సుబ్బరాయ శర్మ ఒక తెలుగు సినీ నటుడు. [1][2] ఈయన 1982 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యాడు.[1] నాటకాల్లో, టీవీ కార్యక్రమాల్లో కూడా నటించాడు. 1993, 1996 సంవత్సరాల్లో టీవీ నంది పురస్కారాలు అందుకున్నాడు.[1]

సుబ్బరాయ శర్మ
Sarma-Actor-Profile.jpg
జననంఉప్పలూరి సుబ్బరాయ శర్మ
(1947-01-19) 1947 జనవరి 19 (వయస్సు: 73  సంవత్సరాలు)
విజయవాడ, మద్రాస్ ప్రెసిడెన్సీ
నివాసంహైదరాబాద్
జాతీయతభారతీయుడు
చదువుబీ.కామ్
వృత్తినటుడు, దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1967–ప్రస్తుతం
ప్రసిద్ధులుమాయలోడు, మాతృదేవోభవ, మగధీర, టాప్ హీరో, విచిత్ర ప్రేమ, అనగనగా ఓ ధీరుడు
జీవిత భాగస్వామిజ్ఞానప్రసూనాంబ
పిల్లలుబాలపవన్ కుమార్
కిరణ్మయి
తల్లిదండ్రులు
  • ప్రసాద రావు (తండ్రి)
  • సుందరి (తల్లి)

నటనా రంగంసవరించు

బడిలో చదివే రోజుల్లో మిత్రుడైన సుత్తి వీరభద్రరావు తో కలిసి అనేక నాటకాలు ప్రదర్శించారు. వాటిల్లో చివరకి మిగిలేది అనే నాటకం బాగా రక్తి కట్టింది. కళాశాలలో చదివే రోజుల్లో పేషెంట్ మందు, అంతా ఇంతే, వాంటెడ్ ఫాదర్ అనే నాటకాల్లో నటించాడు. ప్రముఖ దర్శకుడు జంధ్యాల కూడా ఈయనకు కాలేజీలో సహవిద్యార్థి. కెమెరామెన్ యం.వి రఘు తో కలిసి కూడా కొన్ని నాటకాలు వేశాడు. 1970 లో హైదరాబాదులో ఉద్యోగం కోసం వచ్చి తన నటనా జీవితం కొనసాగించాడు. ఆర్టీసీ కార్మికులతో కలిసి నాటకాలు వేసేవాడు. వారు ఈయన్ను యాజమాన్యానికి రెకమెండ్ చేసి ఆర్టీసీ లో ఉద్యోగం కల్పించారు. యండమూరి వీరేంద్రనాధ్ సహచర్యంతో ఆయన వ్రాసిన కుక్క, రుద్రవీణ, గులాబిముళ్ళు, మనుషులు వస్తున్నారు జాగ్రత్త, శివరంజని, నిశ్శబ్ధం అనే నాటకాలలో నటించాడు. వీటిల్లో శివరంజని, పద్మవ్యూహం, హుష్‌కాకి నాటకాలు నాకు గుర్తింపును తెచ్చాయి. ఎల్. బి. శ్రీరామ్ వ్రాసిన ఒంటెద్దు బండి నాటకం నూరు ప్రదర్శనలు పూర్తి చేశాడు. ఈ నాటకం ద్వారా ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. 1983లో ఈటివీ ప్రసారాలు ప్రారంభం అయ్యాక అనిల్‌కుమార్ దర్శకత్వంలో వండర్ బాయ్ టెలిఫిలిం ద్వారా ఈటివికి పరిచయమయ్యాడు. శివలీలలు ఆయన మొట్ట మొదటి పౌరాణికం సీరియల్‌. అందులో ఆయన దక్షుడు పాత్ర ఆయనకు ప్రశంసలు తెచ్చింది. టివీ మీడియాలో మొదటిసారిగా ద్విపాత్రలో యాంకరింగ్ చేస్తూ నటించాడు. [3]

పురస్కారాలుసవరించు

జెమిని టివీలో ప్రసారమైన తులసీదళం సీరియల్ ద్వారా ప్రభుత్వ గుర్తింపు లభించింది. ఈ సీరియల్‌లో పైడితల్లి పాత్రకు గుర్తింపు 1993లో ఉత్తమసహాయ నటుడి అవార్డు లభించింది. రెండుసార్లు ప్రభుత్వ నంది నాటకోత్సవాలలో న్యాయనిర్ణేతగా వెళ్ళాడు. నాలుగుసార్లు నంది టివీ అవార్డుల కమిటీలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 2009లో ఢిల్లీతెలుగు అకాడమీ ద్వారా లైఫ్ టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డుతో సన్మానం పొందాడు.[3]

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "Subbaraya Sharma - MAA stars". maastars.com. Movie Artists Association. Retrieved 19 September 2016.
  2. "తెలుగు సినీ నటుడు సుబ్బరాయ శర్మ". nettv4u.com. Retrieved 19 September 2016.
  3. 3.0 3.1 కశ్యప. "నిత్య విద్యార్థి సుబ్బరాయ శర్మ". andhrabhoomi.net. ఆంధ్రభూమి. Retrieved 19 September 2016.[permanent dead link]

బయటి లింకులుసవరించు