భారతదేశం లోని 18 రైల్వే జోన్‌లలో ఉత్తర మధ్య రైల్వే (North Central Railway) ఒకటి. ఉత్తర మధ్య రైల్వేలో అతిపెద్ద రైల్వే స్టేషను కాన్పూర్ మధ్య కాగా మొఘల్ సారాయ్ రైల్వే స్టేషను రెండవ స్థానములో ఉంది. ఈ రైల్వే జోన్ అలహాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది.

ఉత్తర మధ్య రైల్వే జోన్ (13వ నెంబరు)

జోన్స్ పునరుద్దరించ బడినప్పుడు, గతకాలపు ఉత్తర రైల్వే జోన్ లోని అలహాబాద్ డివిజన్, గతకాలపు మధ్య రైల్వే జోణ్ లోని విభజన అనంతరం ఏర్పడిన ఝాన్సీ డివిజను, కొత్త ఏర్పడిన ఆగ్రా డివిజనుతో కలిపి మూడు (డివిజన్స్) విభాగాలు ఉత్తర మధ్య రైల్వే ఉన్నాయి.

చరిత్ర

 
కాన్పూర్ రైల్వే స్టేషను

ఉత్తర మధ్య రైల్వే, దాని ప్రస్తుత రూపంలో, 2003 ఏప్రిల్ 1 లో ఉనికిలోకి వచ్చింది. ఉత్తర మధ్య భారతదేశం|ఉత్తర మధ్య భారతదేశం యొక్క ఒక పెద్ద ప్రాంతంలో విస్తరించి ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలు ప్రస్తుతం ఉత్తర మధ్య రైల్వే|ఉత్తర మధ్య రైల్వే పరిధిలో ఉన్నాయి.

విస్తరణ పరిధి

  • రైల్వేకు భౌగోళికంగా ఉత్తర మధ్య రైల్వే గుండెకాయ లాంటిది. ఉత్తర దిక్కు (వదలి) నుండి తూర్పు దిక్కున మొఘల్‌సరాయి స్టేషను (వదలి) వరకు, దక్షిణ దిక్కులో బినా స్టేషను (వదలి) ఈ జోన్ విస్తరించి ఉంది.
  • ఈ జోన్‌లో ప్రధానంగా మొత్తం 3062 రూట్ కిలోమీటర్లుతో డబుల్ లైన్ విద్యుదీకరించిన విభాగంఉన్నది.
  • ఈ విద్యుదీకరించిన మార్గం లోని ఒక భాగమయిన ఘజియాబాద్ నుండి మొఘల్‌సరాయి మార్గము గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రూట్ (మార్గము) లోని ఒక భాగం అయి ఉంది.
  • ఈ జోన్‌లో 202 ప్రధాన లైన్ స్టేషన్లు, 221 శాఖ లైన్ స్టేషన్లు ఉన్నాయి.
  • ఈ జోన్ అన్ని దిక్కులకు ఒక రైల్వే కారిడార్‌గా విభాసిల్లు చున్నది. అనగా ప్రతి రోజు తూర్పు నుండి ఉత్తరమునకు, ఉత్తరము నుండి తూర్పునకు 29 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, పడమర/దక్షిణము నుండి ఉత్తరమునకు, ఉత్తరము నుండి దక్షిణ/పడమరలకు మొత్తం 37 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, అదేవిధముగా తూర్పు నుండి దక్షిణ పడమరలకు, దక్షిణ పడమరల నుండి తూర్పు నకు 25 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు, ఇంకా తూర్పు నుండి పడమరకు, పడమర నుండి తూర్పు నకు 12 జతల మెయిల్/ఎక్స్‌ప్రెస్‌లు నడపబడు తున్నాయి.

వర్క్‌షాపులు , జనసంపద

  • ఉత్తర మధ్య రైల్వే|ఉత్తర మధ్య రైల్వేలో ఝాన్సీ, సితౌలి (గౌలియార్) వద్ద కార్ఖానాలు ఉన్నాయి.
  • ఉత్తర మధ్య రైల్వే|ఉత్తర మధ్య రైల్వేలో మొత్తం 69.644 మంది సిబ్బంది బలం ఉంది.
  • ఉత్తర మధ్య రైల్వే|ఉత్తర మధ్య రైల్వేకు ఆధునిక ఎలక్ట్రిక్ లోకో షెడ్ ఉంది. ఇంతకు ముందు రైలు ప్రమాదములో దెబ్బతిన్న మగధ్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్‌ను ఆధునిక సాంకేతికతతో ఆధునీకరించి, ఢిల్లీ నుండి హౌరా వరకు దురంతో ఎక్స్‌ప్రెస్గా నడుపు చున్నారు.

ముఖ్యమైన రైళ్ళు

ఆగ్రా కంటోన్మెంట్ - న్యూఢిల్లీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్

గ్యాలరీ

బయటి లింకులు

మూసలు , వర్గాలు