మాదిరాజు లక్ష్మీ నరసింహారావు (నవంబరు 7, 1928 - ఫిబ్రవరి 12, 2016) ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత, సాహితీవేత్త.[1]

ఎం.ఎల్.నరసింహారావు
Mlnrao.jpg
మాదిరాజు లక్ష్మీనరసింహారావు
జననంమాదిరాజు లక్ష్మీనరసింహారావు
(1928-11-07) 1928 నవంబరు 7
భారతదేశం పండితాపురం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మరణం2016 ఫిబ్రవరి 12
హైదరాబాదు
ఉద్యోగంతెలుగు అకాడమీ
ప్రసిద్ధికార్యదర్శి, శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
సాధించిన విజయాలుఅసిస్టెంట్ ప్రొఫెసర్
మతంహిందూ
భార్య / భర్తప్రమీలాదేవి
పిల్లలుఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు

విశేషాలుసవరించు

ఇతడు ఖమ్మం జిల్లా కామేపల్లిమండలం పండితాపురం గ్రామంలో 1928, నవంబరు 7వ తేదీన జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ సిద్ధాంతాలకు ప్రభావితుడయ్యాడు. తెలుగు అకాడమీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కోఠిలోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషా నిలయంలో గత 50 ఏళ్లుగా కార్యదర్శిగా[2], గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ వ్యవస్థాపకులుగా, గాంధీ పీస్ ఫౌండేషన్ కార్యదర్శిగా సేవలందించారు.[3]

వ్యక్తిగత జీవితంసవరించు

ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2012వ సంవత్సరంలో భార్య ప్రమీలాదేవి మరణించారు.

మరణంసవరించు

ఇతడు 2016, ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు[4],[5].

పదవులుసవరించు

 • కార్యదర్శి - శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం
 • సాధారణ కార్యదర్శి - ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
 • కోశాధికారి - తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
 • సెనెట్ మెంబర్ - ఉస్మానియా విశ్వవిద్యాలయం
 • వ్యవస్థాపకుడు - గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్
 • కార్యదర్శి - గాంధీ పీస్ ఫౌండేషన్
 • ట్రస్టీ - గాంధీ భవన్, హైదరాబాదు
 • సలహా సంఘసభ్యుడు - ఆకాశవాణి, హైదరాబాదు[6]
 • సలహా సంఘసభ్యుడు - దూరదర్శన్, హైదరాబాదు
 • సభ్యుడు - ఫిలిం సెన్సార్ బోర్డ్, హైదరాబాదు
 • సభ్యుడు - తెలుగు ఉర్దూ నిఘంటు పథక సంఘం - ఉర్దూ అకాడమీ

రచనలుసవరించు

ఇతడు దాదాపు 38 గ్రంథాలను రాజకీయ, చారిత్రక అంశాలపై రచించాడు.[7] వాటిలో కొన్ని:

 1. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు
 2. స్వాతంత్ర్య సమర సేనానులు
 3. నూరుగురు తెలుగు ప్రముఖులు
 4. స్వాతంత్ర్య సారథులు
 5. స్వామి రామానంద తీర్థ
 6. సేవాపరాయణ సీతయ్యగుప్త
 7. లోక్‌నాయక్ జయప్రకాష్
 8. సాహసమూర్తి జె. ఈశ్వరీబాయి
 9. తెలంగాణ ప్రముఖులు
 10. తెలంగాణ వైతాళికులు
 11. తెలంగాణ చరిత్ర : ఉద్యమాలు - పోరాటాలు
 12. హైదరాబాదు స్వాతంత్ర్య ఉద్యమం - తెలంగాణ
 13. వందేమాతరం
 14. మాడపాటి హన్మంతరావు జీవిత చరిత్ర
 15. వినోబా జీవితం - ఉద్యమం
 16. మొరార్జీదేశాయ్
 17. ఇందిరాగాంధీ జీవితచరిత్ర
 18. జాతీయోద్యమ నిర్మాతలు
 19. భారత జాతీయ కాంగ్రెస్ ఆంధ్రుల పాత్ర
 20. నెహ్రూల పరంపర
 21. 20వ శతాబ్ది తెలుగు వెలుగులు
 22. ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు
 23. ప్రభాకర్‌జీ సంస్మరణ గ్రంథం
 24. ప్రతిభా వైజయంతి ( పి.వి.నరసింహారావు సన్మాన సంచిక - ప్రధాన సంపాదకుడు)
 25. శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం 100 సంవత్సరాల సంక్షిప్త చరిత్ర
 26. రాజీవ్ గాంధీ సంక్షిప్త జీవిత చరిత్ర
 27. షిరిడీ సాయిబాబా జీవిత చరిత్ర
 28. మహాత్మాగాంధి సంక్షిప్త జీవిత చరిత్ర
 29. Hyderabad Freedom Movement - Telangana

పురస్కారాలుసవరించు

 • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్.
 • ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
 • తెలుగు విశ్వవిద్యాలయం వారిచే అయ్యంకి వెంకటరమణయ్య పురస్కారం.
 • అఖిల భారతీయ భాషా సమ్మేళనం, భోపాల్ వారిచే సాహిత్యశ్రీ బిరుదు.
 • సనాతన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిచే శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు