బి.ఎన్.రెడ్డి ఎంతో కష్టపడి తీసిన బంగారుపాప చిత్రం నిరాశపరచింది. దాంతో తీవ్ర నిరాశకు గురైన బి.ఎన్. వెంటనే సొంత సినిమా తీసే ధైర్యం చేయలేక పోయారు. ఆ దశలో ఆయన దర్శకత్వంలో సినిమా నిర్మించే అవకాశమిమ్మని పొన్నలూరి బ్రదర్స్ ఆయనకు తమ దగ్గరున్న కథ చూపించారు. అంతకంటే మెరుగైన కథ తన దగ్గరే ఉందని బి.ఎన్. బంగారుపాప తీయడానికి ముందు తాను తయారు చేసుకుని పక్కన పడేసిన స్క్రిప్ట్ తోనే 1957లో భాగ్యరేఖ తీశాడు. అలా అది తమ స్వంత సంస్థ వాహినీ వెలుపల ఆయన తీసిన తొలి చిత్రం అయింది. అయితే అది ఆయనకే ఆశ్చర్యం కలిగించేలా హిట్టైంది.

భాగ్యరేఖ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.ఎన్.రెడ్డి
కథ పాలగుమ్మి పద్మరాజు
చిత్రానువాదం బి.ఎన్.రెడ్డి
తారాగణం నందమూరి తారక రామారావు,
జమున,
సూర్యకాంతం,
షావుకారు జానకి,
రేలంగి,
అల్లు రామలింగయ్య,
రమణారెడ్డి ,
సి.ఎస్.ఆర్.,
అల్లు రామలింగయ్య,
పి. హేమలత,
డా. జి.వి. సుబ్బారావు,
లక్ష్మీకాంత్,
సి. నాగభూషణం ,
ఇ.వి. సరోజ,
డా. శివరామకృష్ణయ్య,
కె.వి.ఎస్. శర్మ
సంగీతం pendyala Nageswara rao
నృత్యాలు వెంపటి సత్యం
గీతరచన కొసరాజు రాఘవయ్యచౌదరి,
దేవులపల్లి కృష్ణశాస్త్రి,
ఎరమాకుల ఆదిశేషారెడ్డి
సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు
ఛాయాగ్రహణం బి.ఎన్. కొండారెడ్డి
కళ టి. వి. యస్. శర్మ
కూర్పు వాసు
నిర్మాణ సంస్థ పొన్నలూరి బ్రదర్స్
భాష తెలుగు
 
భాగ్యరేఖ సినిమాలో ఒక సన్నివేశం

"లక్ష్మి" అనే పిల్ల (పెద్దయిన తరువాత జమున ఈ పాత్ర ధరించింది.) చిన్నతనంలో తల్లిదండ్రులను కోల్పోయి పినతండ్రి పంచన చేరింది. పినతండ్రి ఆమె చేయి చూసి ఆ చేతిలో "భాగ్యరేఖ" మెండుగా ఉన్నదంటాడు. లక్ష్మి పినతల్లి (సూర్యకాంతం) తన కూతురు కాత్యాయిని (పెద్దయనాక షావుకారు జానకి) ని ముద్దు చేస్తూ లక్ష్మిని హింసిస్తూ ఉంటుంది.

లక్ష్మి తన తాతవద్దకు వెళ్లి పెరుగుతుంది. కాని వృద్ధుడైన తాత మరణించడంతో మళ్ళీ పిన తల్లిదండ్రులవద్దకు చేరింది. అక్కడ కాత్యాయినిని చూడడానికి వచ్చిన పెళ్ళివారు లక్ష్మిని చేసుకుంటామని అంటారు. పినతల్లి నిష్టూరాలకు బాధపడి లక్ష్మి ఇంటినుండి వెళిపోతుంది. తిరుపతిలో దైవ దర్శనం చేసుకొని ఆత్మహత్యకు సిద్ధమవుతుంది. కాని అప్పుడే ఒక తప్పిపోయిన చిన్న పిల్లను కాపాడి తల్లిదండ్రులవద్దకు చేరుస్తుంది. లక్ష్మి కథ విని ఆ ధనిక కుటుంబం ఆమెను తమతో తీసుకెళ్ళి తమ ఇంట్లో ఉంచుకొంటారు.

అక్కడ వారి కొడుకు (ఎన్.టి.రామారావు) లక్ష్మిని పెళ్ళాడదలచి ఎలాగో తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. తీరా పెళ్ళి సమయంలో పినతల్లి, ఇతరులు పన్నిన పన్నాగం వలన పెళ్ళి ఆగిపోతుంది. లక్ష్మి ఆ ఇంటినుండి దూరమౌతుంది. ప్రియుడు (రేలంగి) తో మద్రాసు వెళ్ళీ కాత్యాయిని కష్టాలపాలవుతుంది. ఆమెను లక్ష్మి ఆదుకొంటుంది. మంచంపట్టిన కథానాయకుడు మళ్ళీ లక్ష్మి రాకతో కోలుకుంటాడు.

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
కన్నె ఎంతో సుందరి సన్నజాజి పందిరి దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు
కన్నీటి కడలిలోన చుక్కాని లేని నావ దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు పి. సుశీల, ఎ.ఎం. రాజా
తిరుమల మందిర సుందర హరి గోవింద గోవింద దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు మల్లికార్జున బృందం
నీవుండే దా కొండపై నా స్వామి నే నుండే దీ నేలపై దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు పి.సుశీల
నీ సిగ్గే సింగారమే ఓ చెలియ దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు
మనసా తెలుసా నీ విరాగ మంతా వృథాయని తెలుసా దేవులపల్లి కృష్ణశాస్త్రి పెండ్యాల నాగేశ్వరరావు
మనసూగే సఖ, తనువూగే ప్రియ దేవులపల్లి కృష్ణశాస్త్రి

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "5th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 2 September 2011.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • భాగ్య రేఖ పాటలు వినండి.
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా|ఉత్తమ ప్రజాదరణ పొందిన సినిమా|ఉత్తమ నటుడు|ఉత్తమ నటి|ఉత్తమ సహాయ నటుడు|ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు|ఉత్తమ బాల నటుడు|ఉత్తమ ఛాయా గ్రహకుడు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్|ఉత్తమ దర్శకుడు|ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు|ఉత్తమ గీత రచయిత|ఉత్తమ సంగీత దర్శకుడు|ఉత్తమ నేపథ్య గాయకుడు|ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం|ఉత్తమ కూర్పు|ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్|ఉత్తమ బాలల సినిమా|ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం|ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా|ఉత్తమ బెంగాలీ సినిమా|ఉత్తమ ఆంగ్ల సినిమా|ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా|ఉత్తమ మళయాల సినిమా|ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా|ఉత్తమ పంజాబీ సినిమా|ఉత్తమ కొంకణి సినిమా|ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా|ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినీ విమర్శకుడు
ఉత్తమ సినీ విమర్శకుడు
"https://te.wikipedia.org/w/index.php?title=భాగ్యరేఖ&oldid=4205639" నుండి వెలికితీశారు