అనూరాధా పౌడ్వాల్

భారతదేశ గాయని

అనూరాధా పౌడ్వాల్ (జననం 27 అక్టోబరు 1952) ఒక భారతీయ నేపథ్యగాయని. ఈమెకు గౌరవ డి.లిట్ పట్టా లభించింది. లతా మంగేష్కర్ తరువాత ఈ గౌరవాన్ని పొందిన రెండవ సినిమా నేపథ్య గాయని ఈమె. భారత ప్రభుత్వం ఈమెకు 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. ఈమెకు నాలుగు పర్యాయాలు ఉత్తమగాయనిగా పిల్మ్‌ఫేర్ పురస్కారం, 1989లో జాతీయ ఉత్తమ నేపథ్య గాయని పురస్కారం దక్కింది. ఈమె దాదాపు 9000 హిందీ పాటలు, మరికొన్ని ఇతర భాషల పాటలు పాడింది. ఈమె భక్తి సంగీతగాయనిగా పాపులర్ అయ్యింది. ఈమె హిందీ భాషలో అనేక భజనలు పాడింది. ఈమె టి - సిరిస్ ద్వారా అనేక ఆల్బమ్‌లను విడుదల చేసింది. ఈమె హిందీ భాషతో పాటుగా కన్నడ, రాజస్థానీ, పహరీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం, గుజరాతీ, తమిళం, తెలుగు, ఒరియా, ఆస్సామీస్, పంజాబీ, భోజ్‌పూరీ, మైథిలీ, నేపాలీ మొదలైన అనేక భాషలలో గీతాలాపన చేసింది.[1]

అనూరాధా పౌడ్వాల్
వ్యక్తిగత సమాచారం
జన్మ నామంఅల్కా నాదకర్ణి
జననం27 October 1952 (1952-10-27) (age 71)
కర్వార్, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక
సంగీత శైలినేపథ్య గానము, భజనలు
వృత్తిగాయని
వాయిద్యాలుగాత్రము
క్రియాశీల కాలం1973–ప్రస్తుతం

జీవిత విశేషాలు మార్చు

ఈమె అల్కా నాదకర్ణి అనే పేరుతో కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన కర్వార్ అనే గ్రామంలో ఒక కొంకణి కుటుంబంలో జన్మించింది. ఈమె ముంబాయిలో పెరిగింది. 1973లో అమితాబ్ బచ్చన్, జయబాధురి జంటగా నటించిన "అభిమాన్" అనే చిత్రంలో ఒక సంస్కృత శ్లోకం ఆలపించడం ద్వారా గాయనిగా ఈమె ప్రస్థానం ప్రారంభమైంది. అదే ఏడాది మరాఠీలో "యశోద" అనే చిత్రంలో పాడింది. ఈమె 1974లో మరాఠీ భాషలో విడుదల చేసిన "భావగీతాలు" మంచి జనాదరణను పొందింది. ఈమె ఎవరివధ్దా శాస్త్రీయ సంగీత శిక్షణను పొందలేదు. లతా మంగేష్కర్ పాటలను వింటూ స్వంతంగా పాడటం అభ్యసించింది.[2]

ఈమె శత్రుఘ్న సిన్హా, రీనారాయ్ నటించిన "కాళీచరణ్" సినిమాతో హిందీ సినిమాలలో తన స్థానాన్ని పదిలపరచుకుంది. ఈమె రాజేష్ రోషన్, జయదేవ్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, ఉషా ఖన్నా, ఎస్.డి.బర్మన్, శివ్-హరి, రవీంద్రజైన్, ఆర్.డి.బర్మ, బప్పీలహరి, ఆనంద్-మిలింద్, నదీమ్-శ్రావణ్, జతిన్ లలిత్, దిలీప్ సేన్ - సమీర్ సేన్, ఎ.ఆర్.రహ్మాన్, అనూ మాలిక్, జగ్జీత్ సింగ్, అనుప్ జలోటా, ఉత్తం సింగ్, రామ్-లక్ష్మణ్, హంసలేఖ, అరుణ్ పౌడ్వాల్, విజు షా, ఆనంద్ రాజ్ ఆనంద్, విశాల్ భరద్వాజ్, హిమేష్ రేషమియా, ఎం.ఎం.కీరవాణి, ఆదేశ్ శ్రీవాత్సవ, సాజిద్ - వాజిద్, నుస్రత్ ఫతే అలీ ఖాన్, నిఖిల్ వినయ్, సుఖ్వీందర్ సింగ్, అద్నాన్ సామి, సంజీవ్-దర్శన్, అజయ్-అతుల్ మొదలైన సంగీత దర్శకులతో పనిచేసింది. కుమార్ సాను, ఉదిత్ నారాయణ్, మహమ్మద్ అజీజ్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ,లతా మంగేష్కర్, ఆశా భోస్లే, కవితా కృష్ణమూర్తి, అల్కా యాజ్ఞిక్, సాధనా సర్గమ్‌, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, హరిహరన్, కె.జె.యేసుదాస్, రాజేష్ కృష్ణన్ వంటి గాయకులతో కలిసి పాడింది.

వ్యక్తిగత జీవితం మార్చు

ఈమె అరుణ్ పౌడ్వాల్ ను వివాహం చేసుకుంది. అరుణ్ సంగీత దర్శకుడు ఎస్.డి.బర్మన్ వద్ద సహాయకుడిగా పనిచేసేవాడు. ఈమె కుమార్తె కవితా పౌడ్వాల్ కూడా గాయని. ఇంకా ఈమెకు ఆదిత్య పౌడ్వాల్ అనే కుమారుడు ఉన్నాడు.

Popular Bollywood music album మార్చు

Anuradha paudwal has solo female singer for these movies- Pyar bhara dil, Ghar aaya mera pardesi, Sadak, Lal dupatta mal mal ka, Kasam Teri Kasam, Saathi, Junoon, Aaye Milan ki raat, Meera ka mohan, Bahar aane tak, Dhaai akshar prem ke, Pyar Pyar, Dastoor, Beta, Dil hai ke manta nahin, Maina, Deewana sanam, Main Tera aashiq, Ek dhun Pyar ki, Sangeet, Sahibaan, Doodh ka karz, Jaan ki kasam, Yaadon ke mausam, Shabnam Chor aur chand, Aashiqui, Aaja meri jaan, Bewafa sanam Etc.[ఆధారం చూపాలి]

Popular Pop album మార్చు

Ahsaas (beete din beete pal), Aashiyan, Deewanigie, Ishq hua, Bewafa Sanam (All series), Raat, Chaahat, Asar, Rishta, Ishq etc.

డిస్కోగ్రఫీ మార్చు

పురస్కారాలు మార్చు

 • 2017: Padma Shri- India's fourth civilian honour.
 • 2016: D litt Award
 • 2010: Lata Mangeshkar Award
 • 2011: Mother Teresa Award for Lifetime Achievement[3]
 • 2015: Suvarnaratna Awards-2015
 • 2004 Mahakaal award from Madhya Pradesh govt.
 • the citizen award, which she received at the hand of late Shri Rajiv Gandhi in 1989
 • national award of 1990 by the then president Shri Venkat Raman,
 • she had got the 28th Maharashtra state Marathi film award in 1990.
 • Mahila Shiromani award in 1993 at the hands of the first lady smt. vimal sharma.
 • the India international gold award & the gold medal for the year 1994.
 • the NRI association has honoured her with the Natraaj awards.

Awards and nominations మార్చు

Year Category Song/Nomination Result
National Film Awards
1989 Best Playback Singer (Female) He Ek Reshami – Kalat Nakalat గెలుపు
Filmfare Awards
1983 Best Playback Singer (Female) Maine Ek Geet Likha Hai – Yeh Nazdeekiyan Nominated
1984 Best Playback Singer (Female) Tu Mera Hero Hain – Hero Nominated
1986 Best Playback Singer (Female) Mere Man Bajo Mridang – Utsav గెలుపు
1989 Best Playback Singer (Female) Keh Do Ki Tum – Tezaab Nominated
1990 Best Playback Singer (Female) Tera Naam Liya – Ram Lakhan Nominated
Bekhabar Bewafa – Ram Lakhan Nominated
1991 Best Playback Singer (Female) Nazar Ke Saamne – Aashiqui గెలుపు
Best Playback Singer (Female) Mujhe Neend Na Aaye – Dil Nominated
1992 Best Playback Singer (Female) Dil Hai Ki Manta Nahin – Dil Hai Ki Manta Nahin గెలుపు
Best Playback Singer (Female) Bahut Pyar Karte Hain – Saajan Nominated
1993 Best Playback Singer (Female) Dhak Dhak Karne Laga – Beta గెలుపు
Odisha State Film Awards
Apsara Film & Television Producers Guild Awards
2004 Best Playback Singer (Female) Intezaar – Paap Nominated

మూలాలు మార్చు

 1. Sakshi (27 October 2021). "ఆమె గళమే ఒక అర్చన..." Retrieved 29 October 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
 2. "kavitachhibber.com". Archived from the original on 2011-06-15. Retrieved 2017-05-03.
 3. "Mother Teresa Award for Anuradha".

బయటి లింకులు మార్చు