ఇస్మాయీల్ ఇబ్న్ కసీర్ (ఆంగ్లము : Ismail ibn Kathir) (అరబ్బీ : ابن كثير ), ఒక ముస్లిం పండితుడు, ఖురాన్ గురించిన, ప్రసిద్ధి చెందిన వ్యాఖ్యాత

సిరియాకు చెందిన పండితుడు
మధ్యయుగం
సిరియా
పేరు: ఇబ్న్ కసీర్
జననం: 1301
మరణం: 1373
సిద్ధాంతం / సంప్రదాయం: షాఫయీ
ఇబ్న్ కతీర్ యొక్క వ్యాఖ్యానం నుండి నమ్మిన మీలో దేవుని వాగ్దానం యొక్క వివరణ

జీవిత చరిత్రసవరించు

ఇతని పూర్తిపేరు అబూ అల్-ఫిదా, ఇమాముద్దీన్ ఇస్మాయీల్ బిన్ ఉమర్ బిన్ కసీర్ అల్-ఖురాషి అల్-బుస్రవి. సిరియా, బుస్రా నగరంలో 1301లో జన్మించాడు. (బుస్రాలో జన్మించాడు కావున 'బుస్రవీ' అంటారు). డమాస్కస్ లోని ప్రఖ్యాత పండితుడైన షేక్-ఉల్-ఇస్లాం ఇబ్న్ తైమియ్యా, సిరియాకు చెందిన అబూ అల్-హజ్జాజ్ అల్ మిజ్జీ, ల వద్ద విద్యాభ్యాసం చేశాడు. తన అభ్యాసం పూర్తయి 1341 లో అధికారిక నియామకం గావింపబడ్డాడు. ఇంకనూ అనేక చోట్ల పండితుడిగా నియమింపబడ్డాడు, ఆఖరున డమాస్కస్ లోని మహా మస్జిద్లో జూన్/జూలై 1366 లో నియమింపబడ్డాడు. ఇబ్న్ కసీర్ తన ప్రఖ్యాత రచన "ఖురాన్ పై వ్యాఖ్యానాలు" వ్రాశాడు, దీన్కి తఫ్సీర్ ఇబ్న్ కసీర్ అని పేరు పెట్టాడు. ఈ తఫ్సీర్ (హదీసుల తోనూ) ముహమ్మద్ ప్రవక్త ఉపదేశాలనూ, సహాబాల వ్యాఖ్యానాలను కలిగివున్నది. ఇస్లామీయ ప్రపంచంలో ఈ ఇబ్న్ కసీర్ ఎంతో ప్రాముఖ్యతనూ, ప్రాశస్తాన్నీ కలిగివున్నది.

ఇబ్న్ కసీర్ ను ఖాదీ అని, ఇస్లామీయ చరిత్ర తెలిసిన ఘనుడనీ పేర్కొంటారు. ఇతను ముఫస్సిర్ (తఫ్సీర్ ను వ్రాసేవాడు) గా ప్రసిద్ధి. ఇతను 'తబక్ఖాత్-ఎ-షాఫయీ' నూ రచించాడు. ఇతను షాఫయీ పాఠశాల అవలంబీకుడు. ఇతను, తన జీవిత రెండో దశలో 'గ్రుడ్డి'వాడై పోయాడు. అహ్మద్ ఇబ్న్ హంబల్ యొక్క ముస్నద్ ను, దీర్ఘకాలంగా రేయింబవళ్ళూ వ్రాస్తూ, తన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఇబ్న్ కసీర్ ఫిబ్రవరీ 1373, డెమాస్కస్ లో మరణించాడు.

రచనలుసవరించు

  • తఫ్సీర్ ఇబ్న్ కసీర్
  • అల్ బిదాయాహ్ వల్ నిహాయా (ఆరంభం, అంతము) లేదా "తారీఖ్ ఇబ్న్ కసీర్". లభ్యమయ్యే చోటు wikisource
  • అల్-సీరా అల్-నబవియ్యా
  • తబఖాత్ అష్-షాఫియా
  • ఖియామహ్ (ఖయామత్ సూచనలు)
  • పాపములు వాటి శిక్షలు

బయటి లింకులుసవరించు