ఉత్తర 24 పరగణాలు జిల్లా

వెస్ట్ బెంగాల్ లోని జిల్లా
(ఉత్తర 24 పరగణాలు నుండి దారిమార్పు చెందింది)

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని 20 జిల్లాలలో ఉత్తర 24 పరగణాలు జిల్లా (బెంగాలీ : উত্তর চব্বিশ পরগণা জেলা) ఒకటి. ఈ జిల్లా ఉత్తర అక్షాంశం 22º11'6, 23º15'2, తూర్పు రేఖాంశం 88º20, 89º5 డిగ్రీలలో ఉపస్థితమై ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో నాడియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో బంగ్లాదేశ్ (ఖుల్నా విభాగం), దక్షిణ సరిహద్దులో దక్షిణ 24 పరగణాలు, కొలకత్తా, పశ్చిమ సరిహద్దులో హౌరా, హుగ్లీ జిల్లాలు ఉన్నాయి. జిల్లాకు బారాసాత్ పట్టణం కేంద్రంగా ఉంది. ఈ జిల్లా పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా జనసంఖ్య కలిగిన జిల్లాగా గుర్తించబడుతుంది.[2] వైశాల్యపరంగా ఈ జిల్లా రాష్ట్రంలో 10 వ స్థానంలో ఉంది. అలాగే జనసంఖ్యా పరంగా ఈ జిల్లా దేశంలో 2 వ స్థానంలో ఉంది.[2] ఇది కోల్‌కాతా మెట్రోపాలిటన్ ప్రాంతంలో భాగంగా ఉంది.

North 24 Parganas (24 PGS N) జిల్లా
উত্তর চব্বিশ পরগণা জেলা
West Bengal పటంలో North 24 Parganas (24 PGS N) జిల్లా స్థానం
West Bengal పటంలో North 24 Parganas (24 PGS N) జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంWest Bengal
డివిజనుPresidency
ముఖ్య పట్టణంBarasat
Government
 • లోకసభ నియోజకవర్గాలుBangaon, Barrackpore, Dum Dum, Barasat, Basirhat
 • శాసనసభ నియోజకవర్గాలుBagda, Bangaon Uttar, Bangaon Dakshin, Gaighata, Swarupnagar, Baduria, Habra, Ashoknagar, Amdanga, Bijpur, Naihati, Bhatpara, Jagatdal, Noapara, Barrackpore, Khardaha, Dum Dum Uttar, Panihati, Kamarhati, Baranagar, Dum Dum, Rajarhat New Town, Bidhannagar, Rajarhat Gopalpur, Madhyamgram, Barasat, Deganga, Haroa, Minakhan, Sandeshkhali, Basirhat Dakshin, Basirhat Uttar, Hingalganj
విస్తీర్ణం
 • మొత్తం4,094 కి.మీ2 (1,581 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం1,00,82,852
 • జనసాంద్రత2,500/కి.మీ2 (6,400/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత84.95 percent[1]
 • లింగ నిష్పత్తి949
ప్రధాన రహదార్లుNH 34, NH 35
సగటు వార్షిక వర్షపాతం1579 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

చరిత్ర

మార్చు

పురాతన చరిత్ర

మార్చు
 
The Baraha-mihir or Khana-mihir mound at Berachampa. It was first excavated in 1956-57 revealing a continuous sequence of cultural remains from 11th century BC pre-Mouryan period to 12th century AD Pala period.[3]

ప్టోమ్లి భౌగోళిక పరిశోధనాంశాలను అనుసరించి సా.శ. 2వ శతాబ్దంలో పురాతన గంగారిది ప్రాంతం భాగీరధి, హుగ్లీ (దిగువ ప్రాంతం), పద్మా-మెఘ్న నదుల మద్య విస్తరించి ఉందని వివరిస్తుంది. పూర్వపు పౌరాణిక రాజ్యంలో ప్రస్తుత ఉత్తర 24 పరగణాలు జిల్లా ప్రాంతం దక్షిణ, ఆగ్నేయ ప్రాంతంలో ఉందని తెలుస్తుంది. బెరచంపా, దేగంగా గ్రామాలలో పురాతత్వపరిశోధనలు ఈ ప్రాంతం గుప్తరాజుల చేత నేరుగా పాలించబడలేదని తెలుస్తుంది. గుప్తరాజులు సంస్కృతీ ప్రభావం ఈ ప్రాంతం మీద పడలేదని భావిస్తున్నారు. హూయంత్సాంగ్ (770-810) భరతదేశయాత్ర కాలంలో ఈ ప్రాంతంలోని 30 బౌద్ధవిహారాలను, 100 హిందూ ఆలయాలను సందర్శించాడని వాటిలో కొన్ని గ్రేటర్ 24 పరగణాల ప్రాంతంలో ఉన్నాయని తెలుస్తుంది. జిల్లా శశాంక సమైక్య బెంగాలి సామ్రాజ్యంలో లేదని తెలుస్తుంది. అయినప్పటికీ ఈ ప్రాంతం పురాతన బెంగాలీ ప్రాంతంలోని నైరుతీ భూభాగంలో ఉండేదని భావిస్తున్నారు. అలాగే ధర్మపాల (770-810) పాలనలో ఉండేదని తెలుస్తుంది. ఈ ప్రాంతపు త్రవ్వకాలలో ధర్మపాలా పాలనా సంబంధిత చిహ్నాలేవీ లభించలేదు. అయినా సేనా శిల్పాలు లభించడంతో ఈ ప్రాంతంలో ధర్మపాలనా పాలన శక్తివంతంగా లేదని భావిస్తున్నారు.

 
  
  
 

మద్యయుగం

మార్చు

16వ శతాబ్దం ఆరంభంలో పోర్చుగీసు నావికులు పలుజలమార్గాలలో దాడి, దోపిడీ ఆరంభించారు. అలాగే దిగువ నదీమైదానాలలో నివాసాలు ఏర్పాటుచేసుకున్నారు. హత్య, అత్యాచారం, పట్టుకుని బానిసలుగా అమ్మబడడం వంటి హింసలకు భయపడి ప్రజలు వారికి దూరంగా ఉంటూ వచ్చారు. ఉత్తర 24 పరగణాలకు చెందిన బసిర్హత్ ఉపవిభాగంలో ప్రజలు ఈ హింసకు గురి అయ్యారు.

ఆలయాలు , మసీదులు

మార్చు

మహారాజా ప్రతాపాదిత్య జషోరేశ్వరి కాలి ఆలయాన్ని నిర్మించాడు. ఈశ్వరీపూర్ వద్ద ఉన్న చందా భైరబ్ మందిర్ (పిరమిడ్ ఆకార ఆలయం) సేనా పాలనా కాలంలో నిర్మించబడింది. మొగల్ పాలనా సమయంలో బంషీపూర్ వద్ద నిర్మించబడిన " ఐదు గోపురాల టంగా మసీదు ", 1593లో మహారాజా బంగ్షిపూర్ వద్ద నిర్మించిన 2 పెద్దవి 4 చిన్న గోపురాలతో నిర్మించబడిన హమ్మంఖానా, కాంపూర్ వద్ద ఉన్న జహాజ్ఘటా రేవు జిల్లాలోని ప్రధానమైన నిర్మాణాలుగా గుర్తించబడుతున్నాయి.

మాహారాజా ప్రతాపాదిత్య

మార్చు

జెసోర్ రాజు ప్రతాపాదిత్య అలాగే బెంగాల్ బారా- భూయుయాన్లలో ఒకడు. 17వ శతబ్ధంలో ప్రతాపాధిత్య మొగల్ చక్రవర్తుల సైన్యాలతో పోరాడాడు. ఆయన తండ్రి శ్రీహరి (శ్రీధర్) కాయస్తుడు. దావూద్ ఖాన్ కర్రాని ఆస్థానంలో పలుకుబడి కలిగిన అధికారిగా ఉండేవాడు. దావూద్ పతనం తరువాత ఆయన ప్రభుత్వ ఖజానాతో పారిపోయాడు. 1574లో కుల్నా జిల్లాకు దక్షిణంగా చిత్తడి భూములలో శ్రీహరి స్వయంగా రాజ్యాన్ని స్థాపించి మహారాజా బిరుదును స్వీకరించాడు. 1574లో మహారాజా శ్రీహరి తరువాత ఆయన తనయుడు మహారాజ పదవిని స్వీకరించాడు. బహరుస్థాన్ యాత్రికుడు అబ్దుల్ లతీఫ్, సమకాలీన రచయుతలు అందరూ ప్రతాపాదిత్య శక్తిసామర్ధ్యాలకు, ఆయన రాజకీయ ఔన్నత్యానికి, వస్తు సంపదకు, బలమైన యుద్ధనౌకా సామర్ధ్యానికి సాక్ష్యంగా నిలిచారు. ప్రస్తుత గ్రేటర్ జెస్సోర్, ఖుల్నా, బారిసల్ జిల్లాలు ఒకప్పటి మహారాజా ప్రతాపాదిత్య రాజ్యంలో భాగంగా ఉండేది. ఆయన జమునా, ఇచ్చామతీ నదుల సంగమస్థానంలో వ్యూహాత్మకంగా ధూంఘాట్‌ను తన రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు.

మొగల్ పాలకులతో యుద్ధం

మార్చు

బెంగాల్ జమీందార్లలో ఒకరైన ప్రతాపాధిత్య మొదటగా ఇస్లాం ఖాన్ చిస్తి వద్దకు విలువైన కానుకలో దూతను పంపాడు. మొగలు ప్రభుత్వ అనుకూలత కొరకు చేసిన ఈ ప్రయత్నం ఫలితంగా 1609లో ఆయన సుబేదార్ అయ్యాడు. ముసాఖానుకు వ్యతిరేకంగా సాగించే పోరులో సైనికసహాయం, ఇతరసేవలు అందిస్తానని ప్రతాపాధిత్య ఇస్లాం ఖాన్ చిస్తికు మాట ఇచ్చాడు. అయినా ఆ మాట మాత్రం నిలువలేదు. ప్రతాపాధిత్య విశ్వసరాహిత్యానికి దండనగా ఘియాస్ ఖాన్ ఆధిపత్యంలో బృహత్తర దాడిసల్పి ఈ ప్రాంతాన్ని స్వాధీనపరచుకున్నారు. తరువాత జమున, ఇచ్చామతి నదీ సంగమంలో ఉన్న ఈ ప్రాంతానికి 1611 సల్కా అని నామకరణం చేయబడింది. తరువాత ప్రతాపాదిత్య ఫెరింగ్స్, ఆఫ్గనీయులు, పఠానుల సాయంతో బలమైన సైన్యాలను ఏర్పరచుకున్నాడు. ఆయన పెద్దకుమారుడు ఉదయాదిత్య సల్కా వద్ద సహజసిద్ధమైన సరిహద్దులలో నిర్భేద్యమైన కోటను నిర్మించాడు. తరువాత జరిగిన యుద్ధంలో ఉదయాదిత్య సైన్యం ముందుగా విజయపథంలో సాగినప్పటికీ తరువాత సామ్రాజ్యానికి చెందిన సైన్యం ఉదయాదిత్య సైన్యంలో ఐకమత్యాన్నీ, క్రమశిక్షణను చెడగొట్టి ఉదయాఫిత్యపై విజయం సాధించాయి. నిస్సహాయుడైన ఉదయాదిత్య తండ్రితో కోటను విడిచి పారిపోయాడు. తరువాత జమాల్ఖాన్ కోటను ఖాళీ చేసి ఉదయాదిత్యను అనుసరించాడు.

ప్రతాపాదిత్య ద్వితీయ పోరాటం

మార్చు

కాగర్ఘాట్ కాలువ, జమునా నది సంగమంలో ప్రతాపాదిత్య రెండవసారి పోరాటం చేయడానికి సిద్ధం అయ్యాడు. అక్కడ ఆయన వ్యూహాత్మకంగా పెద్ద కోటను నిర్మించి తనకు అనుకూలంగా పెద్ద సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. 1612లో ప్రతాపాదిత్య మీద దాడిచేసి ఆయనను కోటలో నిర్బంధించారు. తరువాత చక్రవర్తి సైన్యం జెస్సోరును పూర్తిగా ఓడించి కోటను స్వాధీనం చేసుకుని ప్రతాపాదిత్యను బంధీకృతుని చేసాయి. గియాస్‌ఖాన్ ప్రతాపాదిత్యను ఢాకాలో ఉన్న ఇస్లాం ఖాన్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఇస్లాం ఖాన్ జెస్సోర్ రాజును బంధించి జెస్సోర్ రాజ్యాన్ని స్వాధీనపరచుకున్నాడు. తరువాత ప్రతాపాదిత్య ఢాకాకారాగారంలో చాలాకాం ఉన్నడు. తరువాత ప్రతాపాదిత్య చివరిదశ తెలియనప్పటికీ ఢిల్లీకి వెళ్ళేదారిలో వారణాశి వద్ద మరణించినట్లు భావిస్తున్నారు [4]

బ్రిటిష్ రాజ్

మార్చు

మొగల్ పాలనా సమయంలో గ్రేటర్ 24 పరగణాలు సాత్గయోన్ (పురాతన సప్తగ్రాం ప్రస్తుతం ఇది హుగ్లీ జిల్లాలో ఉంది ) ఆధ్వర్యంలో ఉండేది. మొగలాయీ పాలన తరువాత " ముర్షిద్ ఖులీ ఖాన్ " పాలనా కాలంలో ఇది హుగ్లీ చక్లాలో కలుపబడింది. 1717లో ప్లాసే యుద్ధం తరువాత నవాబు మిర్ జఫర్ జమీందార్ 24 పరగణాలు (ఈ అమీర్పూర్, అక్బర్పూర్, బలియావర్ బిరతి అజిమాబాదు, బసంధరి, బరిధతి బగ్జోలా కాళికటా, ఘర్, హతియాగర్, ఇస్లాంపూర్, దక్షిణ సాగర్, ఖరిజురి, ఖాస్పూర్, ఇక్తియార్పూర్, మగురా, మెదన్మల్లా మైదా, మాన్పుర్కు, బరాసత్, మురగచ్చ, పెచకులి, పైకాన్, రాజర్హత్, షాపూర్, షహ్నగర్, సతల్, న్యూ బర్రక్పూర్ ఆహారంపూర్, ఉత్తర పరగణా), జంగలిమహల్స్ (చిన్న పాలనా విభాగాలు)ను బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ పరం చేసాడు.

అప్పటి నుండి ఇవి 24 పరగణాలు అని పిలువబడుతున్నాయి.

జాన్ జెఫనియా హోవెల్

మార్చు

1751లో ఈస్టిండియా కంపనీ " జాన్ జెఫనియా హోవెల్ " జమీందారుగా నియమించింది.[5] 1759లో ప్లేసేయుద్ధం తరువాత 1756-57 రాబర్ట్ క్లైవ్ (లార్డ్ క్లైవ్) జమీందారు ( జాగీరు) గా నియమించబడ్డాడు. అయన మరణం తరువాత ఈ ప్రాంతం నేరుగా బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చింది.

లార్డ్ కార్న్‌వాల్

మార్చు

1793లో " లార్డ్ కార్న్‌వాలిస్ " పాలనా సమయంలో సుందర్బన్ ప్రాంతం మొత్తం 24 పరగణాలలో చేరింది. 1802లో హుగ్లీ నది పశ్చిమ తీరం కూడా ఇందులో చేచబడింది. ఈ పరగణాలు ముందుగా నాడియా జిల్లాలో ఉండేవి. 1814లో 24 పరగణాలకు ప్రత్యేక కలెక్టర్ కార్యాలయం ఏర్పాటుచెయ్యబడింది. 1817లో ఫాల్టా, బారానగర్, 1820లో నాడియాలోని బలాండా, అన్వర్పూర్‌లు కూడా ఈ ప్రాంతంతో చేచబడ్డాయి. బారాసాత్, ఖుల్నా, బకర్గంజ్ (ప్రస్తుతం ఇవి బంగ్లాదేశ్లో ఉన్నాయి) కూడా ఈ ప్రాంతంతో కలుపబడ్డాయి. 1824లో జిల్లా కేంద్రం కొలకత్తా నుండి బరుయీపూర్‌కు మార్చబడింది తరువాత ఇది అలిపూర్‌కు తరలించబడింది. 1834 ఈ జిల్లాను రెండుగా (అలిపూర్-బారాసాత్) విభజించబడింది. అయినప్పటికీ తరువాత ఇది ఒకటిగా చేయబడింది. 1905లో ఈ జిల్లాలోని సుందర్బన్ సమీపప్రాంతంలో కొంతభాగం విడదీసి ఖుల్నా, బరిషల్ ప్రాంతాలతో కలుపబడింది. ఈ భూభాగాలు 1947 భారత్, పాక్ విభనన తరువాత ముందు పాకిస్థాన్ తరువాత బంగ్లాదేశ్లో భాగంగా మారాయి.

స్వతంత్రం తరువాత

మార్చు

1993లో డాక్టర్ అశోక్‌మిత్రా ఆధ్వర్యంలోని కమిటీ ఈ జిల్లాను రెండుగా విభజించాలని సూచించింది. తరువాత ఈ ప్రాంతం దక్షిణ 24 పరగణాలు, ఉత్తర 24 పరగణాలు జిల్లాలుగా విభజించబడింది. ఉత్తర 24 పరగణాలులో ప్రెసిడెన్సీ విభాగం 5 సబ్డివిషన్లుగా ( బరసాత్ (జిల్లాకేంద్రం), బర్రాక్పోర్, బసిర్హత్, బంగయోన్, బిదన్నగర్ ( కొలకత్తా శాటిలైట్ టౌన్‌షిప్‌గా గుర్తించబడుతుంది. దీనిని సాల్ట్ సిటీ అని కూడా అంటారు)) విభజించబడ్డాయి.

భౌగోళికం

మార్చు

ఉత్తర 24 పరగణాలు జిల్లా గంగా - బ్రహ్మపుత్ర నదీ మైదానం మద్య ఉపస్థితమై ఉన్నాయి. జిల్లా పశ్చిమ తీరం మొత్తం గంగానది ప్రవహిస్తుంది. జిల్లాలో ఇచ్చామతి, జమున, బిద్యాధరి నదులు ప్రవహిస్తున్నాయి.

ప్రాంతం

మార్చు

అక్ష్క్షాంశం: 23°15'ఉత్తర - 22°11' ఉత్తర
రేఖాంశం: 89°5'తూర్పు - 88°20'తూర్పు

  • నల్లరేగడి, బంకమట్టి నేలలు.
  • 17% భూమి ఎగువగానూ, 44% మద్యరంకం భూమిగానూ, 39% భూమి దిగువ భూమిగానూ ఉంది.

ఆర్సెనిక్ కలుషిత భూగర్భజలాలు

మార్చు

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్సెనిక్ పాషాణంతో కలుషితమైన భూగర్భజాలున్న 7 జిల్లాలలో (కొలకత్తాతో సహా) ఉత్తర 24 పరగణాలు జిల్లా ఒకటి. జాదవ్పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన " స్కూల్ ఆఫ్ ఎంవిరాన్మెంటల్ స్టడీస్ " సర్వే అనుసరించి జిల్లాలోని 22 మండలాలలో 16 మండలాలలో ఆర్సెనిక్ కలుషిత భూగర్భజలాలు ఉన్నాయని తెలుస్తుంది. బదురియా మండలంలో అత్యధికంగా ఆర్సెనిక్ కలుషిత భూగర్భజలాలు ఉన్నాయని భావిస్తున్నారు.

వాతావరణం

మార్చు

జిల్లాలో మిగిలిన బెంగాల్ పశ్చిమ బెంగాల్ గంగానదీ మైదానంలో ఉష్ణమండల వాతావరణం నెలకొని ఉంది. ఈ ప్రాంతంలో జూన్ మాసం నుండి సెప్టెంబరు మాసం వరకు వర్షపాతం ఉంటుంది. వాతావరణం శీతాకాలంలో పొడిగానూ వేసవికాలంలో తేమగానూ ఉంటుంది.

  • వార్షిక వర్షపాతం 1,579మి.మీ (సాధారణం)
  • ఉష్ణోగ్రత 41° సెల్షియస్ మే మాసంలో (అత్యధికం), 10°సెల్షియస్ జూన్ మాసంలో (అల్పం)
  • గాలిలో తేమ 50% మార్చి మాసంలో & 90% జూలై మాసంలో

ఆర్ధికం

మార్చు

ముస్లిములు సాధారణంగా తోటలు, మత్స్య పరిశ్రమను జివనోపాధిగా ఎంచుకున్నారు. జిల్లా ప్రజల సరాసరి వ్యవసాయ భూమి 3.2 బిఘాలు. పరిశ్రలలో పనిచేసే వారిలో అత్యధికంగా బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్ధులు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆర్థికంగా తక్కువగా వెనుకబడిన జిల్లాలలో ఉత్తర 24 పరగణాలు ఒకటి. జిల్లా దక్షిణ భూభాగంలో ఉన్న సుందర్బన్ ప్రాంతంలో దీర్ఘకాలిక పేదరికం ఉందని భావిస్తున్నారు.

 
Omega and Infinity Benchmark, office buildings in Salt Lake, Kolkata
 
The Bengal Intelligent Park in Sector V.
 
The Cognizant Technology Solutions office in Sector V.

ఈ జిల్లా కొలకత్తా సమాచార సాంకేతిక కేద్రంగా ఉంది. జిల్లాలో గుర్తించతగిన ఐటి కంపనీలు, బహుళజాతి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలలో దాదాపు 1.2 లక్షల మంది పనిచేస్తున్నారు.

విభాగాలు

మార్చు

ఉపవిభాగాలు

మార్చు
  • జిల్లా ఐదుగురు ఉపవిభాగాలు ఉన్నాయి బర్రక్పూర్, బరాసత్ సదర్, బసీర్హాట్,బిదన్నగర్, బంగయొన్:
  • బర్రక్పూర్ ఉపవిభాగం:- 16 మున్సిపాలిటీలు (కాంచ్‌రాపారా, హలిసహర్, నైహతి, భాత్పరా, గరులియా, బర్రక్పూర్, ఉత్తర బర్రక్పూర్, న్యూ బర్రక్పూర్, తితాగర్, కర్దహ, పానీహాతి,

కామర్హతి, బరానగర్, దమ్ దం, ఉత్తర డండం, దక్షిణ డండం), రెండు కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్: బర్రక్పూర్, బర్రక్పూర్-1,, 2.

  • బరాసత్ సదర్ ఉపవిభాగం :- 7 కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్: (హబ్రా, రాఝర్హాత్ గోపాల్పూర్, అషోక్నగర్ కల్యాణ్గర్, మద్యంగ్రాం, గోబర్దాంగా, బరాసత్) 6 మునిసిపాలిటీలు : బరాసత్-1, బరాసత్-2, అండంగ, దేగంగ, హబ్రా-1, హబ్రా-2, రాజర్హత్.
  • బంగయాన్ ఉపవిభాగం :- బంగయాన్ పురపాలకం, 3 సమాజ అభివృద్ధి బ్లాకులను (బగ్ద, బంగయాన్, గైహత ) కలిగి ఉంటుంది.
  • బసీర్హాట్ ఉపవిభాగం :- 3 మున్సిపాలిటీలను కలిగివుంది (బసీర్హాట్, బదురియా, తకి (భారతదేశం)), పది కమ్యూనిటీ అభివృద్ధి బ్లాక్స్: బదురియా, బసీర్హాట్-1, బసీర్హాట్ -2, హరోయా, హస్నాబాద్, హింగల్గంజ్, మినఖాన్, సందేష్ఖలి, సందేష్ఖలి-1,, సందేష్ఖలి-2, Swarupnagar.
  • బిదన్నగర్ ఉపవిభాగం :- బిదన్నగర్ పురపాలకం, 3 కలిగి ఉంది.[6]
  • జిల్లాకు కేంద్రంగ బరాసత్ పట్టణం ఉంది. జిల్లాలో 35 పోలీస్ స్టేషన్లు, 22 డెవెలెప్మెంటు బ్లాకులు, 27 పురపాలకాలు, 200 గ్రామపనాయితీలు, 1599 గ్రామాలు ఉన్నాయి.[6][7]

పురపాలకాలే కాక ఒక్కొక విభాగంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలుగా విభజించబడిన మండలాలు ఉన్నాయి. జిల్లాలో మొత్తంగా 48 నగరప్రాంతాలు, 27 పురపాలకాలు, 20 పట్టణాలు, 1 కంటోన్మెంటు ఉన్నాయి. [7][8]

బర్రక్పూర్ ఉపవిభాగం

మార్చు
  • పదహారు మున్సిపాలిటీలు: కాంచ్రాపారా, హలిషర్, నైహతి, భత్పరా, గరులియా, బర్రక్పూర్, ఉత్తర, న్యూ బర్రక్పూర్, తితహ్హర్, ఖర్దహ, పానిహత్, కమర్హతి, బరనగర్, దమ్ దమ్, ఉత్తర డండం, దక్షిణ డండం.[9]
  • ఒక కంటోన్మెంటు బోర్డు:- బర్రాక్పోర్ కంటోన్మెంటు
  • బర్రాక్పోర్ -1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బర్రాక్పోర్ -2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు, 6 పట్టణాలు ( జాఫర్పూర్, తాల్బంధ, మురగచ్చ, పతుల, రుయియ, చంద్పుర్ (గోల)) ఉన్నాయి.
  • అదనంగా ఒక పట్టణం :- ఇచ్చాపూర్ డిఫెంస్ ఎస్టేట్.

బరసాత్ సాదర్ ఉపవిభాగం

మార్చు
  • 6 పురపాలకాలు : బరాసత్, హబ్రా, రాజర్హత్ గోపాల్పూర్, అశోక్నగర్ కల్యాణ్గర్, మాధ్యంగ్రాం, గోబర్దంగ.
  • బర్సాత్-1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బర్సాత్ - 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • అందంగ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • డేగనగ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 13 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హబ్రా -1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హబ్రా-2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు, ఒక పట్టణం ఉన్నాయి.
  • రాజర్హత్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 6 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు, పట్టణం ( రాయ్గచ్చి) ఉన్నాయి.

బంగన్ ఉపవిభాగం

మార్చు
  • ఒక పురపాలకం: బంగన్
  • బగ్దహ్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో .. గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బంగన్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 16 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • గైగత కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 13 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు 3 (సోనాతికిరి, చక్కత్, ధకురియా (ఉత్తర 24 పరగణాలు) పట్టణాలు ఉన్నాయి.

బసిహత్ ఉపవిభాగం

మార్చు
  • 3 పురపాలకాలు :- బసిర్హత్, బదురియా, టాకీ (ఇండియా).
  • బదురియా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 14 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బసిరిహత్ - 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 7 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • బసిరిహత్ - 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలు, ఒక పట్టణం (ధన్యకురియా) న్నాయి.
  • హరోయా కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హస్నాబాద్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • హింగల్గంజ్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 9 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • మినఖాన్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • సందేష్కలి - 1 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • సందేష్కలి - 2 కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 8 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.
  • స్వరూప్నగర్ కమ్యూనిటీ డెవెలెప్మెంటు బ్లాకులో 10 గ్రాపంచాయితీలతో కూడిన గ్రామీణ ప్రాంతాలున్నాయి.

బిధన్నగర్ ఉపవిభాగం

మార్చు

ఈ ఉపవిభాగంలో నగరప్రాంతం మాత్రమే ఉంది:[6] బిదన్నగర్ పురపాలకం.

అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

జిల్లా 28 విభజించబడింది శాసనసభ నియోజకవర్గాలు:

  1. బగద (విధాన సభ నియోజకవర్గం) బగదహ (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 84.),
  2. బంగోన్ ఉత్తర (విధాన సభ నియోజకవర్గం) బంగోన్ (. శాసనసభ నియోజకవర్గం ఏ 85),
  3. గైగత (విధాన సభ నియోజకవర్గం) గైగత (. శాసనసభ నియోజకవర్గం ఏ 86),
  4. హబ్రా (విధాన సభ నియోజకవర్గం) హబ్రా (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 100),
  5. అశోక్నగర్ (విధాన సభ నియోజకవర్గం) అశోక్నగర్ (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 101),
  6. అందానగర్ (విధాన సభ నియోజకవర్గం) అందానగర్ (. శాసనసభ నియోజకవర్గం ఏ 89),
  7. బరాసత్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 90),
  8. రాజర్హత్ గోపాల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ)]] (. శాసనసభ నియోజకవర్గం ఏ 91),
  9. దేగంగ (విధాన సభ నియోజకవర్గం) డేగనగ (. శాసనసభ నియోజకవర్గం ఏ 92),
  10. స్వరూప్ నగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 93),
  11. బదురియా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 94),
  12. బసీర్హాట్ ఉత్తర (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 95),
  13. హస్నాబాద్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 96),
  14. హరోరా (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 97),
  15. సందేష్కలి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 98),
  16. హింగల్గని (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 99),
  17. బీజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం 128),
  18. నైహతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 129),
  19. భత్పర (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 130),
  20. జగత్దల్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 131),
  21. నోయాపరా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 132),
  22. తితగర్హ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 133),
  23. కర్దహ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 134),
  24. పనిహతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 135),
  25. కమర్హతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 136),
  26. బరానగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 137)
  27. దమ్ దమ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 138),
  28. తూర్పు బెల్గచియా ప్రాచ్యం (. శాసనసభ నియోజకవర్గం ఏ 139).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

మార్చు
  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- బగ్దహ, రాజర్హత్, హరోయా, సందేష్ఖలి, హింగల్గంజ్.
  • బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గం :- బగ్దహ, బంగయోన్, గైఘట, హబ్రా, అషోక్‌నగర్, బరాసత్, దేగంగా.
  • బర్రక్‌పోర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- అందంగా, బీజ్పూర్, నైహతి, భాత్పరా, జగత్దల్, టిటాగర్, నొయాపరా.
  • డండం పార్లమెంటరీ నియోజకవర్గం :- రాజర్హాత్, ఖర్దాహ్, పనిహతి, కామర్హతి, బర్నాగర్, డండం, తూర్పు బెల్గచియా.
  • బసిర్హత్ పార్లమెంటరీ నియోజకవర్గం :-స్వరూప్నగర్, బదురియా, బసిర్హాత్, హస్నాబాద్, హరోయా, హింగల్గంజ్. దక్షిణ 24 పరగణాలు జిల్లా నుండి 1 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.
  • జాయ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గం :-సందేష్ఖాలి, దక్షిణ 24 పరగణాలు జిల్లా నుండి 6 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.

పునర్విభజన తరువాత అసెంబ్లీ నియోజకవర్గాలు

మార్చు

పశ్చిమ బెంగాల్ డిలిమినేషన్ ఆఫ్ కంసిస్టెన్సీస్ సిఫారుసుతో డిలిమినేషన్ కమిషన్ " ఆదేశానుసారం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోని నియోజకవర్గాల పునర్విభజన తరువాత జిల్లా 34 శాసనసభ నియోజకవర్గాలుగా విభజించబడింది. [10]

  1. బగద (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ)]] (. శాసనసభ నియోజకవర్గం ఏ 94),
  2. ఉత్తర బగద (విధాన సభ నియోజకవర్గం) | Bangaon ఉత్తర (ఎస్సీ)]] (. శాసనసభ నియోజకవర్గం ఏ 95),
  3. దక్షిణ బంగోన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 96),
  4. గైఘత (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 97),
  5. స్వరూప్నగర్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 98),
  6. బదురియా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 99),
  7. హబ్రా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 100),
  8. అశోక్నగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 101),
  9. అందంగ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 102),
  10. బీజ్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 103),
  11. నైహతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 104),
  12. భాత్పరా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 105),
  13. జగత్దల్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 106),
  14. నొయాపరా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 107),
  15. బర్రక్పూర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 108),
  16. ఖర్దహ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 109),
  17. ఉత్తర దమ్ దమ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 110),
  18. పనిహతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 111),
  19. కమర్హతి (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 112),
  20. బరానగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 113)
  21. దమ్ దమ్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం సంఖ్య 114),
  22. రాజర్హత్ న్యూ టౌన్ (విధాన సభ నియోజకవర్గం) న్యూ టౌన్]] (. శాసనసభ నియోజకవర్గం ఏ 115),
  23. బిదన్నగర్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 116)
  24. రాజర్హత్ గోపాల్పూర్ (విధాన సభ నియోజకవర్గం) గోపాల్పూర్]] (. శాసనసభ నియోజకవర్గం ఏ 117),
  25. మద్యంగ్రాం (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 118)
  26. బరాసత్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 119),
  27. దేగంగా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 120),
  28. హరోరా (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 121),
  29. మినక్కన్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 122),
  30. సందేష్ఖలి (విధాన సభ నియోజకవర్గం) (ఎస్టీ) (. శాసనసభ నియోజకవర్గం ఏ 123),
  31. దక్షిణ బసీర్హాట్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 124),
  32. ఉత్తర బసీర్హాట్ (విధాన సభ నియోజకవర్గం) (. శాసనసభ నియోజకవర్గం ఏ 125),
  33. హింగల్గంజ్ (విధాన సభ నియోజకవర్గం) (ఎస్సీ) (శాసనసభ నియోజకవర్గం ఏ 126.).

షెడ్యూల్డ్ జాతి , షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు

మార్చు
  • షెడ్యూల్డ్ జాతి, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ నియోజకవర్గాలు :- సందేష్‌ఖాలి,బగ్దహ, ఉత్తర బంగయోన్, గైఘట, స్వరూప్‌నగర్, మినఖాన్, హింగల్గంజ్.
  • బంగోయాన్ పార్లమెంటరీ నియోజకవర్గం :- బగ్దహ, ఉత్తర బంగయోన్, గైఘట, స్వరూప్‌నగర్, నాడియా జిల్లా నుండి 2 శాసనసభ నియోజకవర్గాలతో చేర్చి. శాసనసభ నియోజక వర్గాలు.
  • బర్రాక్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గం :- అందంగ, బీజ్పూర్, నైహతి, భాత్పర, జగత్దల్, నొయాపరా, బర్రాక్‌పూర్.
  • డండం పార్లమెంటరీ నియోజకవర్గం :- కర్దాహ్,ఉత్తర డండం, పానీహతి, కామర్హతి, బారానగర్, డండం, రాజర్హత్, గోపాల్పూర్.
  • బరాసత్ పార్లమెంటరీ నియోజకవర్గం :- హబ్రా, అషోక్నగర్, రాజర్హత్ న్యూ టౌన్, బిదన్నగర్, మద్యంగ్రాం, బరాసత్, దేగంగా.
  • బసిర్హత్ పార్లమెంటరీ నియోజకవర్గం :- బదురియా, హరోరా, మినఖాన్, సందేష్ఖలి, ఉత్తర బసిర్హత్, హింగల్గంజ్.

ప్రయాణ వసతులు

మార్చు

రైల్వేలు

మార్చు
 
Kolkata Suburban EMU Train

సౌత్ ఈస్టర్న్ రైల్వే, ఈస్ట్ రైల్వేకి చెందిన "కొలకత్తా సబర్బన్ రైల్వే " కొలకత్తా పొరుగున ఉన్న జిల్లాలకు (దక్షిణ 24 పరగణాలు]], నాడియా, హౌరా, హుగ్లీ మొదలైనవి) రైల్వే సర్వీసులను అందిస్తుంది. " కొలకత్తా సర్క్యులర్ రైల్వే " కొలకత్తా నగరమంతా రైల్వేసేవలను అందిస్తుంది. విమానాశ్రయాన్ని కలుపుతూ కొత్తరైల్వే లైను నిర్మించబడుతుంది. డండం, ఉత్తర 24 పరగణాల నుండి సీల్దాహ్ రైలుమార్గం ఆరభం అయింది.

విమానాశ్రయం

మార్చు
 
Cityside view of the new Integrated Terminal of Netaji Subhash Chandra Bose International Airport

కొలకత్తా నగరంలో ఉన్న ఒకేఒక విమానాశ్రయం " ది నేతాజి సుభాష్ బోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ " . ముందు దీనిని డండం విమానాశ్రయం. డొమెస్టిక్, అనర్జాతీయ విమానసేవలను అందిస్తున్న ఈ విమానాశ్రయం ఉత్తర 24 పరగణాలు జిల్లాలోనే ఉంది. ఉత్తర ఈశాన్య ప్రాంతం, బాంకాక్, బంగ్లాదేశ్ కులకు ఇది ముఖద్వారంగా ఉంది.

బస్ గమ్యస్థానం

మార్చు
  • బఫురియా,
  • బగుయిహతి,
  • బంగోన్, బంగూర్ అవెన్యూ, చినార్ పార్క్, బర జంగులి,
  • బరాసత్,
  • బమంగచ్చి,
  • దుత్తపుకుర్,
  • బర్రక్పూర్, బెరచంపా, బసీర్హాట్, క్లైవ్ హౌస్, దమ్ దమ్ విమానాశ్రయం, దమ్ దమ్ కంటోన్మెంట్ రైల్వే స్టేషను, దమ్ దమ్ పార్క్, దమ్ దమ్ రైల్వే స్టేషను, ఘొలా,
  • గౌరీపూర్,
  • హబ్రా,
  • హకింపూరు,
  • హరోరా (కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాక్),
  • హస్నాబాద్, హతియారా,
  • ఇతిందాఘాట్,
  • కచరపరా,
  • కాళింది, ఖరిబరి,
  • లేక్ టౌన్,
  • మద్యంగ్రాం,
  • నాగర్బజార్, పరథపూర్, పతర్ఘట, రహర, సంగ్రాం పూర్ (వెస్ట్ బెంగాల్), తక్దరి ప్

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య. 10.082.852,
ఇది దాదాపు. బొలివియా దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని. మిచిగాన్ నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 2 వ స్థానంలో ఉంది.
1 చ.కి.మీ జనసాంద్రత. 2463
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12,86%
స్త్రీ పురుష నిష్పత్తి. 949: 1000
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 84,95%
జాతియ సరాసరి (72%) కంటే.

2001:

  • జనసాంధ్రత: 2959 చ.కి.మీ
  • స్తీ: పురుషులు: - 982: 1000
  • దశాబ్ద అభివృద్ధి: 24,64%
  • అక్షరాస్యతా శాతం: 87,66% (పశ్చిమ బెంగాలులో అత్యధికం) [11]
  • పురుషులు: 93,14; స్త్రీలు: 81,81

హిందువులు - 75,23%, ముస్లిములు - 24.22%, క్రైస్తవులు, సిక్కులు -0,23% - 0.12%. మొత్తం ప్రజలలో బంగ్లాదేశ్ దేశ హిందూ శరణార్ధులు 42%.

వృక్షజాలం , జంతుజాలం

మార్చు

1984లో ఉత్తర 24 పరగణాలు జిల్లాలో 1330 చ.కి.మీ వైశాల్యంలో " సునరబంస్ నేషనల్ పార్క్ " స్థాపించబడింది. [12] జిల్లా ఈ పార్కును దక్షిణ 24 పరగణాలు జిల్లాతో పంచుకుంటుంది. అంతేగాక జిల్లాలో 1985లోం .6చ.కి.మీ వైశాల్యంలో " బిభుతిభూషన్ విల్డ్‌లైఫ్ శాక్చ్యురీ " ఏర్పాటుచేయబడింది.[12]

ఎడ్యుకేషన్

మార్చు
  • ప్రాథమిక పాఠశాల 3199
  • మధ్య పాఠశాల 26163
  • ఉన్నత పాఠశాల 204560
  • హయ్యర్ సెకండరీ స్కూల్ 153
  • డిగ్రీ కళాశాల 237
  • సాంకేతిక పాఠశాలలు & కళాశాలలు 16
  • యూనివర్సిటీ 2
  • బంధన్ స్కూల్ 2: మద్లంద్పూర్, ఖొపొటా

ఆరోగ్యం సౌకర్యాలు

మార్చు
  • 2500 పడకలతో ఉన్న జిల్లా వైద్యశాలు 10
  • 1870 పడకలతో ఉన్న సబ్ డివిజనల్ హాస్పిటల్ 14
  • 1870 పడకలు ఉన్న రాష్ట్ర జనరల్ హాస్పిటల్ 18
  • 200 పడకలతో ఉన్న ఇఎస్ఐ హాస్పిటల్ 01
  • 228 పడకలతో ఉన్న గ్రామీణ హాస్పిటల్ కే 07
  • బ్లాక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 15

మూలాలు

మార్చు
  1. http://censusindia.gov.in/2011-prov-results/prov_data_products_wb.html
  2. 2.0 2.1 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. ASI site description. Retrieved 2012-08-20.
  4. Muazzam Hussain Khan (Banglapedia)
  5. McCabe, Joseph (1920) "Holwell, John Zephaniah" A biographical dictionary of modern rationalists Watts & Co., London, pp. 356-357, p. 357 OCLC 262462698
  6. 6.0 6.1 6.2 "Directory of District, Sub division, Panchayat Samiti/ Block and Gram Panchayats in West Bengal, March 2008". West Bengal. National Informatics Centre, India. 2008-03-19. Archived from the original on 2009-02-25. Retrieved 2008-12-01.
  7. 7.0 7.1 "District at a glance". Official website of the North 24 Parganas district. Archived from the original on 2008-06-02. Retrieved 2014-07-20.
  8. "Population, Decadal Growth Rate, Density and General Sex Ratio by Residence and Sex, West Bengal/ District/ Sub District, 1991 and 2001". West Bengal. Directorate of census operations. Retrieved 2008-12-01.
  9. "Page on Barrackpore subdivision". Official website of North 24 Parganas district. Archived from the original on 2010-03-25. Retrieved 2008-12-01.
  10. "Press Note, Delimitation Commission" (PDF). Assembly Constituencies in West Bengal. Delimitation Commission. Retrieved 2008-11-21.
  11. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-21. Retrieved 2014-07-20.
  12. 12.0 12.1 Indian Ministry of Forests and Environment. "Protected areas: West Bengal". Archived from the original on 2011-08-23. Retrieved September 25, 2011.

వెలుపలి లింకులు

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు