శ్రుతి సావంత్ (జననం: 1988 జనవరి 21), భారతీయ నటి. వెండితెరపై ఆమె ఇనియా గా పిలువబడుతుంది. కేరళలోని తిరువనంతపురం నుండి వచ్చిన ఆమె ప్రధానంగా మలయాళం, తమిళ చిత్రాలలో నటిస్తుంది. ఆమె తమిళనాడు రాష్ట్ర అవార్డులలో తమిళ చిత్రం వాగై సూడ వా (2011)లో తన పాత్రకు ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.

ఇనియ
జననం
శ్రుతి సావంత్

(1988-01-21) 1988 జనవరి 21 (వయసు 36)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–ప్రస్తుతం
బంధువులుస్వాతి తారా (సోదరి)

బాల్యం, విద్యాభ్యాసం మార్చు

సావిత్రి, సలావుద్దీన్‌ దంపతులకు కేరళలోని తిరువనంతపురంలో 1988 జనవరి 21న పుట్టిన ఇనియా/ఇనేయా అసలు పేరు శృతి సావంత్. ఆమెకు మలయాళ టెలివిజన్ నటి స్వాతి, తమ్ముడు శ్రవణ్ ఉన్నారు.[1] ఆమె తన విద్యను తిరువనంతపురంలో అమృత విద్యాలయం, ఫోర్ట్ గర్ల్స్ మిషన్ హైస్కూల్, మనక్కడ్ కార్తీక తిరున్నాల్ హైస్కూల్ లలో కొనసాగించింది. ఆమె కరస్పాండెన్స్ ద్వారా బి.బి.ఎ కోర్సు చేసింది.

వృత్తి జీవితం మార్చు

ఇనియా చైల్డ్ ఆర్టిస్ట్‌గా అనేక మలయాళ టెలివిజన్ ధారావాహికలు, షార్ట్ ఫిల్మ్‌లు, టెలిఫిల్మ్‌లలో నటించింది.[1][2] నాల్గవ తరగతి చదువుతున్నప్పుడు, ఆమె కూట్టిలెక్కు అనే టెలిఫిల్మ్‌లో నటించింది, ఆ తర్వాత వాయలార్ మాధవన్ కుట్టి టెలి-సీరియల్స్ ఓర్మా, శ్రీ గురువాయూరప్పన్‌లలో నటించింది.[3]

ఆమె 2005లో మిస్ త్రివేండ్రం టైటిల్‌ను గెలుచుకుంది, దాని తర్వాత ఆమె కొంతకాలం మోడలింగ్ చేసింది. ఆ సమయంలో అనేక టెలివిజన్ ప్రకటనలతో పాటు డా. బిజు దర్శకత్వం వహించిన సైరా (2006), విజయకృష్ణన్ దర్శకత్వంలో వచ్చిన దళమర్‌రంగల్ (2009), ఉమ్మా (2011) లతో సహా అనేక విజయవంతమైన మలయాళ చిత్రాలలో నటించింది.[4][5]

రాజేష్ టచ్‌రివర్ పిల్లల దుర్వినియోగంపై రూపొందించిన ది సేక్రేడ్ ఫేస్‌(The Sacred Face)లో కూడా ఆమె కీలక పాత్ర పోషించింది.[6]

2010లో, ఆమె పడగసలై చిత్రంతో తమిళ చిత్రసీమలో అడుగుపెట్టింది.[7][8] ఆమె తరువాత యుద్ధం సేలో సహాయక పాత్రను పోషించింది.[9] ఎ. సర్కునం దర్శకత్వంలో వచ్చి వాగై సూడ వా (2011) చిత్రం సమయంలో శ్రుతి సావంత్ తన స్క్రీన్ పేరును ఇనియాగా మార్చుకుంది.[10]

పురస్కారాలు మార్చు

తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు

  • 2011: ఉత్తమ నటి – వాగై సూడ వా

కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులు

  • 2018: రెండవ ఉత్తమ నటి – పెంగలీలా, పెరోల్[11]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Iniya - Tamil Cinema Actress Interview - Iniya". Videos.behindwoods.com. 15 October 2011. Retrieved 28 October 2011.
  2. "Not "Miss"ing the chance!". Reviews.in.88db.com. Archived from the original on 12 December 2013. Retrieved 28 October 2011.
  3. Sathyendran, Nita (2 November 2011). "Starry dreams". The Hindu. Chennai, India.
  4. Sathyendran, Nita (2 November 2011). "Starry dreams". The Hindu. Chennai, India.
  5. Raghavan, Nikhil (6 August 2011). "Arts / Cinema : Itsy Bitsy". The Hindu. Chennai, India. Retrieved 28 October 2011.
  6. Sathyendran, Nita (2 November 2011). "Starry dreams". The Hindu. Chennai, India.
  7. "Impressive 'Miss Thiruvananthapuram' Sruthi | startrack – Movies". ChennaiOnline. 26 April 2010. Retrieved 28 October 2011.
  8. "Padagasalai Shruthi has four films on her hand". Southdreamz.com. 10 April 2010. Archived from the original on 18 September 2012. Retrieved 28 October 2011.
  9. "Review: Vaagai Sooda Vaa is outdated". Rediff.com. 30 September 2011. Retrieved 28 October 2011.
  10. "Vaagai Sooda Vaa Tamil Movie Review – cinema preview stills gallery trailer video clips showtimes". IndiaGlitz. 30 September 2011. Archived from the original on 9 May 2011. Retrieved 28 October 2011.
  11. "Kerala Film Critics Awards announced". The New Indian Express. 9 April 2019. Retrieved 25 January 2023.
"https://te.wikipedia.org/w/index.php?title=ఇనియా&oldid=3992383" నుండి వెలికితీశారు