ఇయాన్ చాపెల్

ఆస్ట్రేలియా దేశపు క్రికెట్ ఆటగాడు

1943, సెప్టెంబర్ 26న జన్మించిన ఇయాన్ చాపెల్ (Ian Michael Chappell) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1971 నుండి 1975 వరకు ఆస్ట్రేలియా జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ తరువాత ప్రపంచ సీరీస్ క్రికెట్‌లో ప్రవేశించి అక్కడ ప్రధాన పాత్ర వహించాడు. అతడి తాత, సోదరుడు కూడా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. చాపెల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంలో బాగా స్థిరపడ్డాడు. 2006లో షేర్ వార్న్ తన కెరీర్‌లో చాపెల్ ప్రభావం ఉన్నదని ప్రకటించడం ఇతని గొప్పతనానికి నిదర్శనం.[1]

టెస్ట్ క్రికెట్సవరించు

ఇయాన్ చాపెల్ 1964 డిసెంబర్ 4న పాకిస్తాన్ పై తిలిసారిగా టెస్ట్ క్రికెట్ ఆడినప్పటినుంచి 1980, ఫిబ్రవరి 6న ఇంగ్లాండుపై చివరి టెస్ట్ ఆడేవరకు మొత్తం 75 టెస్టులకు ప్రాతినిధ్యం వహించి 42.42 సగటుతో 5345 పరుగులు సాధించాడు. అందులో 14 సెంచరీలు, 26 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్టులలో అతడి అత్యధిక స్కోరు 196 పరుగులు. బౌలింగ్‌లో 20 వికెట్లు కూడా సాధించాడు.

వన్డే క్రికెట్సవరించు

చాపెల్ 16 వన్డేలలో ప్రాతినిధ్యం వహించి 48.07 సగటుతో 673 పరుగులు సాధించాడు. వన్డేలలో 8 అర్థసెంచరీలు సాధించాడు. అత్యధిక స్కోరు 86 పరుగులు.

జట్టు నాయకుడిగాసవరించు

ఇయాన్ చాపెల్ 1970-1975 మధ్యలో 30 టెస్టులకు నేతృత్వం వహించి 15 టెస్టులను గెలిపించాడు. 5 టెస్టులు ఓడిపోగా మరో పదింటిని డ్రాగా ముగించాడు. 1972-73లో పాకిస్తాన్తో స్వదేశంలో జరిగిన సీరీస్‌లో 3-0 తో విజయం సాధించాడు. నేతృత్వం వహించిన తొలి టెస్టు మినహా ఏ సీరీస్ కూడా ఇతని నుంచి చేజారలేదు.

ప్రపంచ కప్ క్రికెట్సవరించు

1975లో జరిగిన తొలి ప్రపంచ కప్ టోర్నమెంటులో ఇయాన్ చాపెల్ాస్ట్రేలియా జట్టుకు నేతృత్వం వహించాడు. అదే అతను పాల్గొన్న ఏకైక ప్రపంచ కప్ పోటీ.

మూలాలుసవరించు

  1. The Age: In Warne's Words. Retrieved 8 October 2007.