ఊర్ట్ మేఘం

(ఊర్ట్ మబ్బు నుండి దారిమార్పు చెందింది)

ఊర్ట్ మేఘం లేదా ఊర్ట్ మబ్బు, ఒక బంతి ఆకారపు మబ్బు. ఈ మబ్బు తోకచుక్కల నిలయం. ఇది సూర్యుడి నుండి 50, 000 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉంది.[1] సూర్యుడినుండి ప్లూటోకు గల దూరం కంటే ఇది 1000 రెట్లు అధికం. దాదాపు ఒక కాంతి సంవత్సరానికి సమానం. ఊర్ట్ మబ్బు యొక్క వెలుపలి అంచు మన సౌరమండల అంచునకు ప్రాక్సిమా సెంటారీ (సూర్యునికి అతి దగ్గరలో వున్న నక్షత్రం) దూరంలో పావువంతు వరకు విస్తరించి ఉంది.

చిత్రకారుడి 'ఊర్ట్ మబ్బు' ఊహాచిత్రం, పర్వతాల మబ్బు, క్యూపర్ బెల్ట్ (ఇస్ సెట్ లో) .

ఈ ఊర్ట్ మబ్బులో రెండు భాగాలున్నట్లు భావిస్తున్నారు. ఒకటి, బంతి ఆకార 'బాహ్య ఊర్ట్ మబ్బు', రెండవది, డిస్క్-ఆకార 'అంతర్ ఊర్ట్ మబ్బు' (లేదా పర్వతాల మబ్బు) . ఊర్ట్ మబ్బులో గల శరీరాలు మంచు, ఉదాహరణకు నీరు, అమ్మోనియా, మీథేన్ లతో తయారైన ఆకృతులుగా భావిస్తున్నారు. ఊర్ట్ మబ్బు గురించి సంపూర్ణమైన పరిశోధనలు ఇంకనూ జరగవలసి ఉన్నాయి.. అయిననూ ఎక్కువ కాలానికి చెందిన హేలీ తోకచుక్క, బృహస్పతి కుటుంబానికి చెందిన తోకచుక్కలూ, ఇతర తోకచుక్కలకు పుట్టినిల్లు ఈ ఊర్ట్ మబ్బే.[2] తక్కువ కాలానికి చెందిన తోకచుక్కలు క్యూపర్ బెల్ట్కు చెందినవి,[1] కానీ ఈ తక్కువకాలానికి చెందిన కొన్ని తోకచుక్కలూ ఊర్ట్ మబ్బుకే చెందినవి అని భావిస్తున్నారు.[2] క్యూపర్ బెల్ట్, సుదూర విసరబడ్డ డిస్క్ను పరిశీలించి పటాలనూ తయారు చేశారు, కానీ ప్రస్తుతం తెలిసిన శరీరాలు, 90377 సెడ్నా, 2000 CR105లు అంతర్ ఊర్ట్ మబ్బు సభ్యులని భావించడం జరిగింది.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 Alessandro Morbidelli (2006-02-03). "Origin and dynamical evolution of comets and their reservoirs" (PDF). arxiv. Retrieved 2007-05-26.{{cite web}}: CS1 maint: date and year (link)
  2. 2.0 2.1 V. V. Emelyanenko; D. J. Asher; M. E. Bailey (2007). "The fundamental role of the Oort cloud in determining the flux of comets through the planetary system". Royal Astronomical Society. Retrieved 2008-03-21.

బయటి లింకులు

మార్చు