లతాశ్రీ (పద్మలత, శ్రీలత) తెలుగు సినిమా నటి. ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్‌కి సోదరిగా నటించిన లతాశ్రీ, సహాయక పాత్రలలో గుర్తింపు పొందింది.[1] తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో సుమారు 80కి పైగా సినిమాలలో నటించింది.

లతాశ్రీ
జననం
పద్మలత

వృత్తితెలుగు సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు1990-1999, 2007-ప్రస్తుతం

జననం సవరించు

లతాశ్రీ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో జన్మించింది. తండ్రి ముల్పూరి మాధవరావు, తల్లి సువర్ణలత.[2] లతాశ్రీ ఇంటర్ వరకు చదువుకుంది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత శ్రీలత, 'లతాశ్రీ' గా పేర్లు మార్చుకుంది.[3]

సినిమారంగం సవరించు

చిన్నప్నటినుండి సినిమాలంటే ఇష్టమున్న లతాశ్రీ, డాన్స్ కూడా నేర్చుకుంది. లతాశ్రీ 10వ తరగతి చదువుతున్నప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ తీసిన మన్మధ సామ్రాజ్యం సినిమా ఆడిషన్ కోసం ఫోటోగ్రాఫ్‌లు పంపి సినిమాకు ఎంపికయింది. 1990లో ఇరుగిల్లు పొరుగిల్లు అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. సినిమాలో చిన్న పాత్ర పోషించినప్పటికీ, తన నటనతో ఇతర దర్శకులను ఆకట్టుకోవడంతో మరిన్ని సినిమాలలో నటించే అవకాశం పొందింది. 1991లో విడుదలైన పందిరిమంచం సినిమా విజయవంతంకావడంతో లతాశ్రీకి ప్రజాదరణ పెరిగింది. శ్రీదేవి నర్సింగ్ హోమ్ (1994), అతిలి సత్తిబాబు (2007) వంటి సినిమాలలో నటించింది.[4] 1999లో సినిమాలకు దూరమైన లతాశ్రీ, 2007లో ఈవీవీ సత్యనారాయణ తీసిన ‘అత్తిలి సత్తిబాబు’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

వ్యక్తిగత జీవితం సవరించు

లతాశ్రీ జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.[5]

సినిమాలు సవరించు

మూలాలు సవరించు

  1. "Anveshana team finds Aa Okkati Adakku actress Lathasri". ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  2. Suresh, Lavanya (2020-08-31). "టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫ్యామిలీకి, సీనియర్ నటి లతాశ్రీకి ఉన్న రిలేషన్ ఏమిటి.? » Telugudesk". Telugudesk (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  3. Bojja, Santhosh Kumar (2019-07-02). "ఆ మూవీ షూటింగులో శ్రీహరిగారు నన్ను కొట్టారు: హీరోయిన్ లతాశ్రీ". www.telugu.filmibeat.com. Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  4. "Tollywood Movie Actress Latha Sri Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Archived from the original on 2022-03-19. Retrieved 2022-03-19.
  5. "లతా శ్రీ మేనల్లుడే నాగశౌర్య.. బంధుత్వం తెంచుకోవడంపై నటి ఆవేదన". Samayam Telugu. Archived from the original on 2020-08-30. Retrieved 2022-03-19.

బాహ్య లింకులు సవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=లతాశ్రీ&oldid=3785559" నుండి వెలికితీశారు