ఉలవచారు బిర్యాని
ఉలవచారు బిర్యాని 2014 జూన్ 6న విడుదలైన తెలుగు చిత్రం. ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ దీనికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం తెలుగుతో బాటు తమిళ, కన్నడ భాష లలో కూడా విడుదలైంది. మలయాళ భాషలో విజయవంతమైన సాల్ట్ ఎన్ పెప్పర్ అనే సినిమాకు ఇది రీమేక్.
ఉలవచారు బిర్యాని [1] | |
---|---|
దర్శకత్వం | ప్రకాశ్ రాజ్ |
రచన | విజి, వల్లభ |
స్క్రీన్ ప్లే | ప్రకాశ్ రాజ్ |
కథ | శ్యాం పుష్కరణ్ దిలీష్ నాయర్ |
నిర్మాత | ప్రకాశ్ రాజ్ కె. ఎస్. రామారావు |
తారాగణం | ప్రకాశ్ రాజ్ స్నేహ ఊర్వశి |
ఛాయాగ్రహణం | ప్రీతా |
కూర్పు | కిషోర్ తే |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | దర్శన్ (కన్నడ)[2] డ్యూయెట్ మూవీస్(తమిళ్) శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్(తెలుగు) |
విడుదల తేదీ | 6 జూన్ 2014 |
దేశం | భారత్ |
భాషలు |
కథ
మార్చుకాళిదాసు ( ప్రకాశ్ రాజ్) ఓ బ్రహ్మచారి. ఆయన పురావస్తుశాఖ (అర్కియాలజి) శాఖలో పనిచేసే అధికారి. గౌరీ (స్నేహ) మధ్యవయస్సు వచ్చినా..కుజదోషంగా కారణంగా పెళ్ళికాని ఓ సినీ డబ్బింగ్ కళాకారిణి. చరవాణి రాంగ్ కాల్ తో అనుకోకుండా కలిసిన కాళిదాసు, గౌరీలు ఒకరికి మరొకరు తెలియకుండానే దగ్గరవుతారు. ఇష్టాలు, అభిరుచులు ఒకేలా ఉండటంతో కాళిదాసు, గౌరీలు కలుసుకోవాలనుకుంటారు. వీరిద్దరీ కథలో కాళిదాసు మేనల్లుడు నవీన్ (తేజూస్), గౌరీ స్నేహితురాలు మేఘన (సంయుక్త హోర్నాడ్) లు ప్రవేశిస్తారు. వీరిద్దరి కథలో నవీన్, గౌరీలు ఎందుకు ప్రవేశించారు; కాళిదాసు, గౌరీలు కలుసుకున్నారా? కలుసుకోవడానికి మధ్య జరిగిన సంఘటనలు ఏంటీ? లేటు వయసులో చిగురించిన ప్రేమతో వారిద్దరూ ఒక్కటయ్యారా అనే ప్రశ్నలకు సమాధానమే 'ఉలవచారు బిర్యాని' సినిమా.
నటవర్గం
మార్చుసాంకేతివర్గం
మార్చు- నిర్మాత, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ప్రకాశ్ రాజ్
- సంగీతం: ఇళయరాజా
- కెమెరా: ప్రీతా
స్పందనలు
మార్చు- ఈ ప్రేమాయణంలో చక్కని వంటకాలను మిళితం చేసి సినిమా ప్రథమార్ధంను సజావుగా నడిపించేశాడు ప్రకాశ్ రాజ్. ఇక ద్వితీయార్ధంలో యువ జంట ప్రేమను హైలైట్ చేస్తూ కథను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశాడు. అక్కడే దర్శకుడి అడుగులు తడబడ్డాయి. తన మావయ్య ప్రేమించిన అమ్మాయిని బుట్టలో వేసుకోవాలని తేజస్ ప్రయత్నించడం, అలానే తన అక్కయ్య అభిమానిస్తున్న వ్యక్తిని సంయుక్త ఇష్టపడటం అనే అంశాన్ని మరింత సున్నితంగానూ, కన్వెన్సింగ్గానూ చూపించి ఉండాల్సింది. ఏ పరిస్థితులలో తాము వేరొకరిని పంపామనే విషయమై ఇటు కాళిదాసు, అటు గౌరి వివరణ ఇవ్వడంలోనూ స్పష్టత లోపించింది. దాంతో పతాకసన్నివేశం తేలిపోయింది. ప్రథమార్ధం పూర్తి కాగానే 'ఇది గొప్ప సినిమా కాకపోయినా... ఓ విభిన్నమైన చిత్రం' అనే భావన ప్రేక్షకుడికి కలుగుతుంది. కానీ ద్వితీయార్థంకు వచ్చేసరికీ సినిమా గ్రాఫ్ కిందకి పడిపోయింది. ఏ సన్నివేశమూ ఆసక్తి కలిగించదు. ఇళయారాజా నేపథ్య సంగీతమూ అంతంత మాత్రమే.[3] - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్, ఫిల్మ్ జర్నలిస్ట్
మూలాలు
మార్చు- ↑ Review : Ulavacharu Biryani – Un Samayal Arayil- Oggarane http://www.aptoday.com/topstories/review-ulavacharu-biryani-un-samayal-arayil-oggarane.html Archived 2014-06-06 at the Wayback Machine
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-05-27. Retrieved 2014-06-06.
- ↑ చంద్రం (16 June 2014). "ఏ మాత్రం రుచించని 'ఉలవచారు బిర్యానీ'!". జాగృతి వారపత్రిక. Retrieved 17 February 2024.