దశ రూపాకాలలో పదవ రూపకము ఈహమృగము. ఈహా అనగా చేష్ట, పోలిక, అనుసరణ. మృగం వంగి చేష్టను అంటే స్త్రీ మాత్ర వంటి చేష్టను ప్రదర్శించేది ఈహామృగం.

దశ రూపకాలు సవరించు

దశ రూపకాలు పది రకాలు;[1]

 1. నాటకము
 2. ప్రకరణము
 3. భాణము
 4. ప్రహసనము
 5. డిమము
 6. వ్యాయోగము
 7. సమవాకారము
 8. వీధి
 9. అంకము
 10. ఈహామృగము

ఈహమృగము - విధానం సవరించు

అలభ్యమైన నాయికను నాయకుడు కోరడం చేత లేక అనుసరించడం చేత ఈహామృగం. భరతముని ఈహామృగంలో దివ్య పురుషుడు నాయకుడిగా ఉండాలి అన్నాడు. కాని ధీరోద్ధతులైన నరదివ్యులు నాయికా ప్రతి నాయకులుగా ఉండవచ్చని ధనంజయుడు అభిప్రాయపడ్డాడు. అంక సంఖ్య విషయంలో భరతముని వ్యాయోగంలా అనడంచేత ఒకే అంకమని అనుశాసించినట్లయింది. కాని ధనంజయుడు నాలుగు అంకాలని చెప్పాడు.

ఒకే అంకమైతే ఒకరోజు జరిగిన కథను, నాలగు అంకాలైతే నాలుగు రోజుల కథను నిబంధించాలని నాట్య దర్పణం చెబుతోంది.

మూలాలు సవరించు

 1. గూగుల్ బుక్స్ లో "దక్షరూపక విధానం" నుండి
"https://te.wikipedia.org/w/index.php?title=ఈహమృగము&oldid=3902182" నుండి వెలికితీశారు