ఖయ్యూం ఒక తెలుగు సినీ నటుడు. సుప్రసిద్ద తెలుగు నటుడు ఆలీ కి ఇతను స్వయానా తమ్ముడు. తెలుగు లో దాదాపు 90 సినిమా లలో నటించాడు. ఎక్కువగా సహాయక పాత్రలను చేస్తుంటాడు.

ఖయ్యూం
జననం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1991 - ఇప్పటి వరకు
జీవిత భాగస్వామిఆర్షియా కమాల్ (2015 - ఇప్పటి వరకు)
తల్లిదండ్రులుమహమ్మద్ బాషా
జైతూన్ బీబీ
బంధువులుఆలీ (నటుడు)

వివాహము మార్చు

ఇతని వివాహము 2015 ఫిబ్రవరి 22న ఆదివారం నాడు గుంటూరులోని సన్నిధి కల్యాణ మండపంలో జరిగింది. గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్ నయాబ్ కమాల్ పెద్దకుమార్తె ఆర్షియా కమాల్ తో ఖయ్యూంకు వివాహమైంది. ఈ వేడుకకు ప్రముఖ సినీనటులు, డైరెక్టర్లు, రాజకీయ నాయకులు, గుంటూరు నగరానికి చెందిన ప్రముఖులు హాజరై ఖయ్యుంకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు.

సినీనటులు మేకా శ్రీకాంత్, అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్, తరుణ్, రాజీవ్ కనకాల, వెంకట్, దర్శకులు కృష్ణవంశీ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నటుడు, ఎంపీ మురళీమోహన్, ఎంపీ రాయపాటి సాంబశివరావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుక కార్యక్రమంలో పాల్గొన్నారు.[1]

నటించిన చిత్రాలు మార్చు

తెలుగు మార్చు

బయటి లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. ""Comedian Gets Married"". telugucinema.com. telugucinema. 22 February 2015. Archived from the original on 24 ఫిబ్రవరి 2015. Retrieved 23 February 2015.
  2. "Kevvu Keka Movie Review, Rating". gulte.com. Retrieved 16 July 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=ఖయ్యూం&oldid=3831038" నుండి వెలికితీశారు