ఇషా గుహ
ఇషా తారా గుహ (జననం 1985 మే 21) బ్రిటీష్ క్రికెట్ వ్యాఖ్యాత, టెలివిజన్, రేడియో క్రికెట్ బ్రాడ్‌కాస్టర్ కూడా.[1] ఆమె 2005 ప్రపంచ కప్, 2009 ప్రపంచ కప్‌లలో ఆడిన మాజీ ఇంగ్లాండు క్రికెటర్.[2]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఇషా తారా గుహ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | హై వైకోంబ్, బకింగ్‌హామ్‌షైర్, ఇంగ్లాండ్ | 1985 మే 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 137) | 2002 14 ఆగస్టు - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2011 22 జనవరి - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 94) | 2001 10 ఆగస్టు - స్కాట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2011 21 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 5) | 2004 5 ఆగస్టు - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2011 29 అక్టోబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 మార్చి 7 |
2009లో ప్రపంచ కప్ గెలవడం తన కెరీర్‌లో హైలైట్‌గా నిలిచింది.[3] ఆమె కుడిచేతి ఫాస్ట్-మీడియం బౌలర్, కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఆమె 2001, 2011ల మధ్య ఇంగ్లాండు తరపున 8 టెస్ట్ మ్యాచ్‌లు, 83 వన్డే ఇంటర్నేషనల్, 22 ట్వంటీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. ఆమె థేమ్స్ వ్యాలీ, బెర్క్‌షైర్ తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[4]
బాల్యం, విద్యాభ్యాసం
మార్చుఆమె ఇంగ్లాండ్‌లోని హై వైకోంబ్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు 1970లలో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తా నుండి యునైటెడ్ కింగ్‌డమ్‌కు వలస వెళ్ళారు.[5] ఆమె ఎనిమిదేళ్ల వయసులో తన అన్నయ్యతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది.[5] కాగా 13 ఏళ్ల వయస్సులో డెవలప్‌మెంట్ ఇంగ్లాండ్ జట్టుకు ఆమె ఎంపికైంది.[6]
బాలికల రాష్ట్ర పాఠశాల అయిన వైకోంబ్ హైస్కూల్ లో ఆమె చదువుకుంది.[7] ఆమె బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పట్టాపుచ్చుకుంది. యూనివర్సిటీ కాలేజ్ లండన్‌లో ఆమె న్యూరోసైన్స్‌లో ఎంఫిల్ పూర్తిచేసింది.[8][9]
క్రికెట్ కెరీర్
మార్చురైట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ అయిన ఆమె 2002లో భారతదేశంపై 17 పరుగులతో తన టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేసింది.[10] అదే పర్యటనలో భాగంగా, ఆమె 2002 మహిళల ట్రై-సిరీస్‌లో ఆడింది. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ ఓడిపోయినా ఆమె మూడు వికెట్లు పడగొట్టి మంచి ఆటతీరు ప్రదర్శించింది.[11] ఆమె ఇంగ్లాండ్ తరపున ఆడిన మొదటి భారతీయ వారసత్వ మహిళ అవడం విశేషం.[12]
2002లో, ఆమె బిబిసి ఏషియన్ నెట్‌వర్క్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యింది.[13] 2008లో వెస్టిండీస్‌పై 14 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం 44 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆమె అత్యుత్తమ బౌలింగ్ గా నిలిచింది.[14] 2008 డిసెంబరు 31 నాటికి, ఆమె ఐసిసి మహిళల వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ బౌలర్‌గా నిలిచింది. 2009 ఫిబ్రవరిలో బౌరల్‌లోని బ్రాడ్‌మాన్ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తన ఏడవ టెస్టు మ్యాచ్‌లో ఆమె 40 పరుగులకు 5 వికెట్లు తీసి కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచింది. 2008, ఆ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టింది, ఇంగ్లండ్ యాషెస్‌ను నిలబెట్టుకోవడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది.[15][16]
2009 ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టులో ఆమె భాగం అయింది. ఆమె 2012 మార్చి 9న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది, అయినప్పటికీ తాను బెర్క్‌షైర్ తరపున కౌంటీ క్రికెట్ ఆడటం కొనసాగిస్తానని చెప్పింది.[17]
మహిళల ఒడిఐ చరిత్రలో ఆమె, లిన్సే ఆస్క్యూతో కలిసి తొమ్మిదో వికెట్‌కు 73 పరుగులతో ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.[18][19]
మీడియా
మార్చుబిబిసి స్పోర్ట్ వెబ్‌సైట్ లో ఇషా గుహ కాలమిస్ట్ గా చేసింది.[20] ఆమె టెస్ట్ మ్యాచ్ స్పెషల్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[21] ఆమె 2012 ఏప్రిల్లో ఐటీవి స్పోర్ట్‌లో ఐటీవి4 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కవరేజీకి సహ-ప్రెజెంటర్‌గా చేసింది.[22][23][24]
2016లో, ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ట్రిపుల్ ఎమ్ రేడియో టెస్ట్ క్రికెట్ కామెంటరీ టీమ్‌లో ఆమె ఒకరు.[25] 2018లో, ఆమె ఇంగ్లాండ్/పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్‌లకు స్కై స్పోర్ట్స్‌కు వ్యాఖ్యాతగా పనిచేసింది.[26] అంతేకాకుండా వారి ఆస్ట్రేలియన్ క్రికెట్ కవరేజ్ కోసం ఫాక్స్ క్రికెట్‌కు వ్యాఖ్యాతగా ఎంపికైంది.[27] ఆమె 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో వ్యాఖ్యాన బృందంలో కూడా సభ్యురాలు. 2020లో ఆమె కొత్త బిబిసి టీవి టెస్ట్, ఒడిఐ హైలైట్స్ షోకు ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించింది.[28][29]
2023లో, ఆమె వింబుల్డన్ ఛాంపియన్‌షిప్‌ల బిబిసి కవరేజీ కోసం ప్రెజెంటింగ్ టీమ్‌లో చేరింది.[30]
దాతృత్వం
మార్చుఇషా గుహ స్పోర్టింగ్ ఈక్వల్స్, బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్‌లకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంది.[31][32][33][34] 2023లో, మహిళా క్రికెట్ క్రీడాకారులకు మద్దతుగా గాట్ యువర్ బ్యాక్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది.[35]
మూలాలు
మార్చు- ↑ "Isha Guha : కామెంటేటర్‌గా రాణిస్తున్నానంటే.. ఆ క్రెడిట్ అంతా వార్న్‌దే! | Commentator Isha Guha mvs". web.archive.org. 2023-08-13. Archived from the original on 2023-08-13. Retrieved 2023-08-13.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ Isa Guha ESPN Cricinfo
- ↑ Walker, Phil (23 అక్టోబరు 2012). "A Drink With… Isa Guha". All Out Cricket. Archived from the original on 12 మే 2014. Retrieved 12 మే 2014.
- ↑ "Isa Guha". CricketArchive. Retrieved 7 March 2021.
- ↑ 5.0 5.1 Qureshi, Huma (2012-10-10). "Isa Guha: 'England is leading the way in women's cricket'". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2019-12-03.
- ↑ Kumar, K. C. Vijaya (2014-07-25). "I had the best of both worlds: Isa Guha". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-12-03.
- ↑ "Wycombe girl named under 17s Cricketer of the Year". Bucks Free Press. 28 February 2002.Dunhill, Lawrence (12 July 2010). "Nine decades of pupils attend renunion". Bucks Free Press.
- ↑ UCL (2006-08-15). "Student cricket star". UCL News (in ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
- ↑ "How Isa Guha is Changing Perceptions about Cricket Presenters | Forbes India Blog". Forbes India (in ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
- ↑ "Isa Guha". Cricinfo. Retrieved 2019-04-04.
- ↑ "Isa Guha NZ". Independent.co.uk. 20 July 2002. Retrieved 2020-03-12.
- ↑ Guha was the first Asian woman to play for England
- ↑ "England's Isa Guha retires from international cricket". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2012-03-09. Retrieved 2019-04-04.
- ↑ "Full Scorecard of England Women vs West Indies Women 2nd ODI 2008 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-04-04.
- ↑ "Full Scorecard of Australia Women vs England Women Only Test 2008 – Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2019-04-04.
- ↑ "England women win to retain Ashes" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2008-02-18. Retrieved 2019-04-04.
- ↑ Isa Guha retires from international cricket ESPN Cricinfo, 9 March 2012
- ↑ "12th Match: England Women v New Zealand Women at Chennai, Mar 3, 2007 | Cricket Scorecard |". Cricinfo. ESPN. Retrieved 17 April 2017.
- ↑ "Records | Women's One-Day Internationals | Partnership records | Highest partnerships by wicket |". Cricinfo. ESPN. Retrieved 17 April 2017.
- ↑ Isa Guha column: 'I've picked a winner with the Black Keys' BBC Sport, 15 February 2012
- ↑ "BBC Radio 4 – Test Match Special, The 2019 Men's World Cup Final". BBC (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2019-12-03.
- ↑ Indian Premier League cricket returns to ITV4 Archived 8 మే 2012 at the Wayback Machine ITV Press Centre, 21 March 2012
- ↑ The Indian Premier League returns to ITV4 and ITV.com Archived 27 జనవరి 2013 at Archive.today ITV.com, 30 March 2012
- ↑ ITV Snap up England's Women Cricket Star Isa Guha to present IPL coverage Archived 22 మే 2012 at the Wayback Machine Total Sport Promotions, 15 April 2011
- ↑ Triple M Delivers Best Ever Ashes Commentary Team Triple M Melbourne, 22 September 2017
- ↑ "Isa Guha is 'new face of cricket' on the BBC..." www.asian-voice.com.
- ↑ Commentary Team Foxtel
- ↑ "Cricket on the BBC: Isa Guha to present Test & ODI highlights shows". BBC Sport. 4 June 2020.
- ↑ Martin, Ali (2020-06-04). "Geoffrey Boycott could end TMS career after BBC omit 79-year-old from lineup". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. Retrieved 2020-08-07.
- ↑ ""Who is Wimbledon presenter Isa Guha?". www.radiotimes.com. 27 June 2023.
- ↑ "Isa Guha". Supporters. Sporting Equals. Archived from the original on 2 February 2017. Retrieved 21 January 2017.
- ↑ Brand Ambassadors Archived 9 మే 2012 at the Wayback Machine Sporting Equals
- ↑ ITV Snap up England's Women Cricket Star Isa Guha to present IPL coverage Archived 22 మే 2012 at the Wayback Machine Total Sport Promotions, 15 April 2011
- ↑ "VIVO IPL 2017 Schedule". Archived from the original on 18 ఫిబ్రవరి 2017. Retrieved 20 ఫిబ్రవరి 2017. British Asian Trust, September 2016
- ↑ "Guha launches initiative to support women in cricket". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2023-02-28. Retrieved 2023-06-01.