దేవాలయం

(దేవాలయాలు నుండి దారిమార్పు చెందింది)

ఇదే పేరుతో విడుదలైన దేవాలయం సినిమా గురించి చూడండి.

కంబోడియాలోని 12వ శతాబ్దానికి చెందిన అంగ్ కోర్ వాట్ మందిరం ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయం.
ముచ్చివోలు గ్రామంలో నిర్మాణమౌతున్న ఈ ఆలయం నమూనాలో సాధారణ హిందూదేవాలయాల నిర్మాణశైలిని చూడవచ్చును

దేవళము లేదా దేవాలయము (Temple) మత సంబంధమైన ప్రార్థనల వంటి కార్యక్రమాలకు వినియోగించే కట్టడం. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. 'దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం గనుక 'దేవాలయం' అని పిలువబడుతుందని అర్థం చేసుకోవచ్చును. వివిధ మతాలలో దేవాలయాలకు చెందిన అనేక సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ఉన్నాయి.

శ్రీ వైఖానస శాస్త్రము ప్రకారం భక్తజనుల సౌకర్యార్థము భగవంతుడు అర్చారూపియై భూలోకమునకు వచ్చెను. ప్రతి దేవాలయములోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానములలో ఆవాహన చేయబడియుందురు.

చారిత్రికంగా కూడా దేవాలయం చాలా ప్రాధాన్యత కలిగివుంది. క్రీ.శ.1వ శతాబ్ది నాటి నుంచి నిర్మింపబడిన అనేక దేవాలయాలు దక్షిణ భారతదేశంలో కనిపిస్తూంటాయి. వీటి వలన హిందూయుగపు చరిత్రను అవగాహన కలిగి, వ్రాసేందుకు చరిత్రకారులకు ఉపయోగపడుతున్నాయి[1].

హిందూ దేవాలయాలుసవరించు

ఆలయములు అయిదు విధములుసవరించు

 • స్వయంవ్యక్త స్థలములు - భగవంతుడే స్వయముగా అవతరించిన స్థలములు.
 • దివ్య స్థలములు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.
 • సిద్ధ స్థలములు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించిన స్థలములు.
 • పౌరాణ స్థలములు - పురాణములలో చెప్పబడి ప్రసిద్ధిగాంచిన స్థలములు.
 • మానుష స్థలములు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడిన స్థలములు.

దేవాలయ నిర్మాణంసవరించు

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభం, గర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.

దేవాలయ నియమావళిసవరించు

 
హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

 1. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
 2. ఆలయమునకు ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
 3. ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
 4. ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
 5. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
 6. ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
 7. ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
 8. ఆలయములో ఎన్నడూ వివాదములు పెట్టుకోరాదు.
 9. ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
 10. ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
 11. ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
 12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
 13. ఒక చేతితో ప్రణామము చేయరాదు.
 14. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

దేవాలయాలలో రకాలుసవరించు

వివిధ మతాల దేవాలయాలుసవరించు

చర్చిలుసవరించు

క్రైస్తవులు దేవుడైన యెహోవాను ఏసుక్రీస్తు ద్వారా ప్రార్థించే మందిరాన్ని చర్చి అంటారు.

మసీదులుసవరించు

ముస్లింలు ప్రవక్త మహమ్మద్ చెప్పినపద్ధతిలో దేవుడైన అల్లాహ్ను ప్రార్థించే స్థలాలను మసీదులు అంటారు.

గురుద్వారాలుసవరించు

సిక్కు మతస్థులు ప్రార్థించే ప్రదేశాలను గురుద్వారాలు అంటారు.

బౌద్ధారామాలుసవరించు

బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనాస్థలాలు,ఆలయాలుసవరించు

రోడ్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో నిర్మించిన ప్రార్థనా స్థలాలను తొలగించాలి/ వేరేచోటుకు తరలించాలి/ క్రమబద్ధీకరించాలి.తమిళనాడులో అత్యధిక సంఖ్యలో 77,450 ప్రార్థనాస్థలాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్నాయి. ఆ తరువాతి స్థానాల్లో రాజస్థాన్‌ (58,253), గుజరాత్‌ (15వేలు) ఉన్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఒక్కటి కూడా లేదు.ఆ రాష్ట్రాన్ని అత్యంత నాగరిక రాష్ట్రంగా సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశంసించింది.

కొన్ని ప్రసిద్ధ ఆలయాలుసవరించు

ఆంధ్ర ప్రదేశ్‌లోసవరించు

తక్కిన భారత దేశంలోసవరించు

ఇతర దేశాలలోసవరించు

వాట్]] దేవాలయం.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలు, వనరులుసవరించు

 1. వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.

బయటి లింకులుసవరించు

renuka ellamma temple in ponnala

"https://te.wikipedia.org/w/index.php?title=దేవాలయం&oldid=2342283" నుండి వెలికితీశారు