ఇది మా ప్రేమకథ
ఇది మా ప్రేమకథ 2017లో విడుదలైన తెలుగు సినిమా. మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై పి.ఎల్.కె.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు అయోధ్య కార్తీక్ దర్శకత్వం వహించాడు. రవి, మేఘన లోకేష్, ప్రియదర్శి, తులసి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు పూరి జగన్నాధ్ మార్చి 14న తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా విడుదల చేయగా,[1] సినిమాను డిసెంబర్ 15న విడుదల చేశారు.[2]ఈ చిత్రం మిశ్రమ సమీక్షలు అందుకుంది.
ఇది మా ప్రేమకథ | |
---|---|
![]() | |
దర్శకత్వం | అయోధ్య కార్తీక్ |
స్క్రీన్ ప్లే | అయోధ్య కార్తీక్ |
నిర్మాత | పి.ఎల్.కె.రెడ్డి |
తారాగణం | రవి మేఘన లోకేష్ ప్రియదర్శి తులసి |
ఛాయాగ్రహణం | మోహన్ రెడ్డి |
సంగీతం | సాయి కార్తీక్, ఎం.సి. విక్కీ |
నిర్మాణ సంస్థలు | మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2017 డిసెంబర్ 15 |
దేశం | ![]() |
భాష | తెలుగు |
కథ
మార్చుఈ చిత్రం ఖుషి అనే డాబా లో ప్రారంభమవుతుంది ఆ డాబా యజమాని(ప్రభాస్ శీను) తన డాబా కి వచ్చిన వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూనాన్నని తన పని వాడికి చెప్తాడు కాసేపటికి డాబా నిండుతుంది అందరూ సంతోషంగానే ఉన్న ఒక వ్యక్తి బాధగా ఉన్నాడని గుర్తించి విషయం తెలుసుకోవడానికి ఆ వ్యక్తి దగ్గరకి వెళ్లి తన బాధ గురించి తెలుసుకోవడానికి తనది ప్రేమ వైపల్యమా అని అడుగగా కాదని తనది విఫలమైన ప్రేమకథ అని చెప్తాడు మీ ప్రేమకథ చెప్పమని అడుగగా ఇది వాళ్ళ ప్రేమ కాదని తన ప్రేమకథని చెప్పి తన పేరు అరుణ్ (రవి) అని తన ప్రేయసి పేరు సంధ్య(మేఘన లోకేష్)అని చెప్పగానే కథ వెనక్కి తిరుగుతుంది కాలేజీ లో అరుణ్ కి చాలా మంది అమ్మాయిలు ఆకర్షితులు అవుతుంటారు కానీ అరుణ్ తను అంత తేలికగా ఎవ్వరిని ప్రేమించానని ప్రేమిస్తే మాములు గా ప్రేమించనని చెప్తాడు తరువాత తన స్నేహితుడి(గెటప్ శీను)తో మాట్లాడుతుండగా పక్కన బస్సులో నుంచి సంధ్య దిగుతుంది కానీ అరుణ్ చూడడు తరువాత తన తండ్రితో ఫోన్ మాట్లాడుతూ పరీక్ష హాల్ కి వెళ్తుండగా సంధ్య అల్ ది బెస్ట్ చెబుతుంది. నిజానికి ఆమె చెప్పింది వేరొకరికి అయినా తనకే ఆ అమ్మాయి విష్ చేసిందని అనుకోని సంధ్య తో ప్రేమలో పడతాడు అరుణ్ తరువాత తను పరీక్ష రాయడానికి వెళ్తాడు అక్కడికి చెడిపోయిన విద్యార్థి విక్కీ వస్తాడు ప్రశ్న పత్రం చూశాక అరుణ్ వైపు కోపంగా చూశాడు తరువాత తన ప్రశ్న పత్రం ఎందుకు మార్చారాని వాళ్ళ గురువుని ప్రశ్నించగా అరుణ్ వచ్చి తానే మార్పించానని చెప్తాడు తన గురించి తెలిసే అలా చేశావాని అడిగితే తను ఛైర్మన్ కొడుకైనా తనకి భయం లేదని చెప్పగా తన ఆఖరి సంవత్సరం పూర్తియ్య లోపు తనని కాలేజీ నుంచి పంపిస్తానని సవాల్ చేస్తాడు తను కాలేజీ నుంచి వెళ్లే సమస్య లేదని తనొక అమ్మాయిని చూసానని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సంధ్య తన స్నేహితురాలితో ఒక చోట కూర్చుంటుంది పక్కనే అరుణ్ తన స్నేహితుడితో సంధ్య అల్ ది బెస్ట్ చెప్పడం గురించి మాట్లాడడం విని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అరుణ్ తన కోసం వెతుకుతు బస్సు ఎక్కుతుండగా చూసి మాట్లాడానికి ప్రయత్నం చేసి తను మూడో సంవత్సరం అని వేరే కాలేజీ నుంచి బదిలీ మీద వచ్చిందని తెలుసుకుంటాడు ఈలోగ సంధ్య తన స్నేహితురాలితో కలిసి బస్సులో వెళ్ళిపోతుంది అరుణ్ బస్సుని వెంబడించి తన వెనక తిరుగుతాడు సంధ్య కి తెలిసిన మౌనంగా ఉంటుంది తర్వాత రోజు కాలేజీ లో అరుణ్ మొక్కలు నాటే కార్యక్రమం పెడతాడు సంధ్య వచ్చే వరకు ఆగి తను వచ్చాక మొక్కల ప్రాధాన్యత గురించి ఉపన్యాసం ఇచ్చి మొక్కలు నాటీ సంధ్య ని ఆకర్షస్తాడు తరువాత సంధ్య క్లాస్ లో లెక్చరర్ రికార్డు గురించి చెప్తుండగా అరుణ్ అమ్మాయిలని ఆకర్షించాలంటే ఇలాంటి మంచి పనులు చేయాలని తన స్నేహితులకి వివరిస్తుండగా సంధ్య ఎవరి రికార్డు తీసుకోవాలని స్నేహితురాలితో అనుకుంటూ బయటకి వస్తుంటే విక్కీ సంధ్య దగ్గరకి వెళ్లడానికి ప్రయత్నిస్తాడు కానీ అరుణ్ మధ్యలో వచ్చేస్తాడు సంధ్య తన రికార్డు అడిగితే తనకి మాత్రమే ఇస్తానని చెప్తూ ఇస్తాడు రాత్రి సంధ్యకి ఫేసుబుక్ రిక్వెస్ట్ పెడతాడు తన ఫోటోని ముద్దు పెట్టుకుంటాడు సంధ్య రిక్వెస్ట్ కన్ఫర్మ్ చేస్తుంది తరువాత రోజు అరుణ్ సంధ్య క్లాస్ లోకి వెళ్లి సంధ్యకి దగ్గర అవ్వాలని తన రికార్డుకి బదులు సంధ్య రికార్డు తీసుకుంటాడు వచ్చే ముందు సంధ్య స్థానంలో కూర్చుని వస్తాడు బయటకి వచ్చాక తన స్నేహితులని గందరగోళంలో పెడతాడు ఆ రోజు రాత్రి సంధ్య రికార్డు చూస్తూ ఆనందిస్తాడు మరుసటి రోజు సంధ్య తన స్నేహితురాలితో రికార్డు గురించి అడగడానికి వచ్చినపుడు అరుణ్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేలా మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తరువాత రోజు అరుణ్ ని కనిపెట్టి తన దగ్గరకి వెళ్తుతుంటే అరుణ్ తప్పించుకోవడానికి కెమిస్ట్రీ ల్యాబ్ లోకి వెళ్తాడు సంధ్య తన స్నేహితురాలు అక్కడికి వచ్చి రికార్డు గురించి ప్రశ్నించగా ఇంటి దగ్గర మర్చిపోయానని తరువాత రోజు గుర్తుండడం కోసం ఫోన్ చేయమని నెంబర్ ఇస్తాడు ఆ రాత్రి రికార్డు ఇచ్చేలోపు తన ప్రేమ గురించి తెలిసేలా చేయాలని ఉత్తరాలు రాయడానికి ప్రయత్నిస్తాడు తరువాత రోజు సంధ్య అరుణ్ కి ఫోన్ చేసి రికార్డు మర్చిపోవద్దని చెప్పి తన అమ్మానాన్న లకి కాలేజీ కి వెళ్తున్నానని చెప్పి కాలేజీ లో అరుణ్ ని కలిసి రికార్డు అడిగితే తను లేఖ ఇస్తాడు అది ప్రేమ లేకే కానీ తను రాయలేదని ఎవరో ఇచ్చారని చెపితే సంధ్య చూసి పాట లాగా ఉందని చెపితే అరుణ్ చూసి పాటే అని పడతానంటే సంధ్య పాడమంటుంది వెళ్లే ముందూ రికార్డు అడిగితే తన స్నేహితుడి ఇంట్లో ఉందని ఇల్లు దూరం అని చెప్పిన సంధ్య గ్రంధాలయంలో ఎదురు చూస్తానని వెళ్లి తీసుకొచ్చి ఇవ్వమని చెప్తుంది అరుణ్ తప్పక అంగీకరిస్తాడు చాలా సేపట తరువాత అరుణ్ అలోచించి తిరిగి వచ్చి రికార్డు ఇచ్చేస్తాడు సంధ్యని దిగబెటడానికి అడిగేలోపు ఆటో వస్తుంది అరుణ్ ఆపడానికి అవకాశం లేకుండా ఆటో డ్రైవర్ సంధ్య ని ఆటో లో తీసుకుని వెళ్తాడు సంధ్య ని సమయం అడిగితే 9 అని చెప్పగానే ఆటో ఆపి మందు తాగుతాడు అది చూసి సంధ్య భయపడుతుంది అయితే అరుణ్ ఆటో వెనక రావడం గమనించి ఆటో ఆపి ఎందుకు వెనక వస్తున్నావని ప్రశ్నించగా ఆలస్యనికి తానే కారణం కాబట్టి తనని ఇబ్బంది లేకుండా ఇంటికి చేరేలా చేయాలనుకుంటున్నాడని కుదిరితే తను దిగబెడతానని లేదా ఆటోలో వెళ్లాలనుకుంటా తను వెనక వస్తానని చెప్పగా సంధ్య ఆటోని పంపించేసి అరుణ్ తో పాటు వెళ్తుంది తన ఇంటి దగ్గర వెళ్ళాక సంధ్య కరచలనం చేసి వెళ్తుంది అరుణ్ ఆ చేతిని చూసి ఆనందిస్తుండగా కథ మాములోకి వస్తుంది డాబా యజమాని సంధ్య ఫోటో చూపించమని ఊహించుకోవడానికి తేలికగా ఉంటుందని అడగగా అరుణ్ చూపిస్తాడు తరువాత చెప్పమంటే మొదటిసారి ఆదివారం కూడా కాలేజీ ఉంటే బావుంటుందానిపించిందని చెప్తుండగా కథ మళ్ళీ వెనక్కి వెళ్తుంది అరుణ్ సంధ్య కి మెసేజ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటాడు సంధ్య అది చూసి మెసేజ్ పెట్టడానికే ఇంత ఇబ్బంది పడితే ఇంకా ఎలా ప్రేమిస్తాడని అనుకుంటుండగా అరుణ్ నుంచి మెసేజ్ వస్తుంది ఇద్దరు మాట్లాడుకుంటూ సంధ్య పాట రాసిన వాడి నెంబర్ అడిగితే అరుణ్ ఇవ్వనని చెప్తాడు తను షాపు కి వెళ్తున్నానని అని చెప్పి తనతో పాటు వస్తావని అడిగితే అరుణ్ అంగీకరిస్తాడు ఇద్దరు కలిసి షాపు కి వెళ్ళటప్పుడు కొంతమంది వాళ్లని గమనిస్తారు షాపు దగ్గర సంధ్య అరుణ్ ఒకరికి తెలియకుండా ఒకరు చూసుకుంటారు తిరిగి వెళ్ళటప్పుడు గమనించే వాళ్ళని చూసి అరుణ్ సంధ్య ని ప్రశ్నిస్తే తనని ఇంతక ముందు వేధించడానికి ప్రయత్నించిన వాళ్లని తప్పించుకోవడానికి తనకి అన్నయ్య ఉన్నాడని అబద్ధం చెప్పానని నమ్మకం కోసం తనని తీసుకొచ్చాను అని చెప్పగానే అరుణ్ ఆగిపోతాడు అయితే కేవలం వాళ్ళకి మాత్రం అలా చెప్పానని తను అలా అనుకోవడం లేదని చెప్తుంది తను ఏమనుకుంటుందని అడిగితే రేపు కాలేజీలో చెప్తానని చెప్తుంది మరుసటి రోజు సంధ్య క్యాంటీన్ కి వెళుతుండగా విక్కీ స్నేహితుడు అరుణ్ గర్ల్ ఫ్రెండ్ అని సంధ్య ని చూపించగా వాళ్ళందరూ కలిసి తనని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు అక్కడ ఒకళ్ళు వీడియో తిస్తుండగా అరుణ్ వచ్చి వాళ్ళని కొట్టి ఇలా అమ్మాయి ని ఇబ్బంది పెడుతుంటే వీడియో తీయడం కాదు ఏం చేయాలో చూడమని చెప్పి వాళ్ళని కొడతాడు ఈ కారణం తో తనని సస్పెండ్ చేస్తానని విక్కీ అంటే తను తీయించిన వీడియో ప్రిన్సిపల్ ముందు పెడితే సస్పెండ్ వాళ్ళు అవుతారని చెప్తాడు అందరూ ఆ విషయాన్ని వదిలేయాలని వెళ్ళిపోతారు తరువాత సంధ్య వాళ్లు నాటిన మొక్కలకి నీళ్లు పోస్తూ అరుణ్ గురించి ఆలోచిస్తుంది అరుణ్ మొక్కలకి వచ్చిన పూలను చూస్తూ తన ప్రేమ చెప్పే సమయం వచ్చిందని తనకంటే అందంగా ఉన్న సంధ్య ని పరిచయం చేస్తానని చెప్తాడు ఆ రాత్రి సంధ్య ఆలోచిస్తూ తరువాత రోజు ఫేర్వెల్ పార్టీ అని ఇంకెప్పుడు చెప్తాడని అని అనుకుంటుంది మరుసటి రోజు సంధ్య ని చూసి అరుణ్ మై మర్చిపోతాడు ఇంతకుముందు అరుణ్ కి ప్రేమ చెప్పిన అమ్మాయి సంధ్య మీద తన ప్రేమ గురించి ప్రశ్నిస్తే సహాయం చేయమని కోరుతాడు తను ముందు కోప్పడిన తరువాత సహాయం చేయడానికి అంగీకరిస్తుంది సంధ్య ని పై అంతస్తుకి వచ్చేలా చేయమని చెప్పి వెళ్తాడు తరువాత సంధ్య అరుణ్ ని కలుస్తుంది ఇద్దరు వాళ్ళ ప్రేమని అంగీకరించి కలిసిపోతారు క్లాస్ లో వాళ్ళ చూపుల గురించి ప్రేశ్నిస్తే వాళ్ళ ప్రేమ బలం గురించి వివరిస్తారు తరువాత విక్కీ కాలేజీ కి వస్తాడు అరుణ్ కొట్టడం గురించి అందరూ మాట్లాడుకోవడం విని కోపంతో సంధ్య మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయగా తన స్నేహితురాలు తన తండ్రి కి ఫోన్ చేస్తుంది ఈ లోపు సంధ్య ని తరమడం అరుణ్ చూసి తనని కాపాడి విక్కీని పోలీసులకి పట్టించి సంధ్య తండ్రి కంట పడతారు కథ మళ్ళీ ప్రారంభం కి వస్తుంది తరువాత ఏమైందని అడిగితే అరుణ్ తన ఫోన్ లో ఉన్న మెసేజ్ చూబిస్తాడు అందులో అరుణ్ తనని మోసం చేసాడని మళ్లీ కలవద్దని ఉంటుంది మోసం ఏంటని ఇప్పుడు సంధ్య ఎక్కడ ఉందని డాబా ఓనర్ అనగా సంధ్య కొంతమంది తరుముతూ ఉంటారు. తరువాత కథ కొన్ని గంటల ముందుకు మారుతుంది సంధ్య తన కుటుంబంతో పెళ్లి చూపులో ఉంటుంది తనని చేసుకునే వ్యక్తి పైన ఉన్నాడని చెప్తారు సంధ్య వెళ్తుంటే ముందు తన తండ్రి(వైజాగ్ ప్రసాద్) తన ప్రేమ గురించి చెప్పదని చెప్తాడు తరువాత తన తల్లి (తులసి)వచ్చి నిజం చెప్పేయమంటుంది సంధ్య అంగీకరించి పైకి వెళ్లి పెళ్లి కొడుకు(ప్రియదర్శి)ని కలుస్తుంది కాసేపు తను మాటలాడక సంధ్యని ప్రేమ కథ ఉందాని అడిగితే ఉందని కానీ అది వాళ్ళ ప్రేమ కథ కాదని తన ప్రేమ కథ అని చెప్పగానే కథ మళ్ళీ వెనక్కి మారుతుంది కాలేజీ లో సంఘటన తరువాత సంధ్య తన తండ్రితో తను అరుణ్ ని ప్రేమించడం గురించి చెప్తుంది కానీ తన తండ్రి వేరే వ్యక్తితో పెళ్లి చేయాలనుకుంటునాన్నని చెప్తాడు కానీ సంధ్య తల్లి సంధ్య చెప్పేది వినమని ఓపిస్తుంది సంధ్య తన సంతోషంలో వాళ్లు అరుణ్ ఇద్దరు ముఖ్యమే అని వివరిస్తుంది అంత విన్న తరువాత తన తండ్రి అంగీకరిస్తాడు కానీ మనసులో పెళ్లి జరిగినపుడు కాదా అని అనుకుంటాడు ఇంకో పక్క సంధ్య ఫోన్ కోసం అరుణ్ ఎదురుచూస్తుండగా సంధ్య ఫోన్ చేసి ముందు భయపెట్టేలా మాటలాడి తరువాత పెళ్లికి అంగీకరించిన విషయం చెప్పగానే అరుణ్ సంతోషం పడడతాడు తన తండ్రి కూడా ఆట పట్టించి అంగీకరిస్తాడు అరుణ్ తన తండ్రితో సంధ్య వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తారు సంధ్య అరుణ్ కి తన గది చూభిస్తానని పైకి తీసుకుని వెళ్తుంది అక్కడ అరుణ్ సంధ్య అందం గురించి వివరిస్తాడు కిందకి రాగానే అరుణ్ తండ్రి సంధ్య తల్లితండ్రులు పెళ్లి గురించి అడిగితే సెటిల్ అయ్యాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని అరుణ్ చెప్తాడు మరుసటి రోజు అరుణ్ ఉద్యోగం చేస్తున్నట్లు కలలో ఉంటే తండ్రి వచ్చి నిద్రలేపి నిజంగా ఉద్యోగం వెతుక్కోమని చెప్తే అరుణ్ అలోచించి తన స్నేహితుడు రాజేష్ ఉన్నాడని గుర్తుచేసుకుని తను పని చేస్తున్న కార్ షోరూమ్ కి వెళ్ళి తనని కలిసి ఉద్యోగం కోసం అడిగితే రాజేష్ తన బాస్ ని ఒప్పించి ఉద్యోగం వచ్చేలా చేస్తాడు జాగ్రత్త చేసుకోమని రాజేష్ అరుణ్ ని హెచ్చరిస్తాడు తరువాత అరుణ్ బండి మీద వెళ్తూ సంధ్య కి ఫోన్ చేసి విషయం చెప్తాడు సంధ్య తన తల్లి తో ఆనందం పంచుకుని డాన్స్ చేస్తుంది ఈ లోపు అరుణ్ అనుకోకుండా ఒక అమ్మాయి ని గుద్దుతాడు పైకి లేపి పక్కకి వెళ్ళాక హాస్పిటల్ కి వెళ్దమంటే తనకి ఇంటర్వ్యూ ఉందని చెప్తే వైద్యం చేసుకున్నాక వెళ్ళచ్చని చెప్పి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి వైద్యం చేయిస్తాడు ఈ లోగ ఆ అమ్మాయి కి ఫోన్ వస్తుంది ఇంటర్వ్యూ అయ్యిపోయిందని తెలిసి తన లైఫ్ అంతే అని తను అనాధ అని ఎప్పుడు ఇబ్బందులే అని బాధ పడుతుంటే అరుణ్ రాజేష్ ని గుర్తు చేసుకుని తన వల్ల పోయిన ఉద్యోగానికి తనే సహాయం చేస్తానని మాట ఇస్తాడు తన పేరు అరుణ్ అని చెప్పగానే అమ్మాయి తన పేరు నేహా అని చెప్పి అరుణ్ తో ఆకర్షణ పొందుతుంది తరువాత రోజు ఉద్యోగం కోసం షోరూమ్ కి వెళ్తే రాజేష్ కస్టమర్ అనుకుని మర్యాదలు చేసి అని వివరిస్తాడు తరువాత అరుణ్ వచ్చి తను వచ్చింది తన కోసమే అని తెలిసి ఆనంద పడుతుంటుంటే ఉద్యోగం కోసం వచ్చిందని తెలుసుకుని కోప్పడతాడు తరువాత తన బాస్ తో మాట్లాడిస్తే తన స్నేహితులకి ఉద్యోగాలు ఇవ్వడానికే కంపెనీ పెట్టినట్లు ఉందని చెప్పి కాలిగా ఉన్న రిసెప్షనిస్ట్ ఉద్యోగం ఇస్తాడు నేహాకి అరుణ్ మీద ఇష్టం మొదలవుతుంది రాత్రి అయ్యాక అరుణ్ తనని హాస్టల్ దగ్గర దింపి సంధ్య కి ఫోన్ చేస్తాడూ కానీ సంధ్య ఎత్తకుండా ఆటపటిస్తుంది అరుణ్ ఇంటికి వచ్చాక ఫోన్ చేస్తే ఎత్తుతుంది ఫోన్ ఎందుకు ఎత్తలేదని అరుణ్ అడిగితే తన మీద ఉన్న ప్రేమని పరీక్షించడానికని చెప్పి అరుణ్ భోజనం చేయలేదని తెలిసి తన మాటలతో తినిపించిన అనుభూతి కలిగిస్తుంది తరువాత రోజు అరుణ్ సంధ్య తో కలిసి షాపింగ్ మాల్ కి వెళ్తాడు అక్కడ నేహా కనిపిస్తుంది అరుణ్ సంధ్య ని పరిచయం చేస్తాడు తరువాత నేహా వాళ్ళతో కలిసి షాపింగ్ చేస్తుంది సంధ్య అరుణ్ కోసం బట్టలు చూస్తుంటే నేహా తను చూసిన బట్టలు తీసుకునేలా చేస్తుంది ఈ లోపు సంధ్య పక్కకి వెళ్తే అక్కడ ఒక తల్లి కూతురు బట్టల ఎంపిక గురించి వాదించుకుంటుంటే సమస్య ఏంటని సంధ్య అడిగితే ఖరీదైన బట్టలు అడుగుతుందని తల్లి చెప్తే బిల్ తను కడతానని పాపకి నచ్చింది తీసుకోమని చెప్పి వెళ్తుంది బయటకి వచ్చేటపుడు నేహా ఐస్ క్రీం పార్లర్ కి వెళ్దామంటే ముగ్గురు వెళ్తారు అక్కడ నేహా అరుణ్ చెప్పిన ఐస్ క్రీం చెప్తుంది వచ్చాక అరుణ్ కప్ ని తన కప్ ని మార్చి ఆట పటిస్తుంది అది చూసి సంధ్యకి కోపం వస్తుంది అరుణ్ ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్ళగానే సంధ్య హద్దులో ఉండమని అరుణ్ తనకి కాబోయే భర్త అని నేహా ని హెచ్చరిస్తుంది అరుణ్ తిరిగి వచ్చాక నేహా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సంధ్య అరుణ్ ని తన మీద ఉన్న ప్రేమ గురించి అడిగి తన కోసం ఎమైనా చేస్తావని అడిగితే అరుణ్ అడగమంటాడు సంధ్య అడిగేలోపు అరుణ్ కి తన స్నేహితుడు రాజా నుంచి ఫోన్ వస్తుంది తను కాఫీ షాపు లో ఉన్నానని చెప్తాడు తను వస్తానని రాజా అంటే సరే అంటాడు సంధ్య నిరుత్సాహానికి గురవుతుంది తన స్నేహితుడిని పిలవలేదని తను రాడని సంధ్యకి చెప్తూ బయటకి వస్తుంటే రాజా అక్కడికి వస్తాడు అరుణ్ షాక్ అయి పరోక్షంగా రాజా ని తిట్టి వెళ్లిపోయేలా చేస్తాడు సంధ్య సంతోష పడుతుంది ఇంటి దగ్గరకి వెళ్ళాక సంధ్య నేహా మాటలు గుర్తు చేసుకుని నిరూత్సహం లో ఉంటే అరుణ్ ప్రశ్నిస్తాడు సంధ్య ఏమి లేదంటే తన ఇంటికి వెళ్దామంటే సంధ్య అలా చేస్తే వాళ్ళ నాన్న వేరే వాళ్ళతో పెళ్లి చేస్తాడని చెప్పగానే అరుణ్ దగ్గరకి తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఆగిపోతాడు కాని సంధ్య అవకాశం ఇచ్చి తను నవ్వితే బావుంటాడని నవ్వుతూ ఉండమని చెప్పి ముద్దు పెట్టి వెళ్ళిపోతుంది సంధ్య ని భోజనం చేయడానికి రమ్మంటే ఆకలిగా లేదని వెళ్ళిపోతుంది తరువాత అరుణ్ సంధ్య కి ఫోన్ చేసి రాత్రంతా తనకి నిద్ర పట్టలేదని చెప్తే సంధ్య తనకి పడకూడదని అనుకుంటుంది సంధ్య చూపు తనని ఇబ్బంది పెడుతుందని మాట్లాడుతుండగా నేహా అరుణ్ ఫోన్ తీసుకుని ఆటపటిస్తుంది అది సంధ్య విని నేహా అరుణ్ తో ఉన్నవి గుర్తు చేసుకుని బాధ పడుతుంది తరువాత లాప్టాప్ లో అరుణ్ ఫోటో చూస్తూ ఎందుకిలా చేస్తున్నావని అనుకుంటూ అరుణ్ ఫోన్ కట్ చేస్తుంది అరుణ్ మెసేజ్ లో సమస్య అడిగితే తనే దూరం పెడుతున్నాడని అనుకుంటుంది అరుణ్ నుంచి సమాధానం రాకపోవడంతో ఫోన్ చేస్తుంది కాని ఫోన్ బిజీ వస్తుంది కాసేపటికి అరుణ్ నుంచి ఫోన్ వస్తుంది తను నేహాతో మాటలాడుతున్నానని పేస్ బుక్ రిక్వెస్ట్ ఆక్సిప్ట్ చేయమందని చెప్తాడు సంధ్య బాధపడి తనకి నిద్రొస్తుందని చెప్తే అరుణ్ తనకి ఆకలిగా ఉందని తినిపిస్తావని అడిగితే సంధ్య నిద్ర వస్తుందని ఫోన్ పెట్టేసి అరుణ్ నేహా రిక్వెస్ట్ ఆక్సిప్ట్ చేయడం చూసి బాధపడుతుంది మరుసటి రోజు నేహా గుడికి వెళ్లి పూజ చెయించుకుని అరుణ్ కి ఫోన్ చేసి ఈ రోజు తన పుట్టినరోజని చెప్తే అరుణ్ విషెస్ చెప్తాడు తను పుట్టినరోజు చేసుకోవడానికి తనకి ఎవరు లేరని చెప్తే అరుణ్ తనని కలిసి రోజంతా తనతో గడుపుతాడు మరో వైపు సంధ్య తన స్నేహితురాలి పెళ్లికి వెళ్ళడానికి రెడీ అవ్వుతుంది సంధ్య తండ్రి తనకి పని ఉందని తనని ఆటోలో వెళ్ళమని చెప్పి వెళ్ళిపోతారు సంధ్య తల్లి తను అందంగా ఉందని చెప్తుంది సంధ్య తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లి తనకి అరుణ్ కి పెళ్లి జరుగుతున్నట్లు ఊహించుకుంటుంది ఇంటికి తిరిగి వచ్చాక అరుణ్ కి ఫోన్ చేసి ఎన్ని సార్లు చేసిన తీయడం లేదని అనుకుంటుండగా అరుణ్ నేహాని హాస్టల్ దగ్గర దింపాక నేహా బాధ పడుతున్న సంధ్యకి ఫోన్ చేసి అరుణ్ రోజంతా తనతో ఉన్నాడని చెప్పగానే సంధ్య కోప్పడి నమ్మనని చెప్తే తను అరుణ్ కి ఫోన్ చేసి ఆ మాటలు సంధ్య కి వినిపిస్తే సంధ్య బాధపడి అరుణ్ కి తన మొహం చూభించదని తను మోసం చేశాడని మెసేజ్ పెట్టి బాధపడుతుంది అరుణ్ వర్షంలో కూర్చుని బాధపడతాడు తరువాత సంధ్య తన తండ్రితో అరుణ్ ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తే తన తల్లి అప్పుడే పెళ్లి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటే తన తండ్రి సంధ్యని వెళ్ళమని చెప్తాడు అరుణ్ సంధ్య అలా మాట్లాడడానికి కారణం తెలుసుకోవడానికి తన ఇంటికి వెళ్లి సంధ్య ని పిలుస్తుంటే తన తండ్రి సంధ్య ని కొడతావని అడిగితే ఎం మాట్లాడుతున్నారని అంటాడు సంధ్య ని కలవడం కుదరదని చెప్తే అరుణ్ ఎందుకని అడుగుతుండగా సంధ్య వెళ్లిపోమని చెప్తే అరుణ్ బాధ పడుతూ వెళ్ళిపోతాడు అరుణ్ ఇంటికి వెళ్లి తన తండ్రి దగ్గర బాధపడతాడు సంధ్య గదిలో ఒంటరిగా బాధ పడుతుంటే తన తల్లి సర్ది చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే తన తండ్రి వచ్చి తనకి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానంటే తన తల్లి సంధ్య మనసులో ఇంకా అరుణ్ ఉన్నాడని చెప్తే తన మనసులో అరుణ్ లేదని సంధ్య చెప్పగానే బాగా ఆలోచించుకోమని తన తల్లి చెప్పి వెళ్ళిపోగానే కథ మళ్ళీ పెళ్లి చూపుల దగ్గరకి వస్తుంది ఒక బంధం నిలబడాలంటే నమ్మకం ముఖ్యమని పెళ్లి కొడుకు అంటే ఆ నమ్మకం అరుణ్ నేహాకి బాగా కుదిరిందని సంధ్య చెప్తుంది మరోవైపు డాబా ఓనర్ అరుణ్ తో ఎలా బాధని తట్టుకుంటున్నావని అడిగితే అరుణ్ వివరిస్తూ పాట పాడుతూ సంధ్యతో తన జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు ఇంకోపక్క సంధ్యని పెళ్లికొడుకు అరుణ్ తన మనసులో లేడు కదా అని అడిగి చేయి వేయాలనుకుంటాడు కాని సంధ్య అరుణ్ తన జీవితం లో లేకపోయిన తన మనసులో ఎప్పటికి ఉంటాడని చెప్పగానే చేయి దించేస్తాడు తరువాత పెళ్లికొడుకు వాళ్ళ చెల్లి వచ్చి వదిన ఎక్కడ అని అడిగి పైన ఉన్నారని చెప్తే వెళ్లి వెనక నుంచి సంధ్య కళ్ళుమూసి కనిపెట్టామని అడిగితే ఎవ్వరని అడుగుతూ వెనకకి తిరగననే నేహాని చూసి ఆశ్చర్యపోతుంది పెళ్లికొడుకు తన చెల్లి ప్రియా అని పరిచయం చేస్తాడు సంధ్య కోపంగా చూడడం చూసి ఇద్దరికీ పరిచయం ఉందా అని ప్రశ్నించగా తన కథలో నేహా తన చెల్లి ప్రియా అని చెప్తే పెళ్లి కొడుకు తనని కోపంగా ప్రశ్నిస్తే తను అంగీకరిస్తుంది ఎందుకు చేశావని ప్రశ్నిస్తే విక్కీ కోసం చెప్పగానే తను విక్కీ ప్రియురాలని కాలేజీ లో అవమానం తరువాత విక్కీ బాధని చూసి అరుణ్ సంధ్యని విడగొట్టాలని చేశానని చెప్పగానే పెళ్లి కొడుకు చెంప పగలగొడతాడు సంధ్య అరుణ్ తప్పు లేదని తెలుసుకుని తన వాళ్ళకి చెప్పి అరుణ్ కోసం బయలుదేరుతుంది దారిలో ఇంతక ముందు తనని వేధించడానికి ప్రయత్నించిన కొంతమంది తన వెంటపడతారు సంధ్య వాళ్ళ నుంచి తప్పించుకుంటుంది డాబాలో అరుణ్ దగ్గరకి రాజేష్ వచ్చి తాగడం గురించి ప్రేశ్నిస్తే సంధ్య తన జీవితంలోకి వస్తుందో లేదో అనే బాధతో ఇలా చేస్తున్నానని సంధ్య లేకుండా బ్రతికేస్తానని భయంగా ఉందంటే రాజేష్ చిరాకు పడతాడు తను ఎమి చేసుకోనని అరుణ్ మాట ఇస్తాడు ఈలోగ సంధ్య తనని తరుమూతున్న వాళ్ళ నుంచి తప్పించుకుని ఇంతక ముందు ఎక్కిన ఆటోలో ఎక్కి తప్పించుకుంటుంది ఆటో డ్రైవర్ సంధ్యని గుర్తుపడతాడు తనని అరుణ్ దగ్గరకి తీసుకుని వెళ్ళమంటే తను సరే అంటాడు సంధ్య సమయం తొమ్మిది అవుతుందని కంగారు పడుతుంది అనుకున్నట్లు గానే ఆటో డ్రైవర్ మందు కోసం ఆటోని అరుణ్ ఉన్న డాబా దగ్గరే ఆపి సంధ్య పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు పక్క నుంచి అప్పుడే వాళ్ళ స్థానంలోకి వచ్చి కూర్చున్న అరుణ్ సంధ్యని అది భ్రమ అనుకుని రాజేష్ తో ప్రేమ మత్తు చాలా గట్టిదని వెనక సంధ్య ఉందని చెప్తాడు రాజేష్ చూసే సమయానికి సంధ్య పక్కకి వెళ్లిపోవడంతో అరుణ్ నిజంగానే భ్రమ పడ్డాడనుకుంటాడు ఈ లోపు సంధ్యని డాబా ఓనర్ చూసి తనే అరుణ్ ప్రేమించిన సంధ్య అని నిర్దారించుకుని అరుణ్ కి తన మీద ఉన్న ప్రేమని వివరిస్తాడు సంధ్య సంతోషపడి అరుణ్ కోసం వెతుకుతు పక్కకి వెళ్ళగానే తనని తరిమిన వాళ్లు తనని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు సంధ్య తప్పించుకుని వెళ్తూ అరుణ్ ని డికొడుతోంది ఇద్దరు సంతోషంగా కౌగిలించుకోగ అరుణ్ వచ్చిన వాళ్ళని కొట్టి వాళ్ళకి మందు విందు ఇస్తాడు కొట్టి ఈ విందు ఏంటని వాళ్లు ప్రేశ్నిస్తే వాళ్ళని కొట్టింది సంధ్య వెంట పడినందుకని విందు ఇచ్చింది వాళ్ళ వల్ల సంధ్య దొరికినందుకని చెప్తాడు తను అందుబాటులో లేకపోయినా తన కోసం ఎదురు చూసినందుకు ఇది తన ప్రేమకథని సంధ్య అంటే తను ఎదురుచూసిన తను రావడం వల్లే అవి ఉపయోగపడ్డాయి కాబట్టి తన ప్రేమకథని అరుణ్ అంటే ఇంకా ని ప్రేమకథ అని కాదు మా ప్రేమకథని చెప్పమని ఆటో డ్రైవర్ అంటే ఇద్దరు సంతోషంగా ఇది మా ప్రేమకథ అని చెప్పి సంతోషంగా డాబా వదిలి వెళ్తారు వాళ్ళ డాబాకి వచ్చిన అందరూ సంతోషంగా ఉంటారని డాబా ఓనర్ అంటుండగా ఇంకొకడు బాధగా ఉన్నాడని వాడి దగ్గరకి తను ఎవరో కాదు విక్కీ తనది కూడా విఫలమైన ప్రేమకథని చెప్తుండగా ఒక సందేశంతో చిత్రం ముగుస్తుంది.
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: మత్స్య క్రియేషన్స్, పి.ఎల్.కె ప్రొడక్షన్స్
- నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అయోధ్య కార్తీక్
- సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి
- పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి
- పాటలు: దినేష్ (నాని)
మూలాలు
మార్చు- ↑ Asianet News (2017). ""ఇది మా ప్రేమకథ" ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన పూరి". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ The Times of India (15 December 2017). "Idi Ma Prema Katha Movie". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
- ↑ The Times of India (25 February 2017). "Anchor Ravi turns a hero" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.