ఉమామహేశ్వర ఉగ్రరూపస్య

వెంకటేష్ మహా దర్శకత్వంలో 2020లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య 2020 లో వెంకటేష్ మహా దర్శకత్వంలో వచ్చిన చిత్రం. ఇది మలయాళంలో ఘనవిజయం సాధించిన మహేశ్‌ ఇంటే ప్రతికారం చిత్రాన్ని తెలుగులోకి ఉమామహేశ్వర ఉగ్రరూపస్యగా పునర్నిర్మాణం చేశారు.[1]నటుడు సత్యదేవ్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. కేరాఫ్‌ కంచరపాలెంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకటేశ్‌ మహా దర్శకత్వం వహించిన రెండో చిత్రం ఇది. ఈ చిత్రం కోవిడ్ కారణంగా సినిమా హాళ్ళు అందుబాటులో లేనందున 2020 జూలై 30 జూలై న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయినది.

ఉమామహేశ్వర ఉగ్రరూపస్య
సినిమా పోస్టర్
దర్శకత్వంవెంకటేశ్‌ మహా
స్క్రీన్ ప్లేవెంకటేష్ మహా
నిర్మాతశోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని, విజయప్రవీణ పరుచూరి
తారాగణంసత్యదేవ్‌, హరిచందన, నరేశ్‌, సుహాస్‌, రూప, కుశాలిని, రవీంద్ర విజయ్‌,
ఛాయాగ్రహణంఅప్పు ప్రభాకర్
కూర్పురవితేజ గిరిజాల
సంగీతంబిజిబల్‌
నిర్మాణ
సంస్థలు
ఆర్కా మీడియా, మహాయాన మోషన్‌ పిక్చర్స్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్‌
విడుదల తేదీ
30 జూలై 2020 (2020-07-30)
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం

మార్చు
  • అరాకు వ్యాలీలోని కోమాలి ఫోటో స్టూడియో(ఫోటోగ్రాఫర్ ఉమా మహేశ్వర రావు)
  • సత్యదేవ్
  • బాబ్జీగా నరేష్
  • కొర్రా సుహాస్‌గా (సుహాస్)
  • మనోహర్ రావుగా (రాఘవన్)
  • స్వాతిగా (హరి చందన కొప్పిసెట్టి)
  • జ్యోతిగా (రూప కొడువాయూర్)[2]
  • నాంచరాయగా (టిఎన్ఆర్)
  • చంద్రుగా (జబర్దాస్త్ రాంప్రసాద్)
  • కుంగ్ ఫూ మాస్టర్‌గా (శ్రీధర్ రెడ్డి)
  • రవీంద్ర విజయ్

ఉమామహేశ్వరరావు (సత్యదేవ్‌) అరకులో ఫొటోగ్రాఫర్‌. మా ఊరికి అతనొక్కడే ఫోటోగ్రాఫర్. ఏ కార్యక్రమమైనా అతనిని పిలుస్తారు. ఉమామహేశ్వరరావుకి చిన్నప్పటి నుంచి గొడవలంటే భయం. చిన్నతనంలో స్కూళ్లో కలసి చదువుకున్న అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకరోజు అనుకోకుండా రోడ్డు మీద జరుగుతున్న గొడవను ఆపడానికి వెళ్లి దెబ్బలు తింటాడు. అందరి ముందు తన్నులు తినడంతో పరువు పోయిందని భావిస్తాడు. తనని కొట్టినవాడిని తిరిగి కొట్టిన తర్వాతే మళ్లీ చెప్పులు వేసుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. అదే సమయంలో ప్రేమించిన అమ్మాయికి అమెరికా సంబంధం రావడంతో ఇద్దరూ విడిపోతారు. మరి తనని కొట్టిన వాడిపై మహేశ్‌ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? తిరిగి చెప్పులు వేసుకున్నాడా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.[3]

పాటలు

మార్చు

ఈ పాటలను సంగీత దర్శకుడిగా బిజిబల్ బాణీలు అందించారు. పాటలో మొదటిది నింగి చుట్టే 6 మార్చి 2020 న విడుదలైంది.[4]రెండవ పాట ఆనందం 6 జూలై విడుదల అయినది.[5] మూడవ పాట రాపవాలు జూలై 13 న విడుదలైంది.[6]

సం.పాటగాయకులుపాట నిడివి
1."నింగి చుట్టే"విజయ్ ఏసుదాస్3:27
2."ఆనందం"గౌతమ్ భరద్వాజ్, సౌమ్య రమ్యకృష్ణ4:34
3."రపవలు"బాలాజీ, సంగీత శ్రీకాంత్3:24

విడుదల

మార్చు

ఈ చిత్రాన్ని మొదట్లో 2020 ఏప్రిల్ 17 న విడుదల చేద్దామనుకున్నారు కానీ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో థియేటర్ అన్ని మూసివేయబడ్డాయి. తర్వాత చిత్ర బృందం జూలై 30 న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు.[7]

పురస్కారాలు

మార్చు

సైమా అవార్డులు

మార్చు

2020 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (రూప కొడువాయూర్)

మూలాలు

మార్చు
  1. Kulkarni, GirishBaburao; Rao, Shivaji; Netto, ArchanaB; Taly, ArunB; Uma Maheshwara Rao, GS (2011). "Prognosis of patients with Guillain-Barré syndrome requiring mechanical ventilation". Neurology India. 59 (5): 707. doi:10.4103/0028-3886.86545. ISSN 0028-3886.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  2. 10TV Telugu (31 August 2020). "ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య హీరోయిన్ డాక్టర్, డ్యాన్సర్, సింగర్, ఆర్టిస్ట్ అని మీకు తెలుసా." (in Telugu). Archived from the original on 17 July 2023. Retrieved 17 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. "రివ్యూ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య..." www.eenadu.net. Retrieved 2020-08-02.
  4. "Uma Maheswara Ugra Roopasya: Nithiin heaps praise on the team and first lyrical song Ningi Chutte – Times of India". The Times of India.
  5. "Watch Latest Telugu Official Lyrical Video Song 'Aanandam' (Teaser) From Movie 'Umamaheswara Ugra Roopasya' Starring Satyadev And Naresh | Telugu Video Songs – Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 30 July 2020.
  6. "Uma Maheswara Ugra Roopasya: Nithiin heaps praise on the team and first lyrical song Ningi Chutte – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 30 July 2020.
  7. https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/uma-maheshwara-ugra-roopasya/movie-review/77251539.cms