ఇద్దరు అమ్మాయిలు
1970 సినిమా
ఇద్దరు అమ్మాయిలు 1970లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి కప్పు బిలుపు (1969) అనే కన్నడ సినిమా మాతృక. ఇందులో వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేసి అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబుల సరసన నటించింది.
ఇద్దరు అమ్మాయిలు (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎస్.ఆర్. పుట్టణ్ణ కణగాల్ |
---|---|
కథ | ఆర్యంబ పట్టాభి |
చిత్రానువాదం | ఎస్.ఆర్. పుట్టణ్ణ కణగాల్ |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, శోభన్ బాబు, ఎస్.వి. రంగారావు, చిత్తూరు నాగయ్య |
సంగీతం | కె.వి. మహదేవన్ |
నేపథ్య గానం | ఘంటసాల, పి. సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు |
సంభాషణలు | డి.వి.నరసరాజు |
ఛాయాగ్రహణం | ఎస్.మారుతీరావు |
కూర్పు | ఉమాకాంత్ |
నిర్మాణ సంస్థ | ప్రొడ్యూసర్ కంబైన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వాణిశ్రీ - చంద్ర (గుమ్మడి కూతురు), భాను (ఎస్.వి.ఆర్. కూతురు) గా ద్విపాత్రాభినయం
- అక్కినేని నాగేశ్వరరావు - మధుసూదన్
- శోభన్ బాబు - శ్రీరామ్
- ఎస్.వి.రంగారావు - ఇంజినీర్ నారాయణరావు, రామానుజం అన్నయ్య
- గుమ్మడి వెంకటేశ్వరరావు - రామానుజం
- సూర్యకాంతం - సుందరమ్మ, రామానుజం భార్య
- చిత్తూరు నాగయ్య - లక్ష్మణరావు, నాగేశ్వరరావు తండ్రి
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- రమాప్రభ - రామానుజం చిన్న కూతురు
- రుక్మిణి
పాటలు
మార్చు- ఈ చల్లని లోగిలిలో ఈ బంగరు కోవెలలో - రచన: దాశరథి కృష్ణమాచార్య; గానం: పి. సుశీల
- ఓహో మిస్టర్ బ్రహ్మచారి హెహే ఒకటోరకం బ్రహ్మచారి - రచన: ఆరుద్ర; గానం: పి.సుశీల
- ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు - రచన: కొసరాజు; గానం: పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల
- చక్కని చినవాడే చుక్కల్లో చంద్రుడే - పి. సుశీల బృందం
- నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో- రచన: దాశరథి కృష్ణమాచార్య; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వసంత
- పువ్వులో గువ్వలో వాగులో తీవెలో అంతట నీవేనమ్మా అన్నిట నీవేనమ్మా - రచన: దాశరథి కృష్ణమాచార్య; గానం: పి.సుశీల
- లేరా లేరా లేరా ఓ రైతన్నా రెక్కల కష్టం నీదన్నా - రచన: కొసరాజు; గానం: ఘంటసాల బృందం
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)