ఉత్తానపాదుడు స్వాయంభువ మనువు కుమారుడు. ఇతని సోదరుడు ప్రియవ్రతుడు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలు. ఇతనికి సునీతి యందు ధ్రువుడు, సురుచి యందు ఉత్తముడు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి కంటే సురుచి అంటే ప్రేమ, అనురాగం ఎక్కువగా ఉండేవి. ఒకరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపై కూర్చొని ఉండగా దానిని ధ్రువుడు చూసి తాను తండ్రి తొడ ఎక్కబోతుండగా సురుచి చూసి వెర్రి నవ్వు నవ్వి నీకు తండ్రి తొడ పై ఎక్కే అధృష్టం లేదు, అదే కనుక ఉన్నట్లయితే నువ్వు నా సవతి కుమారుడిగా పుట్టి ఉండేవాడివి కాదు అని అవహేళన చేస్తుంది. అందులకు చింతాక్రాంతుడై ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. అప్పుడు సునీతి ధ్రువుడితో నాయనా కాలప్రభావం వలన నీ తండ్రి తనను దాసీ కంటే తక్కువగా చూస్తున్నాడని, శ్రీహరి పాదధ్యానము వలన జరగనివి ఉండవని స్వాయంభువ మనువు శ్రీహరిని ధ్యానించి ఉత్తమ గతి పొందాడని చెబుతుంది. అప్పుడు ధ్రువుడు శ్రీహరిని ప్రసన్నం చేసుకోవడానికి రాజధాని నుండి అడవికి బయలుదేరాడు.

ఉత్తానపాదుని కుమారుడైన ధృవుడు తపస్సు చేసినపుడు మహావిష్ణువు ప్రత్యక్షం అయిన సన్నివేశాన్ని రాజా రవి వర్మ చిత్రించిన చిత్రం

మూలాలు

మార్చు
  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో, ఏలూరు, 2007, పేజీ: 55.