ఇ.వి.సరోజ

(ఈ.వి.సరోజ నుండి దారిమార్పు చెందింది)

ఇ.వి.సరోజ (నవంబర్ 3, 1935 - అక్టోబరు 3, 2006) 1950, 60 వ దశకాలలో ప్రసిద్ధి చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి.

ఇ.వి.సరోజ
ఇ.వి.సరోజ
జననంనవంబరు 3, 1935
మరణంఅక్టోబరు 3, 2006
మరణ కారణంగుండెపోటు
వృత్తిసినీ నటి
మతంహిందూ
భార్య / భర్తటి.ఆర్.రామన్న

జీవిత విశేషాలు సవరించు

1935, నవంబర్ 3న జన్మించింది. 1951లో "ఎన్ తంగై" (నా చెల్లెలు) సినిమాలో ఎం.జి.రామచంద్రన్ చెల్లెలిగా నటించి సినీ జీవితాన్ని ప్రారంభించింది. సరోజ గుళేబకావళి, వీర తిరుమగన్, మదురై వీరన్ సినిమాలలో నటనకు పేరు తెచ్చుకున్నది. 40 పైగా సినిమాలలో కథానాయకిగా నటించిన సరోజ వందకు పైగా తమిళ, తెలుగు, హిందీ, ఒక సింహళ సినిమాలలో పాటలలో నాట్యం చేసింది.[1]

1951 తమిళ చిత్రం ఎన్ తంగై ద్వారా చిత్రరంగ ప్రవేశం చేసి, చక్కని నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించింది. పుట్టింది చాలా సాధారణమైన కుటుంబంలో. ఆమె జన్మస్థలం తమిళ నాడు లోని తంజావూరు జిల్లాలో ఉన్న ఎణ్ కణ్ అనే కుగ్రామం. చెన్నైలో ఉన్న బంధువైన వళువూర్ రామయ్య వద్దకు తన చిన్న వయసులోనే భరతనాట్యం అభ్యసించడానికి వెళ్ళింది.[2] ఆమె భరతనాట్య కళాకారిణిగా మంచి నైపుణ్యం సంపాదించి ప్రదర్శనలు ఇచ్చి మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించింది. ఆ తరువాత చిత్రరంగ ప్రవేశం చేసి, తనకొక గుర్తించతగిన స్థానం సంపాదించుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు టి.ఆర్.రామన్నను వివాహమాడి క్రమక్రమంగా చిత్రరంగం నుండి విరమించింది.

మరణం సవరించు

అక్టోబరు 3, 2006లో గుండెపోటుతో తన జీవితయాత్ర చాలించింది.[3]

నటించిన చిత్రాలు సవరించు

 1. ఎన్ తంగై (1952 చిత్రం) (తమిళం, 1952)
 2. గులేబకావళి (1955)
 3. పెన్నరాశి (1955)
 4. భలేరాముడు (1956) .... రూపాదేవి, నాట్యకారిణి
 5. అమరదీపం (1956)
 6. పాసవలై (1956)
 7. మధురై వీరన్ (1956)
 8. పెంకీ పెళ్ళాం (1956)
 9. రాంబాయిన్ కాథల్ (1956)
 10. సువర్ణ సుందరి (1957) .... పార్వతి
 11. భాగ్యరేఖ (1957)
 12. సౌభాగ్యవతి (1957)
 13. కర్పుక్కరసి (1957)
 14. ఎంగవీటు మహలక్ష్మి (1957)
 15. వీరకంకణం (1957)
 16. భూకైలాస్ (తెలుగు, 1958) .... నాట్యకారిణి
 17. అప్పుచేసి పప్పుకూడు (తెలుగు, 1958) .... నాట్యకారిణి
 18. అతిసయ పెన్న్ (తమిళం, 1959)
 19. కాతవరాయన్ (1959)
 20. తంగ పాదుమై (1959)
 21. ఇంటికి దీపం ఇల్లాలు (1961)
 22. ఇద్దరు మిత్రులు (తెలుగు, 1961)
 23. వీరతిరుమగన్ (తమిళం, 1962)
 24. చదువుకున్న అమ్మాయిలు (తెలుగు, 1963) .... లత
 25. వెలుగు నీడలు (తెలుగు, 1964)

మూలాలు సవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-12-19. Retrieved 2009-06-06.
 2. "సరోజ మరణం గురించి హిందూ వ్యాసం". Archived from the original on 2007-10-01. Retrieved 2007-04-03.
 3. హిందూ పత్రికలో మరణ వార్త
"https://te.wikipedia.org/w/index.php?title=ఇ.వి.సరోజ&oldid=3437566" నుండి వెలికితీశారు