ఇక్బాల్ అహ్మద్ సరద్గి
ఇక్బాల్ అహ్మద్ సరద్గి ( 1944 జూన్ 5- 2024 మే 22) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. 14వ లోక్ సభ సభ్యుడు. ఇక్బాల్ అహ్మద్ సరద్గి కర్ణాటక లోని గుల్బర్గా నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014 నుండి 2020 వరకు కర్ణాటక శాసన మండలి సభ్యుడుగా పనిచేశాడు. [1]ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.
ఇక్బాల్ అహ్మద్ సరద్గి | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు 13వ లోక్ సభ | |
In office 1999 అక్టోబర్ 10 – 2009 ఫిబ్రవరి 6 | |
అంతకు ముందు వారు | అతనే |
నియోజకవర్గం | గుల్బర్గా లోక్సభ నియోజకవర్గం |
పార్లమెంట్ సభ్యుడు 14వ లోక్ సభ | |
In office 2004 మే 17 – 2009 మే 18 | |
నియోజకవర్గం | గుల్బర్గా లోక్సభ నియోజకవర్గం |
వ్యక్తిగత వివరాలు | |
జననం | గుల్బర్గా, కర్ణాటక, భారతదేశం | 1944 జూన్ 5
మరణం | 2024 మే 22 కర్ణాటక, భారతదేశం | (వయసు 79)
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | షాబితా బేగం |
సంతానం | ఒక కొడుకు ఒక కూతురు |
తల్లిదండ్రులు | గౌర్ బేగం(తల్లి) మహమ్మద్ అహ్మద్ సరద్గి (తండ్రి) |
నివాసం | గుల్బర్గా, కర్ణాటక, భారతదేశం |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | న్యాయవాది వ్యవసాయ వేత్త విద్యా వేత్త రాజకీయ నాయకుడు |
As of సెప్టెంబర్ 25, 2006 Source: [1] |
ప్రారంభ జీవితం కుటుంబం
మార్చుఇక్బాల్ అహ్మద్ సరద్గీ 1944 జూన్ 5న హైదరాబాద్ రాష్ట్రంలోని గుల్బర్గాలో మహ్మద్ అహ్మద్ సరద్గి గౌహర్ బేగమ్ దంపతులకు జన్మించారు. ఇక్బాల్ అహ్మద్ సరద్గి గుల్బర్గాలోని ప్రభుత్వ ఆర్ట్స్ సైన్స్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యను పూర్తి చేశాడు. హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లా కళాశాల నుండి ఎల్ ఎల్ బి ని పూర్తి చేశాడు. ఇక్బాల్ అహ్మద్ సరద్గి వృత్తిరీత్యా న్యాయవాది, వ్యవసాయవేత్త విద్యావేత్త.[2]
నియోజకవర్గం
మార్చుఇక్బాల్ అహ్మద్ సరద్గి 13వ 14వ లోక్ సభ కు గుల్బర్గా (లోక్సభ నియోజకవర్గం) నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.[2]
విద్యాసంస్థలు
మార్చు- గుల్బర్గాలోని అల్-బదర్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్
- గుల్బర్గాలోని అల్-బదర్ రూరల్ డెంటల్ కళాశాల
రాజకీయ జీవితం
మార్చు2009 15వ లోక్ సభ ఎన్నికలలో గుల్బర్గా నియోజకవర్గాన్ని ఎస్సీలకు రిజర్వు స్థానంగా కేటాయించారు. ఇక్బాల్ అహ్మద్ సరద్గి ఆ వర్గానికి చెందినవారు కావడంతో, అప్పటి కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇక్బాల్ అహ్మద్ సరద్గి కు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఈ సీటును గెలుచుకున్న మల్లికార్జున ఖర్గే రిపబ్లిక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు.
ఇక్బాల్ అహ్మద్ సరద్గి చాలా కాలం పాటు రాజకీయాలలో చురుగ్గా ఉన్నాడు. ఆయన మరణించే వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ సభ్యుడుగా ఉన్నాడు.
పదవులు
మార్చు# | నుండి. | కు. | పదవులు |
---|---|---|---|
1 | 1978 | 1979 | ఛైర్మన్-గుల్బర్గా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్, గుల్బర్గా. [3] |
2 | 1992 | 1995 | గుల్బర్గా డెవలప్మెంట్ అథారిటీ [3] |
3 | 1999 | 2004 | గుల్బర్గా నుండి 13వ లోక్సభ ఎంపీ (1వ పదవీకాలం).[4] |
4 | 2004 | 2009 | గుల్బర్గా నుండి 14వ లోక్సభ ఎంపీ (2వ పదవీకాలం).[5] |
5 | 2014 | 2020 | కర్ణాటక శాసన మండలి సభ్యుడు [1] |
మరణం.
మార్చుఇక్బాల్ అహ్మద్ సరద్గి 79 సంవత్సరాల వయసులో, 2024 మే 22న, కలబురగ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించాడు.[12]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ಇಕ್ಬಾಲ್ ಅಹಮದ್". www.kla.kar.nic.in. Retrieved 2021-11-20. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "Members : Lok Sabha". loksabhaph.nic.in. Retrieved 2021-07-09. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ 3.0 3.1 Sabha, India Parliament Lok (2000). Who's who (in ఇంగ్లీష్). Parliament Secretariat.
- ↑ "1999 India General (13th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2021-07-09.
- ↑ "2004 India General (14th Lok Sabha) Elections Results". www.elections.in. Retrieved 2021-07-09.
- ↑ The Spectrum of Psychotic Disorders.
- ↑ Bhasin, Avtar Singh (2008). India's Foreign Relations, 2007: Documents (in ఇంగ్లీష్). Public Diplomacy Division, Ministry of External Affairs by Geetika Publishers. ISBN 978-81-901629-0-6.
- ↑ Wakf, India Parliament Joint Parliamentary Committee on (2009). Report of Joint Parliamentary Committee on Wakf on Implementation of Wakf Act, 1995 ...: (Ninth Report) (in ఇంగ్లీష్). Rajya Sabha Secretariat.
- ↑ Darpan, Pratiyogita (November 2006). Pratiyogita Darpan (in ఇంగ్లీష్). Pratiyogita Darpan.
- ↑ Dewan, Vijay Kumar (2009). Child Labour: A Socio-legal Perspective (in ఇంగ్లీష్). Pentagon Press. ISBN 978-81-8274-360-1.
- ↑ Lok Sabha, India. Parliament (10 March 2008). Lok Sabha Debates.
- ↑ Bureau, The Hindu (2024-05-22). "Former Karnataka MP Iqbal Ahmed Saradgi passes away". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2024-05-22.