ఉషా కిరణ్ (1929 ఏప్రిల్ 22 - 2000 మార్చి 9) ఒక భారతీయ నటి. 50కి పైగా హిందీ, మరాఠీ చిత్రాలలో తన నాలుగు దశాబ్దాల కెరీర్‌లో నటించింది. ముఖ్యంగా దాగ్ (1952), పతితా (1953), బాద్‌బాన్ (1954), చుప్కే చుప్కే (1975), మిలి (1975), బావర్చి (1972). ఆమె 1996, 1997లో ముంబై షెరీఫ్‌గా కూడా ఉన్నారు.[1]

ఉషా కిరణ్
బాద్బాన్ (1954)లో ఉషా కిరణ్
జననం(1929-04-22)1929 ఏప్రిల్ 22
హైదరాబాదు, బ్రిటిష్ ఇండియా
మరణం2000 మార్చి 9(2000-03-09) (వయసు 70)
నాసిక్, మహారాష్ట్ర, భారతదేశం
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1949–2000
జీవిత భాగస్వామిడాక్టర్ మనోహర్ ఖేర్
పిల్లలుతన్వీ అజ్మీ, అద్వైత్ ఖేర్
బంధువులుఉత్తరా మాత్రే ఖేర్‌ (కోడలు)
బాబా అజ్మీ (అల్లుడు)
సయామీఖేర్ (మనవరాలు)

వ్యక్తిగత జీవితం

మార్చు

బాలకృష్ణ విష్ణు మరాఠే, రాధాబాయి మరాఠే దంపతులకు ఉషా బాలకృష్ణ మరాఠేగా ఉషా కిరణ్ జన్మించింది. వారి ఐదుగురు కుమార్తెలలో ఉషా కిరణ్ రెండవ సంతానం. ముంబైలోని సియోన్ హాస్పిటల్ డీన్ అయిన డాక్టర్ మనోహర్ ఖేర్‌తో ఆమె వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు అద్వైత్ ఖేర్, ఒక కుమార్తె తన్వి అజ్మీ ఉన్నారు. అద్వైత్ ఖేర్ మాజీ మోడల్, అతని భార్య 1982 ఫెమినా మిస్ ఇండియా ఉత్తరా మాత్రే. వారి ఇద్దరు కుమార్తెలు సంస్కృతి ఖేర్, సయామీఖేర్‌లతో కలిసి నాసిక్‌లో స్థిరపడ్డారు. ఉషా కిరణ్ కుమార్తె తన్వీ అజ్మీ ఒక ప్రసిద్ధ టెలివిజన్, చలనచిత్ర నటి. తన్వీ షబానా అజ్మీ సోదరుడు, సినిమాటోగ్రాఫర్ బాబా అజ్మీని వివాహం చేసుకుంది.[2]

కెరీర్

మార్చు

ఆమె ఎం.జి రంగ్నేకర్ కలిసి తన నటనా జీవితాన్ని వేదికపై మరాఠీ నాటకం ఆశీర్వాద్ ద్వారా ప్రారంభించింది.[3] ఆమె ఉదయ్ శంకర్ నృత్య-నాటక చిత్రం కల్పన (1948)లో చిన్న పాత్రతో హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె నజరానా (1961), దాగ్ (1952), బాద్బాన్ (1954), కాబూలీవాలా (1961) , పాటిటా (1953), మిలి, బావర్చి (1972), చుప్కే చుప్కే (1975)[4] వంటి అనేక ప్రసిద్ధ హిందీ చిత్రాలలో నటించింది. కిషోర్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్, రాజేంద్ర కుమార్, రాజేష్ ఖన్నా, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్[5] వంటి మరెందరో మేటి సినిమా నటుల సరసన ఉషా కిరణ్ నటించింది.

ఆమె ప్రసిద్ధ మరాఠీ చిత్రాలైన షిక్లేలీ బేకో, జసచ్ టేసే, పోస్టట్లీ ముల్గీ, దూద్ భాకర్, స్త్రీ జన్మ హి తుజీ కహానీ, కన్యాదాన్, గరీబా ఘర్చీ లేక్, కాంచనగంగ వంటి చిత్రాలలో కూడా నటించారు.

ఫిల్మోగ్రఫీ (ఎంచుకున్నవి)

మార్చు
కల్పన (1948) సమాజ్ (1954) దిల్ భీ తేరా హమ్ భీ తేరే (1960)
గరీబీ (1949) బాద్షా (1954) కాబూలీవాలా (1961)
శ్రీ కృష్ణ దర్శన్ (1950) బాద్బాన్ (1954) తన్హై (1961)
రాజ్ రాణి (1950) అధికార్ (1954) నజరానా (1961)
గౌనా (1950) ఊట్ పతంగ్ (1955) మన్సాలా పంఖ్ అస్తాత్ (1961)
భగవాన్ శ్రీ కృష్ణ (1950) బహు (1955) అమృత్ మంథన్ (1961)
శ్రీ విష్ణు భగవాన్ (1951) గురు ఘంటాల్ (1956) ఘర్ని శోభ (1963)
సర్కార్ (1951) పరివార్ (1956) గెహ్రా దాగ్ (1963)
మాయా మఛీంద్ర (1951) అయోధ్యాపతి (1956) బావర్చి (1972)
మధోష్ (1951) అనురాగ్ (1956) బడి మా (1974)
మార్డ్ మరాఠా (1952) ఆవాజ్ (1956) చుప్కే చుప్కే (1975)
లాల్ కున్వర్ (1952) రాజా విక్రమ్ (1957) మిలి (1975)
ధోబీ డాక్టర్ (1952) ముసాఫిర్ (1957) లగే బంధే (1979)
దాగ్ (1952) జీవన్ సాథి (1957) ఫతకడి (1980)
పతిత (1953) దుష్మన్ (1957) చంబల్ కి కసమ్ (1980)
హుస్న్ కా చోర్ (1953) ట్రాలీ డ్రైవర్ (1958) సామ్రాట్ (1982)
ధువాన్ (1953) షిక్లెలీ బైకో (1959) మెహందీ (1983)
దోస్త్ (1954) సాతా జన్మచి సోబ్తి (1959) బహురాణి (1989)
ఔలాద్ (1954) మెహందీ రంగ్ లాగ్యో (1960)
శోభ (1954) కన్యాదాన్ (1960)

అవార్డులు

మార్చు
  • ఆమె బాద్బాన్ చిత్రానికి 1955లో ఉత్తమ సహాయ నటిగా మొట్టమొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది.[6]
  • కన్యాదాన్ చిత్రంలో ఆమె నటనకు మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ నటి అవార్డు అందుకుంది

ఆమె 70 ఏళ్ల వయసులో నాసిక్‌లో మరణించింది.[7]

మూలాలు

మార్చు
  1. "Actress Usha Kiran passes away at 71". The Indian Express. 10 March 2000.
  2. THE DYNAMIC DYNASTIES: What would the world of films be without them? Archived 10 ఫిబ్రవరి 2010 at the Wayback Machine Screen, 22 September 2000.
  3. Mass media 2001. Ministry of Information and Broadcasting. Research, Reference, and Training Division. Government of India, 2001. ISBN 81-230-0942-9. p. 152.
  4. Filmography IMDb.
  5. "Actress Usha Kiran passes away at 71". The Indian Express. 10 March 2000.
  6. Awards IMDb.
  7. "Actress Usha Kiran passes away at 71". The Indian Express. 10 March 2000.