ప్రధాన మెనూను తెరువు

శాతవాహనుల అనంతరం విజయపురి (నాగార్జునకొండ ) కేంద్రంగా ఈక్ష్వాకులు అధికారంలోకి వచ్చారు. క్రీస్తు శకం 220 నుండి 295 వరకు దాదాపు 75 సంవత్సరాలు పాలించారు. పురాణములలో ఏడుగురు ఇక్ష్వాకులు ప్రస్తావించబడినప్పటికీ శాసనాలు మాత్రం నలుగురి గురించి మాత్రమే ప్రస్తావించాయి. వీరి చరిత్రను తెలియజేసే ఆధారాలు నాగార్జున కొండ, అమరావతి, జగ్గయ్యపేట మరియు రాంరెడ్డి పల్లి వద్ద లభ్యమైన శాసనాలను బట్టి తెలుస్తున్నది. కేవలం 75 సంవత్సరాలు మాత్రమే పాలించిప్పటికీ ఆంధ్రదేశంలో సాంస్కృతికి వికాసానికి ఇక్ష్వాకులు గొప్ప పునాదిని వేసారు. వీరికాలంనాటి సాంస్కృతికి వికాసాన్ని తెలుసుకొనేముందు వీరి యుగ ప్రాముఖ్యతను, విశిష్టతను గుర్తించవలసి ఉంటుంది.

గ్రామ పాలనసవరించు

1. ఇక్ష్వాకుల కాలంలో ఐదేసి గ్రామాలను కలిపి గ్రామ పంచికగా పిలిచేవారు. 2. మహాగ్రామ అనే భూభాగం మహాగ్రామిక ఆధీనంలో ఉండేది. 3. వ్యవసాయం ప్రధాన వృత్తి. 4. పంటలో ఆరో వంతు పన్నుగా చెల్లించేవారు. 5.భూమిపై రాజుకే సర్వాధికారం. 6. వృత్తి పనివారు శ్రేణులుగా ఏర్పడేవారు. 7. పర్ణిక శ్రేణి (తమలపాకుల వారి సంఘం),పూసిక శ్రేణి (మిఠాయిలు చేసేవారి సంఘం) ఉండేవి. 8. వీటికి కులిక ప్రముఖుడు శ్రేణి నాయకుడుగా ఉండేవాడు. 9. దేవాలయాలు, మంటపాల నిర్వహణ కోసం అక్షయనిధి ఉండేది.

సమాజంసవరించు

వర్ణ వ్యవస్థ ఉండేది.సంఘంలో బ్రాహ్మణులకు అధిక గౌరవం దక్కింది.రాజులు బ్రాహ్మణులకు అగ్రహారాలు, బ్రహ్మదేవాలు బహుమతులుగా ఇచ్చేవారు. సంఘంలో స్త్రీలకు గౌరవం ఉండేది. వృత్తిపనివారు శ్రేణులుగా ఏర్పడి వర్తకం చేసేవారు.బౌద్ధ,జైన భాగవత మతాలు ప్రాచుర్యం పొందాయి.రాణివాసపు స్త్రీలు,వివిధ వృత్తుల వాళ్లు బౌద్ధ విహారాలు, చైత్యాలు,స్థూపాలకు విరివిగా దానాలు చేసేవారు.ఇక్ష్వాకుల శాసనాల్లో నిగమ,గోఠీ అనే పదాలు కన్పిస్తాయి. ఇవి స్వయం సంఘాలని చెప్పొచ్చు.

ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వాణిజ్యం రోమన్ దేశంతో జరిపినట్లు తెలుస్తోంది.అమరావతి, వినుకొండ, చేబ్రోలు,భట్టిప్రోలు, నాగార్జునకొండ ప్రాంతాల్లో రోమన్ బంగారు నాణేలు లభ్యమవ్వడమే ఇందుకు నిదర్శనం. ఘంటశాల, కొడ్డూర (గూడూరు), మైసోలియా (మచిలీపట్నం) తూర్పు తీరంలో రేవు పట్టణాలుగా ప్రసిద్ధి చెందాయి. పశ్చిమ తీరంలో కళ్యాణ్, సోపార, బారుకచ్ఛ ప్రధాన వర్తక రేవులుగా గుర్తింపు పొందాయి.

మత పరిస్థితులుసవరించు

ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధంతో పాటు,కార్తికేయ ,శివ,అష్టభుజస్వామి,మాతృదేవత ఆరాధన కన్పిస్తుంది. అమరావతి, నాగార్జునకొండ మహాసాంఘిక శాఖ భిక్షువులకు కేంద్ర స్థానాలు. ఇక్కడ అపరమహావినయ శైలీయులు, బహుశృతీయులు, మహిశాసకులు మొదలైన బౌద్ధ సంఘాలు నివసించేవారు. బోధివృక్షం, బుద్ధుడి పాదాలు, ధర్మచక్రాలు,మహాస్థూపాలను ప్రజలు ఆరాధించేవారు.నాగార్జునుడు, ఆర్యదేవుడు మహాసాంఘిక శాఖకు ప్రధాన సిద్ధాంతకర్తలు.

శూన్యవాదాన్ని ఆచార్య నాగార్జునుడు,భావవివేకుడు,ఆర్యదేవుడు ప్రతిపాదించారు.ధర్మకీర్తి బౌద్ధయోగాచార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.దిన్నాగుడు సంస్కృత భాషలో ప్రమాణ సముచ్ఛయం గ్రంథాన్ని రచించారు.సాంఖ్యసారికా గ్రంథాన్ని ఈశ్వర కృష్ణుడు రచించారు. ఎహువల ఛాంతమూలుడి సేనాని ఎలిసిరి సర్వదేవ ఆలయం నిర్మించాడు. ఇతడి కాలంలోనే పుష్పభద్రస్వామి, హరీతి, కుమారస్వామి ఆలయాలు నాగార్జునకొండ లోయలో నిర్మించారు.

ఇక్ష్వాకులు పాలించిన ప్రాంతములుసవరించు

గుంటూరు, ప్రకాశం, నెల్ల్లూరు, కడప, కర్నూలు , నల్గొండ జిల్లాలు

సూచికలుసవరించు

యితర లింకులుసవరించు