ఇంద్రభవనం
కృష్ణ దర్శకత్వంలో 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం
ఇంద్రభవనం 1991, మే 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మాలయ మూవీస్ పతాకంపై జి. నరసింహరావు నిర్మాణ సారథ్యంలో కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, మీనా, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, జ్యోతి తదితరులు నటించగా, బప్పీలహరి సంగీతం అందించాడు. 1990లో హిందీలో వచ్చిన స్వర్గ్ సినిమాకి రిమేక్ సినిమా ఇది.
ఇంద్రభవనం | |
---|---|
దర్శకత్వం | కృష్ణ |
రచన | డి.వి.నరసరాజు (మాటలు) |
స్క్రీన్ ప్లే | కృష్ణ |
దీనిపై ఆధారితం | స్వర్గ్ సినిమా (1990) |
నిర్మాత | జి. నరసింహరావు |
తారాగణం | కృష్ణ, మీనా, కృష్ణంరాజు, కోట శ్రీనివాసరావు, జ్యోతి[2] |
ఛాయాగ్రహణం | కె.ఎస్. హరి |
కూర్పు | కృష్ణ |
సంగీతం | బప్పీలహరి[1] |
విడుదల తేదీ | 3 మే 1991[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథా నేపథ్యం
మార్చుఈ చిత్రంలో కృష్ణ నమ్మకమైన సేవకుడి పాత్రను, యజమాని పాత్రను కృష్ణరాజు పోషించాడు. కొంతమంది బంధువులు, వ్యాపార విరోధుల చేసిన కొన్ని సంఘటనల వల్ల కృష్ణని బయటకు పంపిస్తాడు. అదే సమయంలో కృష్ణంరాజు జీవితంలో, వృత్తిలో చాలా నష్టపాతాడు. కృష్ణ తిరిగొచ్చి తన యజమానిని పూర్వస్థితికి ఎలా తీసుకొచ్చాడన్నది మిగతా కథ.[3]
నటవర్గం
మార్చు- కృష్ణ
- కృష్ణంరాజు
- మీనా
- జ్యోతి
- లతాశ్రీ
- కోట శ్రీనివాసరావు
- ఆహుతి ప్రసాద్
- శివాజీ రాజా
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- సుబ్బరాయ శర్మ
- సోనియా
- ప్రభాకర్ రెడ్డి (అతిథి పాత్ర)
- పేకేటి శివరాం (అతిథి పాత్ర)
సాంకేతికవర్గం
మార్చు- చిత్రానువాదం, దర్శకత్వం: ఘట్టమనేని కృష్ణ
- నిర్మాత: జి. నరసింహరావు
- మాటలు: డి.వి.నరసరాజు
- ఆధారం: స్వర్గ్ సినిమా (1990)
- సంగీతం: బప్పీలహరి
- ఛాయాగ్రహణం: కె.ఎస్. హరి
- కూర్పు: కృష్ణ
- నిర్మాణ సంస్థ: పద్మాలయ మూవీస్
పాటలు
మార్చుఈ చిత్రానికి బప్పీలహరి సంగీతం అందించాడు.[4]
- లవ్ లవ్ — మనో, అనూరాధా పౌడ్వాల్, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి
- తల వాకిట — మనో, అనూరాధా పౌడ్వాల్
- ప్రాణంలో ప్రాణమా — మనో, అనూరాధా పౌడ్వాల్, రచన: సిరివెన్నెల
- ఎటు చూసిన — మనో, అనూరాధా పౌడ్వాల్, రచన:సిరివెన్నెల
- చిక్కాలి చిక్కాలి — మనో, అనూరాధా పౌడ్వాల్, రచన: సిరివెన్నెల
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Indra Bhavanam 1991 film info".
- ↑ "Indra Bhavanam Cast". Archived from the original on 2020-07-27. Retrieved 2020-08-14.
- ↑ "Indra Bhavanam Plot".
- ↑ "Indra Bhavanam Songs".