ఉస్మానాబాద్ జిల్లా

మహారాష్ట్ర లోని జిల్లా

మహారాష్ట్ర రాష్ట్ర 38 జిల్లాలలో ఉస్మానాబాద్ జిల్లా (హిందీ:उस्मानाबाद जिल्हा) ఒకటి. ధారాశివ్ (धाराशिव) పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,660,311. జిల్లావైశాల్యం 7569 చ.కి.మీ. నగర ప్రాంతం 241.4 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి వీరిలో 16.96% నగరప్రాంత నివాసితులు.[2]

Osmanabad జిల్లా

عثمان آباد ضلع
उस्मानाबाद जिल्हा
Maharashtra లో Osmanabad జిల్లా స్థానము
Maharashtra లో Osmanabad జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంMaharashtra
పరిపాలన విభాగముAurangabad Division
ముఖ్య పట్టణంOsmanabad
మండలాలు1. Osmanabad, 2. Tuljapur, 3. Omerga, 4. Lohara, 5. Kallamb, 6. Bhoom, 7. Paranda, 8. Washi
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుOsmanabad[1]
విస్తీర్ణం
 • మొత్తం7,569 కి.మీ2 (2,922 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం16,60,311
 • సాంద్రత220/కి.మీ2 (570/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత76.33%
 • లింగ నిష్పత్తి920
ప్రధాన రహదార్లుNH-9, NH-211
అక్షాంశరేఖాంశాలుCoordinates: 17°21′N 75°10′E / 17.35°N 75.16°E / 17.35; 75.16-18°24′N 76°24′E / 18.40°N 76.40°E / 18.40; 76.40
సగటు వార్షిక వర్షపాతం730 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ప్రాంతంసవరించు

ఉస్మానాబాద్ జిల్లా మహారాష్ట్ర రాష్ట్ర దక్షిణ భూభాగంలో దక్కన్ పీఠభూమిలో ఉంది. ఇది సముద్రమట్టానికి 600 మీ ఎత్తులో ఉంది. మంజీరా నదిలో కొంత భాగం, తెర్నా నది జిల్లాలో ప్రవహిస్తున్నాయి. మరత్వాడా భూభాగంలో తూర్పు భాగంలో ఉంది. జిల్లా 17.35 నుండి 18.40 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 75.16 నుండి 76.40 డిగ్రీల రేఖాంశంలో ఉంది.

సరిహద్దులుసవరించు

జిల్లా ఉత్తర సరిహద్దులో బీడ్ జిల్లా, ఈశాన్య, తూర్పు సరిహద్దులో లాతూర్ జిల్లా, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా, ఆగ్నేయ, దక్షిణ సరిహద్దులో కర్నాటక రాష్ట్రంలోని గుల్బర్గ జిల్లా, దక్షిణ, నైరుతీ సరిహద్దులో సోలాపూర్ జిల్లా, వాయవ్య సరిహద్దులో అహమ్మద్‌నగర్ జిల్లా ఉన్నాయి. జిల్లాలో అత్యధికభాగం బాలాఘాట్ పర్వతశ్రేణిలో ఉంది.

వాతావరణంసవరించు

జిల్లాలో జిల్లా - సెప్టెంబరు వరకు వర్షపాతం, అక్టోబరు - నవంబరు మాసాలలో వాతావరణం హ్యూమిడ్‌గానూ నవంబరు - జనవరి పొడిగా - చల్లగానూ, ఫిబ్రవరి - జూన్ వరకు పొడిగా ఉండి క్రమంగా వేడెక్కుతూ ఉంటుంది. మరత్వాడా లోని ఇతర జిల్లాల కంటే వేసవిలో ఉస్మానాబాద్ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 730 మిమీ. గరిష్ఠ ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెంటీ గ్రేడ్. కనిష్ఠ ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెంటీ గ్రేడ్.

తాలూకాలుసవరించు

జిల్లాలో 8 తాలూకాలు ఉన్నాయి :[3]

 • భూం
 • కలాంబ్
 • లోహర
 • ఒమర్గ
 • ఒస్మానాబాద్
 • పరంద
 • తుల్జాపూర్
 • వషి

పరందసవరించు

పరంద గ్రామం చారిత్రక ప్రాధాన్యత కలిగిన గ్రామం ఇక్కడ ఒక కోట ఉంది.

కలంబసవరించు

మంజీర నదీతీరంలో ఉన్న కలంబ జిల్లాలో వ్యాపార ప్రాధాన్యత కలిగిన గ్రామం. ఇది మజీరా నదీతీరంలో ఉంది. ఇక్కడకు 20 కి.మీ దూరంలో ఉన్న యాదేశ్వరి ఆలయం తాలూకాకు ప్రత్యేకత ఇస్తుంది.

తుల్జాపూర్సవరించు

జిల్లాలో ఉన్న తుల్జాపూర్ (సోలాపూర్‌కు 25 కి.మీ దూరంలో ఉస్మానాబాద్, హైదరాబాదు‌కు 40 కి.మీ దూరంలో ఉంది) లో నల్దుర్గా వద్ద తుల్జాపూర్ భావానీ ఆలయం ఉంది. శివాజీ మహరాజ్‌కు తుల్జాపూర్ భవాని ఖడ్గం ఇచ్చిందని విశ్వసిస్తున్నారు. శివాజీ కుమారుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని భావిస్తున్నారు. ఒమెర్గా జిల్లాలో జనసాంధ్రత అధికంగా ఉన్న తాలూకాగా గుర్తించబడుతుంది. తుల్జాపూర్‌లో టాటా కంసల్టెంసీ ఇంస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సు (ముంబయి) కి చెందిన " స్కూల్ ఆఫ్ రూరల్ డెవెలెప్మెంటు " ఉంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,660,311,[2]
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 298వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 219 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 11.69%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 930:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 76.33%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

రాజకీయాలుసవరించు

 • జిల్లాలో ప్రధాన రాజకీయ పార్టీలు.
 • శివసేన ( ఎస్.హెచ్.ఎస్ )SHS),
 • భారత జాతీయ కాంగ్రెస్ (ఐ.ఎన్.డి),
 • నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి),
 • భారతీయ జనతా పార్టీ ( బిజెపి)
 • బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి)

.[6][7]

నియోజకవర్గాలుసవరించు

 • ఉస్మానాబాద్ పార్లమెంటు నియోజకవర్గం :- సోలాపూర్ జిల్లా ఉత్తర భూభాగం నుండి బర్షి అసెంబ్లీ నియోజకవర్గం, జిల్లా, లాతూర్ జిల్లాలో దక్షిణ భూభాగంలోని అయుసా అసెంబ్లీ నియోజకవర్గం ఉన్నాయి.[8]
 • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పరంద, ఉస్మానాబాద్, తుజాపూర్, ఉమర్గ.[9][10]

ప్రయాణ సౌకర్యాలుసవరించు

 • 2007 వరకు జిల్లాలోని ఉత్తర సరిహద్దులో బర్షి లైట్ రైల్వే రైలు (లాతూర్ - బర్షి - కురుద్వాది ) మార్గం ఉంది. తరువాత ఈ మార్గం బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది. నవికరించిన రైలు మార్గం జిల్లాను ముంబై, పూనాలతో అనుసంధానిస్తుంది.

రహదారి మార్గంసవరించు

ఉస్మానాబాద్ జాతీయ రహదారి మార్గం ద్వారా బీద్, లాతూర్, పూనా, సోలాపూర్ లతో అనుసంధానించబడి ఉంది.

వాయుమార్గంసవరించు

ఉస్మానాబాద్ విమానాశ్రయం ఉస్మానాబాద్‌కు 10కి.మీ దూరంలో ఉంది. ఇది వాణిజ్య ప్రయోజనాలకు ఉపకరించదు. రిలయంస్ ఎయిర్‌పోర్ట్ డెవెలెపర్స్ దీనీని 95 సంవత్సరాల లీజుకు తీసుకున్నారు.[11][12] plan to use this airport for aviation training.[13]

కళాశాలలుసవరించు

 • ఇంజనీరింగ్, తుల్జాపూర్ లోని శ్రీ తుల్జాభవాని కాలేజ్.
 • ఉస్మానాబాదులో విద్య
 • కాలేజి ఆఫ్ ఇంజినీరింగ్: ఉస్మానాబాదు
 • బి.ఎ.ఎం.ఎస్., ఉస్మానాబాద్ గవర్నమెంట్ కాలేజీ
 • ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, ఉస్మానాబాద్
 • రామకృష్ణ పరంహంస్ కాలేజ్, ఉస్మానాబాద్
 • కె.టి కంప్యూటర్ సైన్స్ పాటిల్ కాలేజ్, ఉస్మానాబాద్
 • ఆర్ట్స్, సైన్స్, కామర్స్, ఒమెర్గా దిసి శ్రీ ఛత్రపతి శివాజీ కాలేజ్. ఉస్మానాబాద్
 • శంకర్రావ్ పాటిల్ జూనియర్ & సీనియర్ కాలేజీ, భూ.
 • ష్రిపాత్రో భోసలే సెకండరీ, హయ్యర్ సెకండరీ స్కూల్ ఉస్మానాబాద్

పర్యాటక ఆకర్షణలుసవరించు

 • తుల్జాపూరులో రాజా షహాజీ నిర్మించిన తుల్జాపూర్ భవాని ఆలయానికి దేశం అంతటి నుండి భక్తులు వస్తుంటారు. ఇక్కడ తుల్జా భవానీ ఆలయం ఉంది.
 • తుల్జాపూర్ డివిషన్‌లోని కత్వి గ్రామంలో 500 సంవత్సరాలనాటి రెండు మసీదులు ఉన్నాయి. వీటిలో పెద్ద మసీదును " జమియా మసీద్ " అంటారు. చున్న మసీదు చాలా పురాతనమైనది. మసీదు నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంది.
 • నల్దుర్గ్ వద్ద చరిత్రప్రాధాన్యత కలిగిన కోట ఉంది.
 • షెలంగోన్ (జాగీర్) వద్ద మారుతీ ఆలయం ఉంది.
 • మంకేశ్వర్ హెమద్పంతి శివాలయం, సాత్వి దేవి ఆలయం ఉంది.
 • కలంబ్ తాలూకాలోని వద్గావ్, భంగావ్, యాద్షి గ్రామాలలో " యాద్షి రామ్లింగ్ ఘాట్ విల్డ్‌లైఫ్ శాంక్చ్యురీ " ఉంది.
 • 1870లో యాద్షిలో అరణ్య నేపథ్యంలో ఉత్తమ రైల్వే అధికారుల కొరకు బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించిన " రైల్వే సర్క్యూట్ హౌస్ " అత్యుత్తమ నిర్మాణంగా గుర్తించబడుతుంది. ప్రస్తుతం ఇది ఇండియన్ రైల్వే ఆధీనంలో మొదటి తరగతి రైల్వే అధికారుల కొరకు రిజర్వ్ చేయబడింది.
 • జైన్ - మహావీర్ గుహలు [14]
 • ఘుగ్ది :- ఇది ఒక విహార కేంద్రం. ఇక్కడ వడగావ్ - సిద్ధేశ్వర ఆలయం ఉంది.[14]
 • జిల్లాలో శాంతి గొరొబా ఆలయం, ధారాశివ్ గుహలు, రామ్‌లింగ్ ఆలయం, వడగావ్ సిద్దేశ్వరాలయం, నల్దుర్గ్ కోట, పరంద కోట ఉన్నాయి.

మూలాలుసవరించు

 1. "Parliamentary Constituencies Maharashtra" (PDF). Election Commission of India. మూలం (PDF) నుండి 2009-03-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-03-05. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "District Census 2011". Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. 2011. మూలం నుండి 2012-05-02 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
 3. "Blocks of Osmanabad, Maharashtra". Registrar General & Census Commissioner, India. మూలం నుండి 13 నవంబర్ 2011 న ఆర్కైవు చేసారు. Retrieved 27 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. Cite web requires |website= (help)
 5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 Cite web requires |website= (help)
 6. "Election Information in Osmanabad Parliament . Dr. Padamsingh bajirao Patil is member of parliament from 2009. Constituency". Party Analyst (IT GRIDS, India). మూలం నుండి 2013-10-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-27. Cite web requires |website= (help)
 7. "State Assembly Elections 2009: Maharashtra: Osmanabad". Indian Election Affairs. Cite web requires |website= (help)
 8. Cite web|title=Map: Parliamentray Constituencies Maharashtra|publisher= Election Commission of India|url=http://164.100.9.199/ecimaps/ecipdf/state_pc_Map/Maharashtra.pdf Archived 2009-03-06 at the Wayback Machine.
 9. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). Election Commission of India. p. 271. మూలం నుండి 5 అక్టోబర్ 2010 న ఆర్కైవు చేసారు (PDF). Retrieved 27 నవంబర్ 2014. Cite uses deprecated parameter |deadurl= (help); More than one of |deadurl= and |url-status= specified (help); Cite web requires |website= (help)
 10. "Assembly Constituencies-Post delimitation: Maharashtra: Osmanabad District" (PDF). Election Commission of India. 2008. మూలం (PDF) నుండి 2013-05-05 న ఆర్కైవు చేసారు. Retrieved 2014-11-27. Cite web requires |website= (help)
 11. "Reliance Airport gets five projects on lease". Times of India. 6 Aug 2009. Retrieved 19 September 2011. Cite news requires |newspaper= (help)
 12. "MIDC-run airports set for makeover". Indian Express. 1 July 2008. Retrieved 19 September 2011. Cite news requires |newspaper= (help)
 13. "Aviation Academy proposed at Osmanabad Airport". National Web Network India. 8 Jan 2011. Retrieved 20 September 2011. Cite news requires |newspaper= (help)
 14. 14.0 14.1 "Osmanabad District Court Judicial Statistics: Judicial Station Osmanabad: Important places in the vicinity". Cite web requires |website= (help)

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు