గోవింద్ సాగర్ సరస్సు

గోవింద్ సాగర్ సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ జిల్లాలో ఉన్న ఒక జలాశయం. ఇది భాక్రా డ్యామ్ ద్వారా ఏర్పడింది.[2]

గోవింద్ సాగర్ సరస్సు
గోవింద్ సాగర్ సరస్సు is located in Himachal Pradesh
గోవింద్ సాగర్ సరస్సు
గోవింద్ సాగర్ సరస్సు
ప్రదేశంఊనా జిల్లా,బిలాస్ పూర్,హిమాచల్ ప్రదేశ్
అక్షాంశ,రేఖాంశాలు31°25′N 76°30′E / 31.417°N 76.500°E / 31.417; 76.500
రకంసాగునీరు
సరస్సులోకి ప్రవాహం4.4- 8.0 million cusecs
వెలుపలికి ప్రవాహం4.9- 7.0 million cusecs
ప్రవహించే దేశాలుభారతదేశం
గరిష్ట లోతు163.07 మీ. (535.0 అ.)
7,501,775 acre⋅ft (9.25 కి.మీ3)[1]
ప్రాంతాలుఊనా జిల్లా,బిలాస్ పూర్
మూలాలుFAO

చరిత్ర

మార్చు

ఈ జలాశయం సట్లెజ్ నదిపై ఉంది. పదవ సిక్కు గురువు [[గురు గోవింద సింగ్|గురు గోవింద్ సింగ్]] గౌరవార్థం ఈ సరస్సుకు అతడి పేరు పెట్టబడింది. ఇది ప్రపంచంలోని ఎత్తైన గురుత్వాకర్షణ గల ఆనకట్టలలో ఒకటి, భాక్రా డామ్ ద్వారా అమెరికన్ డ్యామ్-బిల్డర్, హార్వే స్లోకం పర్యవేక్షణలో, 1955 లో దీని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1962 లో నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి.[3] [4]

విస్తీర్ణం

మార్చు

56 కిలోమీటర్ల పొడవు, దాదాపు 3 కిలోమీటర్ల వెడల్పుతో గోవింద్ సాగర్ సరస్సు ఉంది.

చేపలు

మార్చు

చేపలు పట్టడం అనేది ఇక్కడి సాధారణ ప్రక్రియ. ఇది సుమారు యాభై ఒకటి జాతులు, ఉప జాతులను కలిగి ఉంది. బంగనా డెరో, టోర్ పుటిటోరా, స్పెరటా సీడ్ఘాలా, మిర్రర్ కార్ప్ వంటి మొదలైన చేపలు ఇక్కడ కనిపించే సాధారణ జాతులు.

ప్రత్యేకత

మార్చు

సరస్సు డైరెక్టరేట్ టూరిజం, సివిల్ ఏవియేషన్ వంటి అనుబంధ క్రీడల సహకారంతో పలు రకాల నీటి-క్రీడా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఇక్కడ సర్ఫింగ్, వాటర్-స్కీయింగ్, కయాకింగ్, రోయింగ్, కానోయింగ్, వైట్ వాటర్ రివర్ రాఫ్టింగ్ వంటివి చేయవచ్చు. వీటిని నేర్చుకోవడం కోసం అక్కడ ఉండటానికి హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేక వసతి కూడా కల్పిస్తుంది.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-11. Retrieved 2021-07-22.
  2. "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 30 December 2019.
  3. India After Gandhi. Ramachandra Guha (2008). India After Gandhi, page 215. Pan Macmillan Ltd., London.
  4. http://www.himachalworld.com/himachal-geography/lakes-in-himachal.html