ఇంప్రెషనిజం
ఇంప్రెషనిజం (ఆంగ్లం: Impressionism) 1870 లో ఫ్రాన్సులో చిత్రలేఖనానికి సంబంధించి ఉద్భవించిన ఒక కళా ఉద్యమం. సాంప్రదాయిక చిత్రలేఖనానికి భిన్నంగా ఇంప్రెషనిజంలో రంగులు (ఒకదానితో మరొకటి గానీ, ఒక రంగును వేరే మాధ్యమంలో గానీ) కలపకుండా ఉపరితలం పై నేరుగా చుక్కలుగా అద్దుతూ గానీ, లేదా కుంచెతో ఘతాలుగా వేయబడుతూ గానీ, కాంతి పరావర్తనాన్ని (reflected light) చిత్రీకరించటం జరుగుతుంది.[2] కాంతి, రంగు ల తాత్కాలిత ప్రభావాలతో దృశ్య వాస్తవికత (visual reality) ని కచ్చితంగా, నిష్పాక్షికంగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఇంప్రెషనిజం యొక్క ప్రస్ఫుటమైన లక్షణం.[3] ఒక వస్తువు పై గానీ, వ్యక్తి పై గానీ, గ్రామ సన్నివేశంలో గానీ కాంతి యొక్క ప్రభావాల చిత్రీకరణను ఇంప్రెషనిజంలో చూడవచ్చు.[4] ఇంప్రెషనిజంలో సునిశితమైన వివరాల కంటే చిత్రీకరించబడే దృశ్యం యొక్క చుట్టుప్రక్కల వాతావరణానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.[5] అప్పటికి వేళ్ళూనుకొని పోయిన చిత్రలేఖన శైలులను సవాలు చేసినందుకు, ఆధునికతకు, నూతన సాంకేతికతలను, భావాలను పుణికిపుచ్చుకొన్నందుకు, ఆధునిక జీవన విధానాన్ని చిత్రీకరించినందుకు, చిత్రలేఖన చరిత్రను కీలక మలుపు తిప్పినందుకు ఇంప్రెషనిజం కొనియాడబడుతుంది.[6][7] చిత్రకళలో మాడర్న్ ఆర్ట్ సిద్ధించటానికి కూడా ఇంప్రెషనిజం ఉత్ప్రేరకంగా ఉపయోగపడింది.[8]
వ్యుత్పత్తి
మార్చు1874 లో క్లౌడే మోనెట్ తన స్వస్థలం అయిన పోర్ట్ లే హావ్రేలో సూర్యోదయాన్ని చిత్రీకరించి, ఈ చిత్రలేఖనానికి Impression, Sunrise అనే పేరు పెట్టాడు. లూయిస్ లెరాయ్ అనే కళావిమర్శకుడు ఇది Impression ను కలుగజేసే ఒక అసంపూర్తి స్కెచ్ వలె ఉంది అనటంతో ఈ కళా ఉద్యమానికి ఇంప్రెషనిజం అనే పేరు సార్థకం అయ్యింది.[6] ఇంప్రెషన్ అనేది దేని గురించైనా ఒక ఆలోచన, భావన. దైనందిన జీవితం లోని సన్నివేశాలను ఇంప్రెషనిస్టులు తమ చిత్రలేఖనాలలో బంధించేవారు.[7]
చరిత్ర
మార్చుఅప్పట్లో ఫ్రాన్స్ లో ఒక చిత్రలేఖనం ప్రదర్శితమవ్వాలన్నా, బహుమతి గెలుపొందాలన్నా Académie des Beaux-Arts (Academy of Fine Arts) యొక్క సభ్యులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించే Salon సమీక్ష అవసరం.[6] అయితే చిత్రలేఖనం అనేది పౌరాణిక సన్నివేశాలకు, యుద్ధ సన్నివేశాలకు సంబంధించినది అయ్యి ఉండాలి, తప్పితే ప్రముఖుల ముఖ చిత్రం అయ్యి ఉండాలి అనేది సెలూన్ నియమం.[7][8]
1874 లో క్లౌడే మోనెట్, ఎద్గార్ డిగాస్, కమిల్లే పిస్సారో వంటి వారు సభ్యులుగా Société Anonyme Coopérative des Artistes Peintres, Sculpteurs, Graveurs (Cooperative and Anonymous Association of Painters, Sculptors, and Engravers) అనే ఒక కళాకారుల సమూహం ఏర్పడి పారిస్లో ఒక కళా ప్రదర్శన నిర్వహించింది. ఈ కళాకారుల సమూహం యొక్క ఏకైక లక్ష్యం, కళలపై సెలూన్ విధించిన కఠినమైన నియమనిబంధనల నుండి స్వాతంత్ర్యం. ఈ సమూహంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన శైలి అయిననూ సమూహంగా వీరి శైలి సమకాలీకంగా పరిగణించబడింది. వీరి కళాఖండాలు అసంపూర్ణమైనవిగా, స్కెచ్ ల వలె అనిపిస్తూనే, ఆధునిక జీవనశైలిని స్పృశించాయి.
శైలి
మార్చుఇంప్రెషనిజం ప్రధానంగా ఆరుబయటి సన్నివేశాలు చిత్రీకరించేది.[10] ముందుగా స్కెచ్ లు వేసుకొని స్టూడియోలలో ఈ స్కెచ్ లను పూర్తి స్థాయి చిత్రలేఖనాలుగా అభివృద్ధి చేసుకొనే పురాతన శైలికి ఇంప్రెషనిజం స్వస్తి పలికింది. స్కెచ్ లు వేయకుండా అక్కడికక్కడే పూర్తి స్థాయి చిత్రలేఖనాలు వేయబడటం, ఇంప్రెషనిజంతో మొదలైంది.
పారిస్ నగర శివారు ప్రాంతాల, ఫ్రాన్స్ దేశపు గ్రామీణ సన్నివేశాలకు ఇంప్రెషనిజం పెద్దపీట వేసింది.[11] వారాంతాలలో పారిస్ నగర వాసులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి సెలవులను ఆనందమయం చేసుకొనేవారు. వీరి చిత్రలేఖనాలను, గ్రామీణ ప్రాంతాల ఆటవిడుపు కార్యక్రమాలను ఇంప్రెషనిస్టులు చిత్రీకరించారు. ఫ్రాంకో ప్రషియన్ యుద్ధం వలన ప్యారిస్ లో విపరీతంగా పెరిగిపోయిన జనాభా, ఇంప్రెషనిస్టులు నగర సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం కూడా ఇచ్చింది. నర్తకులు, గాయకులు, నాటకరంగం, కేఫేలు వంటివి చిత్రీకరించబడ్డాయి.
-
జె ఎం డబ్ల్యూ టర్నర్ చిత్రీకరించిన The Fighting Temeraire, tugged to her last berth to be broken up ఒక విధ్వంస చిత్రం. ఒక భారీ నౌక, ఒక చిన్న ఓడను నాశనం చేసిన చిత్రలేఖనాన్ని వాతావరణం చిత్రీకరణ తోనే విధ్వంసాన్ని పలికించిన తీరు
-
పియర్ ఆగస్టు రెన్వా Dance at Le Moulin de la Galette అనే చిత్రపటంలో విందు, నాట్యాలను చిత్రీకరించాడు
-
ఆల్ఫ్రెడ్ సిస్లే చే చిత్రీకరించబడ్డ View of the Canala, Saint Martin
-
కామిల్లే పిస్సారో చే చిత్రీకరించబడిన Boulevard Montmarte
నైపుణ్యం
మార్చుఇంప్రెషనిజం శైలి చిత్రలేఖనానికి ప్రత్యేకమైన నైపుణ్యం అవసరం అవుతుంది.[10] కాంతి, రంగుల పై అధికమైన అవగాహన, సమయం గడిచే కొద్దీ (చిత్రలేఖనం ప్రారంభించినప్పటి నుండి పూర్తి చేసే వరకు) సూర్యుని చలనం వలన దృశ్యం లో, అందులోని రంగులల వచ్చే తాత్కాలిత మార్పులను జాగ్రత్తగా గమనించవలసి వస్తుంది. ఎప్పటికప్పుడు మారే కాంతిని చిత్రీకరించటానికి కుంచె వేగంగా కదలవలసి వస్తుంది, అనగా పొడవాటి ఘతాలు కాకుండా చిన్న చిన్న ఘతాలతోనే కాంతి యొక్క ప్రభావాలు చిత్రీకరించవలసి వస్తుంది.
-
క్లౌడే మొనెట్ చిత్రీకరించిన Wheatstacks
-
కామిల్లే పిస్సారో చే చిత్రీకరించబడిన Hay Harvest at Éragny
-
బెర్తె మోరిసాట్ చే చిత్రీకరించబడిన The Harbor at Lorient
-
ఎద్గార్ డేగాస్ చే చిత్రీకరించబడిన Dancers at the Bar
లక్షణాలు
మార్చుఈ కళాకారుల సమూహం తమ చిత్రలేఖనాలలో ప్రధానంగా ఈ క్రింది లక్షణాలు కనబడేలా చూసేవారు
- ఎటువంటి ఆకారం లేని చిన్న చిన్న కుంచె ఘతాలు. అవి కూడా ఎక్కువ పనితనం లేకుండా ఉండటం
- పరిపూరకమైన రంగులు (complementary colors) ఒకదానిలో మరొకటి కలపకుండా, ఒకదాని ప్రక్కన మరొక రంగును ఉపయోగించటం[8][12]
- కాంతి యొక్క ప్రభావం పై ప్రత్యేక శ్రద్ధ
- నీడలకు సైతం (కేవలం నలుపు, తెలుపు, ఆ రెండింటి కలయికలు కాకుండా ఇతర) రంగులు అద్దబడి ఉండటం.[6] మంచు వంటి వాటిని చిత్రీకరించటంలో కేవలం నలుపు, తలుపు వాటి మిశ్రమాలే కాక ఇతర రంగులను కూడా ప్రయోగించవలసిన అవసరం గుర్తించబడటం[8]
- ఫోటోగ్రఫీని తలపింప జేసే కూర్పు[8]
విమర్శ
మార్చుఇంప్రెషనిజం పై చిత్రకళకు పట్టిన శనిగ్రహం (Pure Evil), భయానకం (A chamber of Horrors), కోతి చేతికి రంగులు ఇచ్చినట్లు ఉంది వంటి విమర్శలు వెల్లువెత్తాయి[7]
ప్రభావాలు
మార్చుఇంప్రెషనిజం క్రొత్త కళా ఉద్యమాలకు తెర తీసింది.[8] నియో-ఇంప్రెషనిజం, పోస్ట్-ఇంప్రెషనిజం, ఎక్స్ప్రెషనిజం, ఆబ్స్ట్రాక్ట్ ఆర్ట్, ఆబ్స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిజం వంటివి ఇంప్రెషనిజం నుండే ఉద్భవించాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Samu, Margaret (October 2004). "Impressionism: Art and Modernity". metmuseum.org. Retrieved 15 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Webster, Merriam. "Impressionism". Merriam Webster. Retrieved 14 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Britannica, Encyclopedia. "Impressionism". Encyclopedia Britannica. Retrieved 14 April 2022.
- ↑ Dictionary, Cambridge. "Impressionism". Cambridge Dictionary. Retrieved 14 April 2022.
- ↑ Learner's Dictionaries, Oxford. "Impressionism". Oxford Learner's Dictionaries. Retrieved 14 April 2022.
- ↑ 6.0 6.1 6.2 6.3 Samu, Margaret (October 2004). "Impressionism: Art and Modernity". metmuseum.org. Retrieved 14 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 7.0 7.1 7.2 7.3 "What is Impressionism?". tate.org.uk. Retrieved 2022-04-16.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 Richman-Abdou, Kelly (2019-06-12). "How Impressionism Changed the Art World and Continues to Inspire Us Today". mymodernmet.com. Retrieved 2022-04-16.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Samu, Margaret (October 2004). "Impressionism: Art and Modernity". www.metmuseum.org. Retrieved 2022-04-15.
- ↑ 10.0 10.1 "Impressionism". tate.org. Retrieved 2022-04-16.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 11.0 11.1 Samu, Margaret (October 2004). "Impressionism: Art and Modernity". metmuseum.org. Retrieved 2022-04-15.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Muse, Curious (17 September 2021). "Impressionism in 8 Minutes: How It Changed The Course of Art". youtube. Retrieved 30 April 2022.
{{cite web}}
: CS1 maint: url-status (link)