ఇస్ హాఖ్ ప్రవక్త

(ఇస్ హాఖ్ నుండి దారిమార్పు చెందింది)

ఇస్ హాఖ్ (ప్రవక్త): ఇస్లాం మతగ్రంథమైన ఖురాన్,, ఇస్లామీయ ధార్మిక సంప్రదాయాల ప్రకారము, ప్రవక్తల పితామహుడిగా పేరుగాంచిన ఇబ్రాహీం, అతని భార్య సారాహ్ (ఇబ్రాహీం భార్య) ల కుమారుడు 'ఇస్ హాఖ్'. ఇతనిని 'ఇశ్రాయేలీయుల పిత' అనికూడా అంటారు. యూదుల మతగ్రంథమైన తోరాహ్ లోను క్రైస్తవుల మతగ్రంథమైన బైబిలు (అరబ్బీలో ఇంజీల్) లోనూ ఇతని పేరు 'ఇస్సాకు' గా వర్ణింపబడింది. దేవుని పరీక్షలో ఇబ్రాహీము బలి ఇవ్వబోయింది ఇస్మాయీల్ని అని ముస్లిములు అంటే, ఇస్సాకుని అని క్రైస్తవులు అంటారు.

ఇస్ హాఖ్ గురించి ఖురాన్ లో, హదీసులలో అనేక చోట్ల ప్రస్తావించ బడింది:

  • ఇబ్రాహీముకు ఇస్‌హాక్, యాకూబ్ లను ఇచ్చాము. ఆ ముగ్గురినీ మేము సన్మార్గంలోనడిపించాము. ఇబ్రాహీముకంటే ముందు మేము నూహ్ (నోవహు) ను కూడా సన్మార్గంలో నడిపాము. అతని సంతానంలో దావూద్ (దావీదు), సులైమాన్ (సొలోమోను), యోబు, యేసేపు, మూసా (మోషే), అహరోను లకు కూడా సన్మార్గం చూపాము. మంచిచేసే వాళ్ళను అలా సత్కరిస్తాము. (అనమ్ :84)
  • దైవ ప్రవక్త ఇలా అన్నారు "గౌరవనీయుని కుమారుడు కూడా గౌరవనీయుడే. అంటే ఇబ్రాహీము కుమారుడు , ఇస్‌హాక్ కుమారుడు, యాకూబ్ కుమారుడు, యూసుఫ్ (యోసేపు) కుమారుడు అలా..." (సహీ బుఖారి : 4;596)
  • నేను నా పితరులైన ఇబ్రాహీము (అబ్రాహాము), ఇస్ హాఖ్ (ఇస్సాకు), యాఖూబ్ (యాకోబు) ల విశ్వాసాన్నే అనుసరిస్తాను. అల్లాహ్ కు భాగస్వాముల్ని చేర్చము. (యూసుఫ్ : 38)
  • ఇంత ముసలి వయసులో నాకు ఇస్మాయీల్ ను, ఇస్సాకును ప్రసాదించిన అల్లాహ్ కు స్తోత్రాలు . (ఇబ్రాహీం :39)
  • ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానమంతా యూదులు, క్రైస్తవులని అనుకొంటున్నారా? (అల్-బఖరా :140)
  • మేము ఇబ్రాహీము, ఇస్మాయిల్, ఇస్సాకు, యాకూబు వారి సంతానానికి, మూసా, ఈసా ఇతర ప్రవక్తలకు పంపబడ్డ అల్లాహ్ సందేశాన్ని నమ్ముతున్నాము. మేము వారిమధ్య ఎలాంటి తేడా చూపము " (ఆల్-ఇమ్రాన్ :84)

ఇవీ చూడండి

మార్చు