భాషా ఉపకుటుంబము. వీటిలో ప్రముఖమైనది హిటైట్స్ భాష.
- ఇండో-ఇరానియన్ భాషలు ఇవి మూల ఇండో ఇరాను భాష అను భాషనుండి వచ్చినవి.
- ఇండో-ఆర్యన్ భాషలు (సంస్కృతముతో సహా) ఇది క్రీస్తు పూర్వం రెండవ సహస్రాబ్ది నుండి వాడుకలో ఉన్నట్టు ధ్రువీకరించబడింది.
- ఇరాను భాషా కుటుంబము ఇవి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరం నుండి వాడుకలో ఉన్నట్టు ధ్రువీకరించారు. ఇందులో అవెస్టను మరియూ పర్షియను భాషలు ఓ భాగము.
- గ్రీకు భాషా కుటుంబము మైకనియను లోని చిన్న చిన్న ఆధారాలు క్రీస్తు పూర్వం పద్నాల్గవ శతాబ్దం వరకూ, హోమర్ రచనలు క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలకు గ్రీకు భాషా చరిత్ర చూడండి.
- ఇటాలియను భాషా కుటుంబము (లాటిను భాష మరియూ దాని సంతతితో (రొమాన్సు భాషలు) కూడి) క్రీస్తు పూర్వం మొదతి సహస్రాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించారు.
- కెల్టిక్ భాషా కుటుంబము — గాలిష్ శాసనములు క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్దం వరకూ, పాత ఐరిషు భాషనకు చెందిన కొన్ని పుస్తకాలు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం వరకూ ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి.
- జెర్మానికు భాషలు (పాత ఇంగ్లీషు —తో సహా) రెండవ శతాబ్దంలోని రూనిక్ భాషలు ఈ భాషా కుటుంబమునకు చెందిన తొలి శాసనాలు. ఇంకా నాల్గవ శతాబ్దంలో [[గోథిక్ భాష]]కు చెందిన ఆధారాలు లభించినాయి.
- అర్మేనియను భాష, ఇది ఐదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడింది.
- టోకరియను భాషా కుటుంబము — ఇది టోకరియన్లు చే మాట్లాడబడి లుప్తమైపొయిన భాషా కుటుంబము. కానీ రెండు యాసల ద్వారా బ్రతికి ఉంది. ఇది ఆరవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడింది.
- బాల్టో సాల్విక్ భాషా కుటుంబము చాలామంది భాషా శాస్త్రవేత్తలు ఈ బాల్టిక్, స్వాలిక్ భాషలు ఒకేఉప-కుటుంబ మూల భాషనుండి జన్మించాయని అభిప్రాయపడినా, కొందమండి మాత్రం ఈ ఉప కుటుంబ విభజణను ఒప్పుకోరు. బాల్టిక్, స్వాలిక్ భాషల మధ్య ఉన్న పోలికలు, రెండు వేర్వేరు ఉపకుటుంబాల మధ్య ఉన్న పోలికలను మించవని వీరి అభిప్రాయం.
- సాల్విక్ భాషా కుటుంబము — తొమ్మిదవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడింది.
- బాల్టిక్ భాషా కుటుంబము — పద్నాల్గవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడినది కానీ ఆశ్చర్యరీతిగా ఈ భాషలో చాలా పురాతన లక్షణాలు కనిపిస్తాయి ముఖ్యముగా మూల ఇండో యూరోపియను భాష నుండి వచ్చినవి అని చెప్పబడే భాషల యొక్క లక్షణాలు ఈ భాషలలో కనిపిస్తాయి!
- అల్బేనియను భాషా కుటుంబము — పదిహేనవ శతాబ్దం నుండి ఉన్నట్టు ధ్రువీకరించబడింది. ఇలిరియను, డకియను, లేక థ్రాసియను భాషలతో సంబంధము ఉన్నదని భావించబడుతున్న .
పైన చెప్పబడిన పది సంప్రదాయమైన ఉప కుటుంబములే కాకుండా, ఈ కుటుంబమునకు చెందిన చాలా చాలా భాషలు, ఉప-కుటుంబములు ఉండిఉండేవని భాషావేత్తల నమ్మకము. కానీ ఇవి అన్నీ లుప్తమై పొయినాయి. వీటి గురించిన సమాచారము బహు దుర్లభం. లుప్తమైపోయినవిగా భావిస్తున్న భాషలు, ఉప-కుటుంబములలో కొన్ని:
- ఇలిరియను భాషా కుటుంబము — బహుశా మెసపియను లేదా వెనెటికు లకు సంబంధించినది, అల్బేనియనుతో కూడా సంబంధము ఉన్నదని భావించబడుతున్నది.
- వెనెటిక్ భాష — ఇటాలియనునకు దగ్గరగా ఉంటుంది .
- లిబురియను భాషా కుటుంబము — వెనెటిక్ కుటుంబముతో కూర్చబడినది
- మెస్సాపియను భాష — పూర్తిగా దీనిని అర్థముచేసుకొనలేదు.
- ఫ్రిగియను భాషా కుటుంబము — పురాతన ఫ్రిగియా యొక్క భాష, బహుశా గ్రీకు, థాసియను, అర్మేనియను భాషలకు దగ్గర సంబంధము కలిగి ఉండవచ్చు.
- పైవోనియను భాషా కుటుంబము — మేసిడానులో ఒకప్పుడు మాట్లాడిన, ప్రస్తుతము లుప్తమై పొయిన భాష.
- థ్రాసియను భాషా కుటుంబము — బహుశా డేసియను భాషనకు దగ్గరగా ఉండవచ్చు.
- డేసియను భాష — బహుశా థ్రాసియను మరియూ అల్బేనియను భాషలకు దగ్గరగా ఉండియుండవచ్చు.
- పురాతన మెసిడోనియను భాష — బహుశా గ్రీకు నకు సంబంధించినదై ఉండవచ్చు కొంతమంది భాషా శాస్త్రవేత్తలు ఇలిరియను, థ్రాసియను, ఫ్రిగియను భాషలకు సంబంధించినదంటారు.
- లిగ్యురియను భాష— ఇండో యూరోపియను కావచ్చూ, కాకపోవచ్చూ, సరియైన ఆధారాలు లభించలేదు, కానీ కెల్టిక్ భాషకు దగ్గరగా ఉండి ఉండవచ్చని భాచించబడుతున్నది.
ఇవే కాకుండా ఇంకా చాలా ఇండో యూరోపియను భాషలు ఉండేవి, ప్రస్తుతము వాటి ఉనికి కూడా మనకు తెలీదు. చిన్న రైటియను భాష గురించిన పూర్తి ఆధారాలు లభించలేదు.
ఇంకా కొన్ని ఉపకుటుంబాలు కూడా చెప్తూ ఉంటారు. వాటిలో ఇటాలో-కెల్టిక్ మరియూ గ్రీకు ఆర్యను భాషలు ముఖ్యమైనవి, కానీ వీటిని ఎక్కువమంది విద్వాంసులు ఒప్పుకొనరు. అలాగే అనటోలియను మరియూ ఇతర ఇండో యూరోపియను భాషా వర్గాల మధ్య చెప్పుకోదగ్గ తేడాలు ఉన్నాయని చెబుతూ, ఇండో హిటైట్ అనే మహా భాషాకుటుంబాన్ని ప్రతిపాదించే ఓ సిద్దాంతము ఉంది.
శతం, కెంతం భాషలు
మార్చుఇండో-యూరోపియన్ భాషా కుటుంబాన్ని తరచుగా "శతం", "కెంతం" వర్గాలుగా విభజిస్తారు. మూల భాషలోని కంఠ్య (velar) శబ్దాలు కాలానుగుణంగా వివిధ భాషలలో పొందిన మార్పులు ఈ విభజనకు ఆధారం. శతం భాషలలో స్వచ్ఛ కంఠ్య (velar) శబ్దాలకు కంఠోష్ఠ్య (labial velars) శబ్దాలకు మధ్య వ్యత్యాసం చెరిగి పోయి, కంఠ తాలవ్యాలు (palatal velars) ఉష్మీకరింపబడ్డాయి (assibilated). కెంతం భాషలలో మాత్రం స్వచ్ఛ కంఠ్య శబ్దాలకు (velars), కంఠ తాలవ్యాలకు (palatal velars) మధ్య వ్యత్యాసం లోపిస్తుంది. భౌగోళికంగా, "తూర్పు" వైపు వ్యాపించిన భాషలు శతం భాషలనీ (ఇండో-ఇరానియన్, బాల్తో-స్లావిక్ మొ.), " పశ్చిమ" భాషలు (జర్మానిక్, ఇటాలిక్, కెల్టిక్ మొ.) కెంతం భాషలనీ స్థూలంగా చెప్పవచ్చు. కానీ తూర్పున ఉన్న తోచారియన్, అనటోలియన్ భాషలలో కెంతం భాషా లక్షణాలే ఎక్కువ అని ఇక్కడ గమనించాలి. శతం-కెంతం వ్యవహార భేదక రేఖలు (isogloss) సరిగ్గా గ్రీకు (కెంతం భాష), అర్మేనియన్ (శతం భాష) భాషా సరిహద్దుల మీదుగా పయనిస్తాయి. గ్రీకు భాషలో శతం భాషల లక్షణాలు స్వల్పంగానైనా కనిపించడం విశేషం. కొన్ని భాషలు శతం-కెంతం విభజనకు లొంగవని కొంతమంది పండితుల అభిప్రాయము (అనటోలియన్, తోచారియన్, అల్బేనియన్ భాషలని వీరు ఉదాహరణలుగా పేర్కొనటం కద్దు). అంతే కాక, శతం-కెంతం భాషల వర్గ విభజనను ఉపకుటుంబ విభజనగా పరిగణించకూడదు: అంటే "మూల శతం", "మూల కెంతం" అనే భాషల నుండి మిగిలిన భాషలు ఉద్భవించాయని చెప్పరాదు. అప్పటికే (బహుశా క్రీస్తు పూర్వం 3వ సహస్రాబ్ది నాటికే) ప్రత్యేక భాషలుగా విడిపోయినా, పరస్పర సంపర్గం వల్ల ఈ ధ్వని పరిణామాలు (sound changes) ఒక భాష నుండి మరొక భాషకు వ్యాప్తి చెంది ఉండవచ్చునని భాషావేత్తల అభిప్రాయం.
మహాకుటుంబ ప్రతిపాదనలు
మార్చుకొందరు భాషావేత్తలు ఇండో-యూరోపియన్ భాషలు ఒక ఔపత్తిక (hypothetical) నోస్ట్రాటిక్ భాష లోని భాగమని ప్రతిపాదించి, ఈ ఇండో-యూరోపియన్ భాషలను ఇతర దక్షిణ కాకేషియన్, ఆట్లాంటిక్, యురాలిక్, ద్రవిడ, ఆఫ్రో-ఆసియా భాషాకుటుంబాలతో పోల్చి చూశారు. ఈ సిద్ధాంతం దీన్నే పోలిన జోసెఫ్ గ్రీన్ బెర్గ్ యూరాసియాటిక్ సిద్ధాతం, జాన్ కొలారుస్సో ప్రోటో-పాంటిక్ సిద్ధాంతాల్లాగనే వివాదాస్పదమైంది.
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- Slide-show of subgrouping roughly agreeing with the figures of the article.
- The Evolution of the Indo-European Languages, by Dr. C. George Boeree.
- Indo-European Roots, from the American Heritage Dictionary.
- Indo-European Documentation Center at the University of Texas at Austin
- Say something in Proto-Indo-European (by Geoffrey Sampson)
- IE language family overview (SIL)
- Gray & Atkinson, article on PIE Phylogeny
- Indo-European Root/lemmas (by Andi Zeneli)
- The Indo-European Database
- The Early History of Indo-European Languages