ఉదయభాను

తెలుగు సినిమా నటి - టివి యాంకర్


ఉదయభాను ప్రముఖ టెలివిజన్ ప్రయోక్త, నటి. కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ ఆమె స్వస్థలం. పదోతరగతి చదువుతుండగా మొట్టమొదటగా కెమెరా ముందుకు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ఆ షో ప్రధాన ఉద్దేశం. ఆమెకు అప్పటికి యాంకర్ అనే పదానికి అర్థం తెలియకపోయినా గలగలా మాట్లాడుతూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.[1]

ఉదయభాను
జన్మ నామంఉదయభాను
జననం (1980-08-05)1980 ఆగస్టు 5
సుల్తానాబాద్,కరీంనగర్, తెలంగాణ
ఇతర పేర్లు భాను
భార్య/భర్త శ్రీనివాస్

బాల్యం, తలిదండ్రులుసవరించు

ఆమె తండ్రి డాక్టర్, తల్లి ఆయుర్వేద వైద్యురాలు. ఆమెకు సాప్ట్‌వేర్ జాబ్ చేసే ఒక తమ్ముడు ఉన్నాడు[2]. ఆమె తండ్రి ఒక కవి. ఆయన కలంపేరు ఉదయభాను. దానినే కూతురుకు పెట్టాడు. ఆయన ఉదయభానుకు నాలుగేళ్ళ వయసులో చనిపోయారు. [3] ఆయన చనిపోయాక తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకొంది. అతడికి ఏడుగురు సంతానం. ఆమె 15 వ ఏట ఒక ముస్లీంతో వివాహం జరిగింది. ఆమెకు ఇష్టం లేకపోవటం వలన విడాకుల అనంతరం విజయకుమార్ అనే అతడిని తల్లి అనుమతికి వ్యతిరేకంగా వివాహం చేసుకొన్నది. ఆమె ఎం.ఏ వరకూ చదివింది.

సినీ జీవితంసవరించు

10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది [3], తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది

నటించిన చిత్రాలుసవరించు

టెలివిజన్ కార్యక్రమాలుసవరించు

 • హృదయాంజలి (ఈ టీవీ)
 • వన్స్ మోర్ ప్లీజ్ (జెమినీ టీవీ)
 • సాహసం చేయరా డింబకా (జెమినీ టీవీ)
 • డ్యాన్స్ బేబీ డ్యాన్స్ (జెమినీ టీవీ)
 • రేలారే రే రేలా (మా టీవి)
 • ఢీ రియాలిటీ డ్యాన్స్ షో (ఈ టీవీ)
 • జాణవులే నెరజాణవులే (జెమినీ టీవీ)
 • పిల్లలు పిడుగులు (జెమిని టీవి)

మూలాలుసవరించు

 1. "ఉదయభానుపై ప్రముఖ ఆంగ్ల పత్రిక [[ది హిందూ]] లో వచ్చిన వార్త 2". Archived from the original on 2012-11-07. Retrieved 2010-08-08.
 2. "A bundle of energy". The Hindu. Chennai, India. 30 September 2002. Archived from the original on 1 జూలై 2003. Retrieved 16 జూన్ 2016. {{cite news}}: Check date values in: |access-date= and |archive-date= (help)
 3. 3.0 3.1 ఐడిల్ బ్రెయిన్ లో ఉదయభాను ముఖాముఖి

బయటి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయభాను&oldid=3318417" నుండి వెలికితీశారు