ఉరుటూరు (పామర్రు)

భారతదేశంలోని గ్రామం

ఉరుటూరు, కృష్ణా జిల్లా, పామర్రు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 521 157., యస్.టి.డీ కోడ్ = o8674

ఉరుటూరు (పామర్రు)
—  రెవిన్యూ గ్రామం  —
ఉరుటూరు (పామర్రు) is located in Andhra Pradesh
ఉరుటూరు (పామర్రు)
ఉరుటూరు (పామర్రు)
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 16°19′01″N 80°56′07″E / 16.316823°N 80.935289°E / 16.316823; 80.935289
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పామర్రు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 879
 - పురుషులు 437
 - స్త్రీలు 442
 - గృహాల సంఖ్య 281
పిన్ కోడ్ 521157
ఎస్.టి.డి కోడ్ 08674

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

పామర్రు మండలంసవరించు

పామర్రు మండలంలోని అడ్డాడ, ఉరుటూరు, ఐనంపూడి, కనుమూరు, కొండిపర్రు, కురుమద్దాలి, కొమరవోలు, జమిగొల్వేపల్లి, జామిదగ్గుమల్లి, జుజ్జవరం, పసుమర్రు, పామర్రు, పెదమద్దాలి, బల్లిపర్రు, రాపర్ల, రిమ్మనపూడి గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

గుడివాడ, పెడన, మచిలీపత్నం, తెనాలి

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, పెదపారుపూడి, వుయ్యూరు, మొవ్వ

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

పామర్రు, వుయ్యూరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 42 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

సాంఘిక సంక్షేమశాఖ బాలుర గురుకుల పాఠశాలసవరించు

2016,నవంబరు-17 నుండి 19 వరకు కానూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలలో, ద్వితీయస్థానం సాధించిన కృష్ణా జిల్లా జట్టులో కెప్టెనుగా పాల్గొన్న ఈ పాఠశాలకు చెందిన అజయ్ అను విద్యార్థి, తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయ పాఠశాలల క్రీడాపోటీలకు ఎంపికైనాడు. 2016,డిసెంబరు-5 నుండి 10వతేదీ వరకు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పాఠశాలల క్రీడా పోటీలలో ఈ విద్యార్థి పాల్గొంటాడు. [3] ఉరుటూరు గ్రామ శివారులోని పాత నల్లగుంటలో నూతనంగా నిర్మించిన ఈ పాఠశాల భవనాలను 2016,డిసెంబరు-6న ప్రారంభించెదరు. ఈ పాఠశాల నిర్మాణానికి ఎస్.సి.సబ్ ప్లాన్ నిధులు 13 కోట్ల రూపాయలు మంజూరుకాగా, 2014,జనవరి-26న భూమిపూజ నిర్వహించి నిర్మాణం ప్రారంభించారు.ఇందులో 19 తరగతి గదులు ఉన్నాయి. ప్రయోగశాల, గ్రంథాలయాల కొరకు 5 గదులనూ, 18 గదులను వసతి గృహం, భోజనశాలకూ కేటాయించారు. అంతేగాకుండా పాఠశాల సిబ్బంది వసతి కోసం 7 గృహాలను నిర్మించారు. విద్యార్థులు ఆటలాడుకొనుటకు రెండున్నర ఎకరాలలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసారు. దీనితో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పడినవి. ఇంత వరకు ఈ పాఠశాలను మొవ్వ మండలంలోని నిడుమోలులో నిర్వహించారు. 2016,జూన్ నుండి ఇక్కడకు మార్చారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 5 నుండి 10వ తరగతి వరకు, 406 మంది విద్యార్థులు, విద్యనభ్యసించుచున్నారు. [4]

మండల పరిషత్తు ఉన్నత పాఠశాలసవరించు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

సత్యనారాయణపురం, నల్లగుంట గ్రామాలు, ఉరుటూరు గ్రామ పంచాయతీలోని శివారు గ్రామాలు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గ్రామ జనాబాసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 879 - పురుషుల సంఖ్య 437 - స్త్రీల సంఖ్య 442 - గృహాల సంఖ్య 281
జనాభా (2001) -మొత్తం 1069 -పురుషులు 531 -స్త్రీలు 538 -గృహాలు 326 -హెక్టార్లు 493

మూలాలుసవరించు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
  2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pamarru/Uruturu". Retrieved 29 June 2016. External link in |title= (help)

వెలుపలి లింకులుసవరించు

[3] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,నవంబరు-22; 2వపేజీ. [4] ఈనాడు అమరావతి/పామర్రు; 2016,డిసెంబరు-5; 2వపేజీ.