ఇష్టం 2001 లో విడుదలైన తెలుగు సినిమా. ప్రముఖ నటి శ్రియా సరన్ ఈ చిత్రం ద్వారా తెలుగు సినీరంగంలో ప్రవేశించింది. ఈ చిత్ర సంగీతం విజయవంతమైనది. ఈ చిత్ర కధానాయకుడు చరణ్ కి ఇదే మొదటి మరియు ఆఖరి చిత్రం. 2012 మార్చి లో అతడు తీవ్రమైన గుండెపోటుతో మరణించాడు.[2]

ఇష్టం
IshtamTeluguMovie2001.jpg
చిత్ర ప్రచార పత్రిక
దర్శకత్వంవిక్రం కుమార్ & రాజ్ కుమార్
నిర్మాతరామోజీరావు
నటులుచరణ్
శ్రియా సరన్
పూనం ధిల్లాన్
చంద్రమోహన్
సంగీతండి.జి. గోపీనాధ్ (పరిచయం)
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పునందమూరి హరి
నిర్మాణ సంస్థ
విడుదల
30 డిసెంబరు 2001 [1]
భాషతెలుగు

కథసవరించు

కార్తీక్ (చరభ్ ) ధనవంతుల కుటుంబానికి చెందిన అబ్బాయి. అతడికి చదువు పట్ల శ్రద్ద ఉండదు. నేహా (శ్రియ) , సుబ్బు (చంద్రమోహన్) కుమార్తె. ఈమె చిన్నతనంలోనే తల్లి చనిపోతుంది. కాలేజీలో కార్తీక్ శ్రియకు సీనియర్. ఈమెను బాగా ఏడిపిస్తుంటాడు. అనుకోకుండా కార్తీక్ వాళ్ళామ్మ లక్ష్మి (పూనం థిల్లాన్) ఒక ప్రమాదంలో చిక్కుకుని గాయపడితే , నేహా ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్పిస్తుంది. తర్వాత ఈ క్రమంలో నేహా మరియు లక్ష్మి ఇద్దరూ మంచి స్నేహితులౌతారు. ఈ క్రమంలో నేహా కార్తీక్ తో ప్రేమలో పడుతుంది. తన కుమార్తె నేహాని లక్ష్మి కుమారుడికి ఇచ్చి పెళ్ళి చేయాలని తలంచిన సుబ్బు, అదే విషయాన్ని లక్ష్మిని అడుగుతాడు. ఆమె ఆశ్చర్యకరంగా ఈ ప్రతిపాదనని తిరస్కరిస్తుంది. ఎందుకన్నది మిగిలిన కథ.

తారాగణంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

బయటి లంకెలుసవరించు