ఉదిత్ నారాయణ్
ఉదిత్ నారాయణ్ జన్మతహ నేపాల్ దేశానికి చెందిన ఒక నేపథ్య గాయకుడు. 2016లో భారత ప్రభుత్వము ఈయనకు పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. పలు భారతీయ భాషలతో పాటు ఈయన తెలుగులో కూడా కొన్ని ప్రజాదరణ పొందిన సినీ గీతాలు ఆలపించాడు.
ఉదిత్ నారాయణ్ | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
స్థానిక పేరు | उदित नारायण झा |
జన్మ నామం | ఉదిత్ నారాయణ్ ఘా |
జననం | భర్ద, సప్తారి, నేపాల్ | 1955 డిసెంబరు 1
సంగీత శైలి | నేపధ్య గాయకుడు |
వృత్తి | గాయకుడు, టీవీ కళాకారుడు, నటుడు, నిర్మాత, నృత్యకారుడు |
క్రియాశీల కాలం | 1980–ఇప్పటి వరకు |
లేబుళ్ళు | యష్ రాజ్ ఫిలింస్, టి-సిరీస్, సోనీ మ్యూజిక్, హెచ్.ఎం.వి. రికార్డ్స్, టిప్స్, వీనస్, సరెగమ |
నేపధ్యముసవరించు
నేపాల్‌లో పుట్టిన ఉదిత్ తన పాటతో ఎల్లలను చెరిపేశాడు, భాషాభేదాలను తుడిచేశాడు. రేడియో గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానం భారతదేశ చిత్రపరిశమలన్నింటిలోనూ ప్రముఖ గాయకుడిగా అభిమానం సంపాదించుకునే దిశగా సాగింది. తన గాన ప్రతిభతో ఉదిత్ నారాయణ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యాడు.
రేడియో నేపాల్‌లో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా ఏడేళ్లు పనిచేశాడు ఉదిత్. అతని ప్రతిభకు మెచ్చి అక్కడి భారతీయ ఎంబసీ అధికారులు భారతీయ విద్యాభవన్‌లో శాస్త్రీయ సంగీతం నేర్చుకొనేందుకు స్కాలర్‌షిప్ ఇచ్చి మరీ ఆహ్వానించారు. ఉన్నీస్ బీస్ చిత్రంతో వెండితెరకు ఉదిత్ పరిచయమయ్యాడు. 1988లో వచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ ఉదిత్ దశను మార్చేసింది. అందులో అన్ని పాటలూ పాడి, తొలి ఫిలింఫేర్ అందుకున్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, ఒడియా, అస్సామీ, మణిపూరి, నేపాలీ తదితర 34 భాషల్లో 25 వేల పాటలకు పైగా పాడాడు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లాంటి అగ్రతారల చిత్రాల్లో ఎన్నో మరపురాని గీతాలను ఆలపించాడు. మూడు సార్లు ఉత్తమ గాయకుడిగా జాతీయ పురస్కారాలు సాధించాడు. అయిదు ఫిలింఫేర్ పురస్కారాలు, 2009లో పద్మశ్రీ అందుకున్నాడు[1].
మూలాలుసవరించు
- ↑ "ఉదాత్తం... ఉదిత్ గాత్రం". ఈనాడు. 2016-01-26. Archived from the original on 2016-01-25. Retrieved 2016-01-26.
బయటి లంకెలుసవరించు
Wikimedia Commons has media related to Udit Narayan. |