ఇది నా లవ్‌స్టోరీ
ఇది నా లవ్‌స్టోరీ 2018 ఫిబ్రవరి 14 న విడుదలైన తెలుగు చిత్రం.
కథసవరించు
అభినయ (ఓవియా) ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి ప్రవేశించాడనే అభియోగంతో అభిరాం (తరుణ్) ని అరెస్ట్ చేస్తారు పోలీసులు. పోలీసులకు తన కథను చెప్పడం మొదలు పెట్టడంతో అసలు సినిమా మొదలువుతుంది. యాడ్ ఏజెన్సీలో క్రియేటివ్ హెడ్ అయిన అభిరాం.. తన చెల్లెలు కాబోయే భర్త అమర్, ఆమె చెల్లెలు డా.శృతిని చూడటానికి అరకు వెళతాడు. అక్కడ డా.శృతి (ఓవియా) ని కలుస్తాడు. ఒంటిరిగా ఉన్న ఇద్దరూ తమ ప్రేమకథలను ఒకరికొకరు చెప్పుకుంటారు. మహి (ఓవియా) తో తన ప్రేమ ఎలా మొదలైంది? ఎందుకు విడిపోయామని అభిరాం చెబితే... జోసెఫ్ ( తరుణ్) తో తనెందుకు విడిపోయాననే, తన ప్రేమకథను శృతి.. అభిరాంకు చెబుతుంది. అయితే అనుకోకుండా డా.శృతి స్థానంలో వేరే అమ్మాయి అభినయ ఉందనే నిజం అభిరాం తెలుసుకుంటాడు. అసలు అభినయ ఓ రోగి అని.. డా.శృతిని కలుసుకోవడానికి ఆమె ఇంటికి వచ్చి ఆమె స్థానంలో అభిరాంకు పరిచయమైందనే నిజం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకన్న అభిరాం ఏం చేస్తాడు? అసలు అభిరాంపై అభినయ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తుంది. ఇంతకు అభినయలోని మానసిక రోగం ఏమిటి? అనే విషయాలను మిగిలిన కథలో భాగం.
తారాగణంసవరించు
- తరుణ్
- ఓవియా
- ఖయ్యూం
- పుణ్యమూర్తుల చిట్టిబాబు
- జగదీష్
- అనిల్
సాంకేతికవర్గంసవరించు
- నిర్మాణ సంస్థ: రామ్ ఎంటర్‌టైనర్స్[1]
- సంగీతం: శ‌్రీనాథ్ విజయ్,
- ఎడిటర్: శంకర్
- సినిమాటోగ్రఫీ: క్రిస్టోపర్ జోసెఫ్
- నిర్మాత: ఎస్.వి.ప్రకాష్
- దర్శకత్వం: రమేష్ - గోపి
మూలాలుసవరించు
- ↑ "Idi Naa Love Story will be a hit - Hopes Tarun". Chitramala (in Indian English). 2017-07-03. Retrieved 2017-02-14.